E-Paper
Advertisement

గ్యాంగ్ స్టర్లను గడగడలాడించే ట్రక్ డ్రైవర్… ఊహించని క్లైమాక్స్… ఐయండిబిలో 7.8 రేటింగ్

గ్యాంగ్ స్టర్లను గడగడలాడించే ట్రక్ డ్రైవర్… ఊహించని క్లైమాక్స్… ఐయండిబిలో 7.8 రేటింగ్
Advertisement

Crime Thriller OTT: రియల్ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలకు ఆదరణ ఎక్కువగానే ఉంది. ఇక మాఫియా లాంటి థ్రిల్లర్ స్టోరీలను ప్రేక్షకులు అస్సలు వదలటం లేదు. ఈ నేపథ్యంలో 1950 నుండి 1970 వరకు అమెరికాలోని మాఫియా ప్రపంచం, రాజకీయాల చుట్టూ ఓ సినిమా రూపొందింది. ఒక ట్రక్ డ్రైవర్ ఎలా మాఫియా డాన్ గా మారాడనే కథను ఇందులో కళ్ళకు కట్టినట్లు చూపించారు. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు తప్పక చూడాల్సిన చిత్రమిది. ఐయండిబిలో ఈ సినిమాకు 7.8 రేటింగ్ కూడా ఉంది.

నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

మార్టిన్ స్కోర్సెస్ దర్శకత్వంలో 2019లో వచ్చిన “ది ఐరిష్‌మాన్” (The Irishman) ఒక అద్భుతమైన క్రైమ్ డ్రామా. చార్లెస్ బ్రాండ్ రాసిన “ఐ హియర్డ్ యు పెయింట్ హౌసెస్” పుస్తకం ఆధారంగా రూపొందింది. ఈ కథలో ఫ్రాంక్ షీరన్ పాత్రలో రాబర్ట్ డి నీరో, మాఫియా బాస్ రస్సెల్ బుఫాలినో పాత్రలో జో పెస్సీ, లేబర్ యూనియన్ నాయకుడు జిమ్మీ హాఫా పాత్రలో అల్ పాసినో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో తెలుగు ఆడియోతో కూడా అందుబాటులో ఉంది. ఈ సినిమా నిర్మాణానికి సుమారు $159 మిలియన్లు (దాదాపు ₹1,100 కోట్లు) ఖర్చయ్యింది. నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఇది కూడా ఒకటి. ఈ చిత్రం 10 అకాడమీ అవార్డులకు నామినేట్ అవ్వడం విశేషం. ఈ సినిమా నిడివి 3 గంటల 29 నిమిషాలు. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన అత్యంత సుదీర్ఘమైన సినిమాల్లో ఇది కూడా ఒకటి.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఫ్రాంక్ అనే ఒక మామూలు ట్రక్ డ్రైవర్ గా బతుకుతుంటాడు. అనుకోకుండా అతనికి రస్సెల్ బుఫాలినో అనే ఒక పెద్ద మాఫియా డాన్ పరిచయమవుతాడు. ఫ్రాంక్ నమ్మకాన్ని చూసి రస్సెల్ అతన్ని తన టీమ్‌లోకి తీసుకుంటాడు. అలా ఫ్రాంక్ మెల్లమెల్లగా మాఫియా కోసం హత్యలు చేసే ‘హిట్ మాన్’గా మారుతాడు. తర్వాత రస్సెల్ ద్వారా ఫ్రాంక్‌కి జిమ్మీ హాఫా అనే ఒక పవర్ ఫుల్ లేబర్ యూనియన్ లీడర్ పరిచయమవుతాడు. జిమ్మీ అంటే అప్పట్లో అమెరికాలో ఒక రేంజ్ క్రేజ్. ఫ్రాంక్ అతనికి బాడీగార్డ్‌గా, ప్రాణ స్నేహితుడిగా మారిపోతాడు. అయితే జిమ్మీకి ఉన్న పొగరు, మొండితనం వల్ల మాఫియా వాళ్లతో గొడవలు మొదలవుతాయి. ఒక పక్క తనకి లైఫ్ ఇచ్చిన రస్సెల్, ఇంకో పక్క తన ప్రాణ స్నేహితుడు జిమ్మీ. ఈ ఇద్దరి మధ్య ఫ్రాంక్ నలిగిపోతుంటాడు. కానీ మాఫియాలో ఎదురు తిరిగితే చావే గతి. చివరికి మాఫియా పెద్దలు జిమ్మీని లేపేయాలని డిసైడ్ అవుతారు. ఆ పనిని ఫ్రాంక్‌కే అప్పగిస్తారు. తన సొంత స్నేహితుడినే తనే చంపాల్సి రావడం ఫ్రాంక్ జీర్ణించుకోలేక పోతాడు. చివరికి జిమ్మీని ఫ్రాంక్ చంపుతాడా ? మాఫియాకు ఎదురు తిరుగుతాడా ? అనేది ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : సినీ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిన బెస్ట్ హిస్టారికల్ మూవీస్ ఇవే… వీటిలో మీరెన్ని చూసారు ?

Tags

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×