E-Paper
Advertisement

మాఫియా డాన్ల మధ్య మొదలయ్యే వేట… ఆఖరి నిమిషం వరకు ఊపిరి బిగబట్టించేలా చేసే సినిమా

మాఫియా డాన్ల మధ్య మొదలయ్యే వేట… ఆఖరి నిమిషం వరకు ఊపిరి బిగబట్టించేలా చేసే సినిమా
Advertisement

Action Thriller OTT : కౌ బాయ్ లాంటి యాక్షన్ థ్రిల్లర్ సినిమాను చూడాలనుకుంటే, ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను చూసేయచ్చు. ఈ సినిమా మేకింగ్ స్టైల్ చాలా భిన్నంగా ఉంటుంది. ఇది హాంకాంగ్ సినిమా చరిత్రలో అత్యుత్తమ యాక్షన్ చిత్రాలలో ఒకటిగా నిలిచిపోయింది. గన్ ఫైట్స్ తో పాటు స్టోరీ కూడా ఆకట్టుకుంటుంది. మాఫియా గ్యాంగ్ చుట్టూ తిరిగే ఈ సినిమా క్లైమాక్స్ మరింత గట్టిగా ఉంటుంది. దీనికి ఐయండిబిలో 7.2 రేటింగ్ కూడా ఉంది. దీని పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

ఎక్కడ చూడచ్చు అంటే

ప్రముఖ దర్శకుడు జానీ టో దర్శకత్వంలో వచ్చిన ఈ హాంకాంగ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఎక్సైల్డ్’ (Exiled). అసలు విషయం ఏమిటంటే, దర్శకుడు జానీ టో ఎటువంటి పక్కా స్క్రిప్ట్ లేకుండానే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. సెట్స్‌లోనే సన్నివేశాలను తగ్గట్టుగా డైలాగులు రాసేవారు. అందుకే ఇందులో మాటల కంటే విజువల్స్, గన్-ఫైట్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా ఇందులోని స్లో మోషన్ షూటౌట్స్, లైటింగ్ వాడిన విధానం అంతర్జాతీయ స్థాయిలో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి, దీనిని ఒక ఆధునిక ‘కౌబాయ్’ తరహా చిత్రంగా చెప్పుకుంటారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాలో నటించిన ప్రధాన నటీనటులంతా జానీ టో గతంలో తీసిన ‘ది మిషన్’ (1999) చిత్రంలో కూడా నటించారు. ఆ సినిమాకు ఇది నేరుగా సీక్వెల్ కాకపోయినా, అదే తరహా గ్యాంగ్‌స్టర్ మూడ్‌ని ఇందులో చూడవచ్చు. 2006లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా, ప్రస్తుతం prime video, plex ఓటీటీల్లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

చాలా కాలంగా ఒక ఐదుగురు మాఫియా షూటర్లు ఒక మాఫియా డాన్ దగ్గర పనిచేస్తుంటారు. అయితే వూ అనే షూటర్ తన బాస్‌ని చంపడానికి ప్రయత్నించి ఫెయిల్ అవుతాడు. దీంతో ప్రాణ భయంతో అతను అజ్ఞాతంలో ఉంటాడు. అతడిని చంపడానికి బాస్ ఇద్దరు షూటర్లను పంపిస్తాడు. వాళ్ళు కూడా ఒకప్పుడు వూ కి స్నేహితులను ఉన్న వాళ్ళే. సరిగ్గా అదే సమయానికి వూని కాపాడటానికి మరో ఇద్దరు స్నేహితులు అక్కడికి చేరుకుంటారు. ఒకరికొకరు గన్‌లు గురిపెట్టుకున్నా, పాత స్నేహం గుర్తొచ్చి అందరూ కలిసి భోజనం చేస్తారు. తన భార్యాబిడ్డల భవిష్యత్తు కోసం వూ చేసే చివరి కోరికను వాళ్లు మన్నిస్తారు. వూ ఫ్యామిలీకి డబ్బు సెటిల్ చేయడం కోసం ఈ ఐదుగురు కలిసి ఒక పెద్ద బంగారు స్కామ్‌లో తలదూర్చుతారు.

అయితే అనుకోకుండా వాళ్ల గ్యాంగ్ బాస్ తో వీళ్ళకి గొడవ జరుగుతుంది. ఒక రెస్టారెంట్‌లో జరిగిన భారీ షూటౌట్‌లో వూ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. చనిపోయే ముందు తన కుటుంబాన్ని కాపాడమని తన స్నేహితుల దగ్గర మాట తీసుకుంటాడు. మిగిలిన నలుగురు స్నేహితులు ఎలాగైనా ఆ బంగారాన్ని వూ భార్యకు చేర్చాలని నిర్ణయించుకుంటారు. చివరికి ఆ బంగారం కోసం, వూ భార్యను కాపాడటం కోసం ఈ నలుగురు స్నేహితులు తమ ప్రాణాలకు తెగించి పోరాడతారు. తమ స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం, తమ ప్రాణాలను పణంగా పెడతారు. మరి వీళ్ళ త్యాగాలు ఫలిస్తాయా ? వూ భార్యను వీళ్ళు కాపాడతారా ? ఆమెకు మంచి జీవితం ఇస్తారా ? వీళ్ళ బాస్ నుంచి ఎలాంటి సమస్యలు వస్తాయి ? అనే విషయాలను, ఈ యాక్షన్ థ్రిల్లర్ ను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : ఇదెక్కడి సినిమా బాబోయ్… ఊరు ఊరంతా జాంబిలు… ఇక్కడ బతకడం చావు కన్నా దారుణం

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×