E-Paper
Advertisement

సినీ చరిత్రను తిరగ రాసిన గ్రేటెస్ట్ యాక్షన్ సినిమాలు ఇవే… వీటి ట్రైలర్ చూస్తేనే మీ మైండ్ బ్లాక్ అయిపొద్ది

సినీ చరిత్రను తిరగ రాసిన గ్రేటెస్ట్ యాక్షన్ సినిమాలు ఇవే… వీటి ట్రైలర్ చూస్తేనే మీ మైండ్ బ్లాక్ అయిపొద్ది
Advertisement

Action Movies OTT : సినిమా అంటేనే ఒక అద్భుత ప్రపంచం. అందులోనూ యాక్షన్ జానర్ ఇచ్చే కిక్కు వేరు. కొన్ని సినిమాలు కేవలం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా, సినిమా తీసే పద్ధతినే మార్చేశాయి. గన్ ఫైట్స్, మార్షల్ ఆర్ట్స్, కార్ ఛేజింగ్‌లతో ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టే ఆ ఆల్‌టైమ్ క్లాసిక్ యాక్షన్ సినిమాలపై ఒక లుక్కేద్దాం.

1. సెవెన్ సమురాయ్ (Seven Samurai)

1954లో అకిరా కురోసావా దర్శకత్వంలో వచ్చిన ఈ జపనీస్ చిత్రం యాక్షన్ సినిమాలకు ఒక బాస్ లాంటిది. ఇందులో గ్రామీణ ప్రజలను రక్షించడానికి ఏడుగురు యోధులు చేసే పోరాటం అద్భుతం. నేటికీ మన సినిమాల్లో చూసే ఒక గ్రామం కోసం హీరోలు రావడం అనే కాన్సెప్ట్ దీని నుండే పుట్టింది. ఇది అమెజాన్ ప్రైమ్ లో ఉంది.

2. ఎంటర్ ది డ్రాగన్ (Enter the Dragon)

Advertisement

మార్షల్ ఆర్ట్స్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు బ్రూస్ లీ. ఆయన స్టైల్, వేగం, ఆ అరుపులు ఈ సినిమాను ఒక లెజెండరీ మూవీగా మార్చాయి. ప్రపంచవ్యాప్తంగా కుంగ్ ఫూ పిచ్చిని పెంచిన సినిమా ఇది. 1973లో వచ్చిన ఈ సినిమా ఆపిల్ టీవీ (Apple TV), అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.

3. డై హార్డ్ (Die Hard)

ఒక పెద్ద భవనంలో బందీలుగా ఉన్న వాళ్ళను ఒకే ఒక్క పోలీస్ ఆఫీసర్ ఎలా కాపాడాడు అనేదే ఈ సినిమా. బ్రూస్ విల్లీస్ కెరీర్‌లోనే ఇది అతిపెద్ద హిట్. వన్ మ్యాన్ ఆర్మీ సినిమాలకు ఇది ఒక ట్రెండ్ సెట్టర్. 1988లో వచ్చిన ఈ సినిమాను జియో హాట్‌స్టార్ (jio Hotstar)లో చూడవచ్చు.

4. టెర్మినేటర్ 2: జడ్జ్‌మెంట్ డే (Terminator 2)

Advertisement

ఇది జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్. 1991లోనే లిక్విడ్ మెటల్ విలన్‌ని సృష్టించి అప్పట్లోనే ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఆర్నాల్డ్ స్వార్జెనెగర్ నటన, భారీ యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాని ఒక మాస్టర్ పీస్‌గా నిలబెట్టాయి. నెట్‌ఫ్లిక్స్ (Netflix), ప్రైమ్ వీడియో (Prime Video)లో ఈ సినిమాను చూడవచ్చు.

5. హార్డ్-బాయిల్డ్ (Hard-Boiled)

హాంకాంగ్ సినిమా సత్తా చాటిన చిత్రం ఇది. దర్శకుడు జాన్ వూ తన మార్క్ స్టైల్‌తో యాక్షన్ సీన్లను కొరియోగ్రఫీ చేసిన విధానం చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఆసుపత్రిలో జరిగే క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ సినీ చరిత్రలోనే అత్యుత్తమమైనది. ఈ 1992 మూవీని
యూట్యూబ్ లో చూడవచ్చు.

6. మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్ (Mad Max: Fury Road)

ఈ సినిమాలో డైలాగులు తక్కువ.. దుమ్ము దులపడం ఎక్కువ. ఎడారిలో జరిగే ఆ కార్ ఛేజింగ్ సీన్లు చూస్తుంటే మనకు ఊపిరి ఆగిపోతుంది. ఇది ఒక ప్యూర్ యాక్షన్ పోయెట్రీ అని చెప్పవచ్చు. 2015లో వచ్చిన ఇది జియో హాట్ స్టార్, ఆపిల్ టీవీలో అందుబాటులో ఉంది.

Read Also : గ్యాంగ్ స్టర్లను గడగడలాడించే ట్రక్ డ్రైవర్… ఊహించని క్లైమాక్స్… ఐయండిబిలో 7.8 రేటింగ్

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×