E-Paper
Advertisement

Action Thriller OTT : 22 అవార్డులను గెలుచుకున్న 2 గంటల 20 నిమిషాల యాక్షన్ డ్రామా… ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్

Action Thriller OTT : 22 అవార్డులను గెలుచుకున్న 2 గంటల 20 నిమిషాల యాక్షన్ డ్రామా… ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్
Advertisement

Action Thriller OTT : సౌత్ ఇండస్ట్రీలో థ్రిల్లర్ సినిమాల హవా కొనసాగుతోంది. మంచి రేటింగ్ తో కూడా ఓటీటీలో ఈ జోనర్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆడియన్స్ కూడా నచ్చిన సినిమాలను, దొరికిన సమయంలో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఈ ఏకంగా 22 అవార్డులు గెలుచుకుని రికార్డ్ సృష్టించింది. 2 గంటల 20 నిమిషాల ఈ యాక్షన్ థ్రిల్లర్ ను ఇప్పుడు ఓటీటీలో ఫ్రీగానే చూడవచ్చు. మరి ఈ సినిమా పేరు ఏమిటి? ఏ ఓటీటీ లో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఈ సినిమా పేరు ఏమిటంటే

ఈ సినిమా మరెమిటో కాదు 2019 లో విడుదలైన తమిళ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “అసురన్” (Asuran). వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ధనుష్, ప్రకాష్ రాజ్, పవన్, పశుపతి, మంజు వారియర్, ఎ. వెంకటేష్ తదితరులు నటించారు. ఈ సినిమా ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీతం, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఈ సినిమా యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది . దీనిని ప్రైమ్ వీడియోలో కూడా ఆస్వాదించవచ్చు. దీనికి IMDbలో 8.4 టాప్ రేటింగ్‌ కూడా ఉంది.

కథ ఏమిటి?

Advertisement

ఈ సినిమా శివసామి (ధనుష్), అతని కుటుంబం చుట్టూ తిరుగుతుంది. అయితే వీళ్ళు పేద రైతులు. శివసామి తన భార్య, ముగ్గురు పిల్లలతో ఒక చిన్న గ్రామంలో తనకున్న చిన్నపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ నివసిస్తుంటాడు. అయితే ఆ ఊరిలోని అగ్రవర్ణ భూస్వామి నరసింహన్, శివసామి భూమిని లాక్కోవాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో జరిగే గొడవలో శివసామి పెద్ద కొడుకు మురుగన్ దారుణంగా హత్యకు గురవుతాడు. అన్న మరణానికి ప్రతీకారంగా, చిన్న కొడుకు చిదంబరం ఆ భూస్వామిని చంపేస్తాడు.

ఈ సంఘటనతో కొడుకును కాపాడుకోవడానికి శివసామి అడవుల్లోకి పారిపోతాడు. పారిపోయే క్రమంలో తన తండ్రి పిరికివాడని భావించే చిదంబరానికి, తన తండ్రి గతం తెలుస్తుంది. ఆ తరువాత కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. శివసామి గతం ఏమిటి ? అతను తన కొడుకును కాపాడుకున్నాడా ? అనే విషయాలను ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : కూతురి చావుపై అనుమానం… కన్నింగ్ అల్లుడి కొత్త కాపురంపై మామ కన్ను… నరాలు కట్టయ్యే సస్పెన్స్ భయ్యా ఇదీ

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×