Malayalam Crime Drama OTT : ఓటీటీలో ముందుగా ప్రేక్షకులు థ్రిల్లర్ కంటెంట్ కోసమే ఎక్కువగా వెతుకుతున్నారు. భాషతో సంబంధం లేకుండా వీటిని చూడడానికి ఇష్టపడుతున్నారు. ఇక మలయాళ సినిమాలను ఆడియన్స్ అస్సలు వదిలిపెట్టడం లేదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కథ ఆసక్తికరమైన మలుపులు తిరుగుతూ ఉంటుంది. ఆడియన్స్ కూడా అలా చూస్తూ ఉండిపోతారు. ఇందులో సూరజ్ వెంజరమూడు నటన ఆడియన్స్ ని కట్టిపడేస్తుంది. కూతురి చావుపై అల్లుడిని అనుమానించే ఓ తండ్రి చుట్టూ కథ తిరుగుతుంది. ఈ మలయాళ థ్రిల్లర్ పేరు ఏమిటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది? అనే వివరాల్లోకి వెళ్తే…
2021లో వచ్చిన ఈ మలయాళ థ్రిల్లర్ మూవీ పేరు ‘కానెక్కానే’ (kaanekkaane). బాబీ, సంజయ్ కథను అందించగా, మను అశోకన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సూరజ్ వెంజరమూడు, టోవినో థామస్, ఐశ్వర్య లక్ష్మి, శృతి రామచంద్రన్ ముఖ్య పాత్రలు పోషించారు. డ్రీమ్‌కాచర్ బ్యానర్‌పై టి.ఆర్. శంసుద్దీన్ నిర్మించిన ఈ చిత్రం 2021 సెప్టెంబర్ 17 న సోనీలైవ్ ద్వారా నేరుగా విడుదలైంది. ఈ సినిమాలో మనుషుల మధ్య ఉండే సంబంధాలను, మానసిక స్థితిని దర్శకుడు మను అశోకన్ అద్భుతంగా తెరకెక్కించారు.ప్రతి క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎమోషనల్ జర్నీ చూపిస్తుంది. ఐయండిబి లో దీనికి 7.5 రేటింగ్ ఉంది.
పాల్ మథాయ్ (సురాజ్ వెంజరామూడు) ఒక రిటైర్డ్ డిప్యూటీ తహశీల్దార్. అతని కుమార్తె షెరిన్ (శృతి రామచంద్రన్) ఒక రోడ్డు ప్రమాదంలో మరణిస్తుంది. అయితే ఒక సంవత్సరం తర్వాత, పాల్ తన అల్లుడు అలెన్ (టోవినో థామస్) ఇంటికి వస్తాడు. అప్పటికే అలెన్, స్నేహ (ఐశ్వర్య లక్ష్మి) అనే మరో మహిళను వివాహం చేసుకుని ఉంటాడు. స్నేహ ప్రస్తుతం గర్భవతిగా కూడా ఉంటుంది. పాల్ తన కూతురు మరణించిన ప్రమాదానికి సంబంధించిన కేసును విచారిస్తుంటాడు.
ఈ క్రమంలో, తన కూతురు ప్రమాదానికి గురైనప్పుడు ఆమెను కాపాడే అవకాశం ఉన్నా, అలెన్ ఉద్దేశపూర్వకంగానే ఆమెను రోడ్డుపై వదిలేసి వెళ్ళిపోయాడని పాల్‌కు అనుమానం కలుగుతుంది. ఇక కథ మరింత ఆసక్తిగా మారుతుంది. తన కూతురు మరణానికి అల్లుడే కారణమని తెలిసిన తర్వాత పాల్ ఎలా స్పందించాడు? అలెన్ తన నేరాన్ని ఒప్పుకున్నాడా? అసలు ఆ ప్రమాదం జరిగిన రోజు ఏం జరిగింది? అనేదే మిగిలిన కథ.
Read Also : అమ్మాయిని ముక్కలు ముక్కలుగా కట్ చేసి… కూర వండుకుని తినే సైకో… గూస్ బంప్స్ పక్కా