E-Paper
Advertisement

గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారా? నిమిషాల్లో ఉపశమనం ఇచ్చే హోం రెమెడీస్ ఇవే!

గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారా? నిమిషాల్లో ఉపశమనం ఇచ్చే హోం రెమెడీస్ ఇవే!
Advertisement

Gastric Problems: అసమతుల్య ఆహారపు అలవాట్లు, సమయానికి భోజనం చేయకపోవడం, మితిమీరిన ఒత్తిడి వల్ల చాలామంది ‘గ్యాస్ట్రిక్’ సమస్యతో బాధపడుతుంటారు. కడుపులో మంట, ఉబ్బరం, తేన్పులు , అజీర్ణం వంటి లక్షణాలు మనల్ని రోజంతా అసౌకర్యానికి గురిచేస్తాయి. ప్రతి చిన్న సమస్యకు ఇంగ్లీష్ మందులు వాడటం కంటే.. మన పూర్వీకులు సూచించిన ఆయుర్వేద చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరిచి గ్యాస్ సమస్యను తరిమికొట్టే పవర్ ఫుల్ హోమ్ రెమెడీస్ ఇప్పుడు చూద్దాం.

గ్యాస్ట్రిక్ సమస్యలకు 6 హోం రెమెడీస్:
1. వాము:
గ్యాస్ సమస్యకు వాము ఒక అద్భుతమైన మందు. ఇందులో ఉండే ‘థైమోల్’ అనే సమ్మేళనం జీర్ణరసాలను వేగంగా విడుదల చేయడంలో సహాయ పడుతుంది.

Advertisement

ఎలా వాడాలి: అర టీస్పూన్ వామును కొద్దిగా ఉప్పుతో కలిపి నమిలి గోరు వెచ్చని నీటిని తాగాలి. లేదా ఒక గ్లాసు నీటిలో వాము వేసి మరిగించి ఆ కషాయాన్ని తాగితే తక్షణ ఉపశమనం కలుగుతుంది.

2. అల్లం :
అల్లం సహజంగానే.. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి.

Advertisement

ఎలా వాడాలి: భోజనం చేసిన తర్వాత చిన్న అల్లం ముక్కను నమలడం లేదా అల్లం టీ తాగడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది.గ్యాస్ వల్ల వచ్చే కడుపు నొప్పికి ఇది మంచి పరిష్కారం.

3. జీలకర్ర నీరు :
జీలకర్ర లాలాజల గ్రంథులను ఉత్తేజితం చేసి ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది.

ఎలా వాడాలి: ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా జీలకర్ర వేసి ఐదు నిమిషాలు మరిగించాలి. ఈ నీటిని వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ప్రతిరోజూ ఉదయం పరగడపున ఇది తాగితే గ్యాస్ సమస్య శాశ్వతంగా దూరమవుతుంది.

4. ఇంగువ :
పురాతన కాలం నుంచి గ్యాస్ట్రిక్ సమస్యలకు ఇంగువను ఒక దివ్యౌషధంగా వాడుతున్నారు. ఇది కడుపులోని గ్యాస్‌ను సులభంగా బయటకు పంపుతుంది.

ఎలా వాడాలి: చిటికెడు ఇంగువను గోరు వెచ్చని నీటిలో కలిపి తాగాలి. చిన్న పిల్లలకు కడుపు ఉబ్బరంగా ఉంటే.. కొద్దిగా ఇంగువను నీటిలో కలిపి బొడ్డు చుట్టూ రాస్తే త్వరగా ఉపశమనం లభిస్తుంది.

Also Read: జామ పండు కంటే ఆకులే శక్తివంతం.. ఎందుకో తెలుసా ?

5. పుదీనా :
పుదీనాలో ఉండే మెంథాల్ జీర్ణనాళంలోని కండరాలను రిలాక్స్ చేస్తుంది. దీని వల్ల గ్యాస్ సులభంగా వెళ్ళిపోతుంది.

ఎలా వాడాలి: పుదీనా ఆకులను నేరుగా నమలవచ్చు లేదా పుదీనా రసాన్ని ఒక గ్లాసు నీటిలో కలిపి తాగవచ్చు. ఇది కడుపులో మంటను కూడా తగ్గిస్తుంది.

6. బేకింగ్ సోడా, నిమ్మరసం:
తక్షణమే గ్యాస్ నుంచి ఉపశమనం కావాలంటే.. ఇది ఒక ఎఫెక్టివ్ చిట్కా. ఇది సహజ సిద్ధమైన ‘ఈనో’ లా పనిచేస్తుంది.

ఎలా వాడాలి: ఒక గ్లాసు నీటిలో అర చెంచా బేకింగ్ సోడా, ఒక నిమ్మకాయ రసం కలిపి తాగాలి. అయితే.. బీపీ ఉన్నవారు సోడా వాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.

Related News

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

Big Stories

Advertisement
×