Action Thriller OTT : గత ఏడాది ఓటీటీలోకి వచ్చిన ఒక యాక్షన్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా థియేటర్లకి వెల్లకుండానే ఓటీటీలోకి అడుగుపెట్టి రికార్డులు సృష్టించింది. దాదాపు 79 దేశాల్లో ఇది నంబర్ 1 స్థానంలో నిలిచింది. హీరోయిన్ జీన్ గౌర్సాడ్ చేసిన ఫైట్స్ చాలా రియలిస్టిక్‌గా ఉంటాయి. ఆమె ఒక సోల్జర్‌గా కనిపించడానికి ప్రత్యేకంగా మిలిటరీ ట్రైనింగ్ కూడా తీసుకుంది. ఇక సినిమాలో వచ్చే గన్ ఫైట్స్, ఛేజింగ్ సీన్స్ ఓ రేంజ్‌లో ఉంటాయి. యాక్షన్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఓ పట్టు పట్టాల్సిన సినిమా ఇది.
ఈ జర్మన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా పేరు ‘ఎక్స్‌టెరిటోరియల్’ (Exterritorial). క్రిస్టియన్ జుబెర్ట్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్ జీన్ గౌర్సాడ్ ఇంతకుముందు ‘బార్బేరియన్స్’ అనే సిరీస్‌తో ఫేమస్ అయింది. ఇప్పుడు ఈ సినిమాతో ఆమె గ్లోబల్ యాక్షన్ స్టార్ అయిపోయింది. అలాగే విలన్ రోల్ చేసిన డౌగ్రే స్కాట్ (మిషన్ ఇంపాజిబుల్ 2 ఫేమ్) నటన కూడా సినిమాకు పెద్ద ప్లస్ అయింది. ఇది 2025 ఏప్రిల్ 30న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై, అత్యంత విజయవంతమైన జర్మన్ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ సినిమా విడుదలైన కేవలం 12 వారాల్లోనే 90 మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. జర్మనీ నుంచి వచ్చిన సినిమాల్లో నెట్‌ఫ్లిక్స్‌లో ఇదే బిగ్గెస్ట్ హిట్. ఇది ఒరిజినల్ జర్మన్ భాషతో పాటు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వంటి భాషల్లో కూడా డబ్బింగ్ వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి.
సారా అనే ఒక మాజీ మిలిటరీ ఆఫీసర్, తన చిన్న కొడుకు జోష్‌తో కలిసి ఫ్రాంక్‌ఫర్ట్‌లోని అమెరికన్ కాన్సులేట్ ఆఫీసుకి వెళ్తుంది. అక్కడ ఏదో పని మీద లోపలికి వెళ్ళిన కొడుకు, సడన్‌గా మాయమైపోతాడు. కంగారుపడిపోయి అక్కడ ఉన్నోళ్లని అడిగితే, నీ కొడుకు అసలు లోపలికే రాలేదని రివర్స్‌లో బుకాయిస్తారు. బిల్డింగ్ మొత్తం వెతికినా ఎక్కడా ఆ పిల్లాడు కనిపించడు. తన కళ్ల ముందే ఉన్న కొడుకుని లేడని చెప్పేసరికి సారాకి పిచ్చెక్కిపోతుంది. ఇప్పుడు తన మిలిటరీ ట్రైనింగ్ బయటకి తీస్తుంది. నా కొడుకుని ఇవ్వకపోతే ఈ బిల్డింగ్‌ని తగలేస్తా అన్నట్టుగా అక్కడే తిష్ట వేస్తుంది. ఆమె వెనకాల పోలీసులు, సెక్యూరిటీ గ్యాంగ్‌లు పడినా సరే, ఆ బిల్డింగ్ లో ఉన్న రహస్య, సీక్రెట్ రూమ్‌లు వెతుక్కుంటూ అరాచకం సృష్టిస్తుంది.
ఆ ఆఫీసు లోపల ఏదో పెద్ద స్కామ్ జరుగుతుందని, దానికి తన కొడుకు బలయ్యాడని ఆమెకు అర్థమవుతుంది. ఈ క్రమంలో ఆ కాన్సులేట్ లోపల అమెరికన్ ఆఫీసర్లు చేస్తున్న దారుణాలు, ఒక పెద్ద పొలిటికల్ కుట్ర బయటపడతాయి. చుట్టూ వందల మంది గన్‌లతో ఉన్నా భయపడకుండా, తన కొడుకుని కాపాడుకోవడానికి సారా ఒంటరి పోరాటం చేస్తుంది. చివరికి సారా తన కొడుకును కనిపెడుతుందా ? ఆ పిల్లాడిని ఎవరు కిడ్నాప్ చేస్తారు ? ఎందుకు చేశారు ? ఈ కథ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను, ఈ జర్మన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : గ్యాంగ్ స్టర్లను గడగడలాడించే ట్రక్ డ్రైవర్… ఊహించని క్లైమాక్స్… ఐయండిబిలో 7.8 రేటింగ్