Action Thriller OTT : ఏదయినా ఒక ఒక గొప్ప సినిమా కోసం చూస్తున్నట్లయితే, ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాపై ఓ లుక్ వేయండి. 27 ఏళ్ల నాటి ఈ హాలీవుడ్ సినిమా మీ అంచనాలను తగ్గట్టే ఉంటుంది. ఈ చిత్రంలో ప్రసిద్ధ హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ కథానాయకుడిగా జీవేంచేశాడనే చెప్పాలి. ఇందులోని సస్పెన్స్ ఎంతగా ఉంటుందంటే, క్లైమాక్స్ వరకు స్టోరీ మీ ఊహకు కూడా అందదు. దీనికి IMDbలో 8.8 రేటింగ్ ఉందంటేనే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పుకోవచ్చు. ఈ సినిమా 1999లో విడుదలైనప్పుడు థియేటర్లలో పెద్దగా ఆడలేదు. చాలా మంది విమర్శకులు ఇందులోని హింసను చూసి తప్పుబట్టారు. కానీ డీవీడీ రూపంలో విడుదలయ్యాక ఈ సినిమాకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. నేడు ఇది ప్రపంచంలోని అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
సినిమా ప్రపంచంలో ఒక మేధావి దర్శకుడైన డేవిడ్ ఫించర్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులోని క్లైమాక్స్ ట్విస్ట్ సినిమా చరిత్రలోనే అత్యుత్తమమైనదిగా ఇప్పటికీ చెప్పుకుంటారు. 1999 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా పేరు ‘ఫైట్ క్లబ్’ (Fight Club). ఈ ఐకానిక్ యాక్షన్ థ్రిల్లర్ చక్ పలాహ్నిక్ రాసిన నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇందులో బ్రాడ్ పిట్, ఎడ్వర్డ్ నార్టన్, హెలెనా బోనమ్ కార్టర్ లీడ్ రోల్స్ లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్ స్టార్ (Jio hotstar)లో అందుబాటులో ఉంది.
ఒక మామూలు ఆఫీసు ఉద్యోగి నారేటర్. ఇతను నిద్రలేమి, బోర్ కొట్టే తన జీవితంతో విసిగిపోయి ఉంటాడు. ఆ సమయంలో అతనికి టైలర్ డర్డెన్ (బ్రాడ్ పిట్) అనే ఒక వింతైన వ్యక్తి పరిచయం అవుతాడు. టైలర్ ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి. నిజమైన మనిషిగా బ్రతకాలి అంటే దెబ్బలాటల్లో వచ్చే నొప్పిని అనుభవించాలని అతను నమ్ముతాడు. వీరిద్దరూ కలిసి ఒక సీక్రెట్ ‘ఫైట్ క్లబ్’ను ప్రారంభిస్తారు. సమాజం మీద కోపంతో ఉన్న పురుషులంతా అక్కడికి వచ్చి ఒకరితో ఒకరు తలపడుతూ, తమలోని ఫ్రస్ట్రేషన్‌ను పోగొట్టుకుంటారు. మెల్లగా ఈ క్లబ్ ఒక పెద్ద విప్లవాత్మక సంస్థగా మారుతుంది. టైలర్ దీనికి ‘ప్రాజెక్ట్ మేహెమ్’ అని పేరు పెట్టి, నగరంలోని ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చడానికి పెద్ద పెద్ద భవనాలను పేల్చేయాలని ప్లాన్ చేస్తాడు.
అయితే టైలర్ చేస్తున్న ఈ హింసను చూసి హీరో భయపడతాడు. అసలు టైలర్ ఎవరు? వాడు ఎక్కడ ఉన్నాడని వెతుకుతున్న క్రమంలో హీరోకి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. టైలర్ డర్డెన్ అనే వ్యక్తి విడిగా లేడని, వాడు తన సొంత స్ప్లిట్ పర్సనాలిటీ (మరో రూపం) అని గ్రహిస్తాడు. ఈ ట్విస్ట్ కి సినిమా చూసే ఆడియన్స్ కి కూడా దిమ్మతిరిగిపోతుంది. అంటే ఇప్పటి వరకు టైలర్ చేసిన పనులన్నీ హీరో తనకి తెలియకుండా తనే చేశాడు. తన మైండ్‌ను కంట్రోల్ చేస్తున్న టైలర్‌ను వదిలించుకోవడానికి హీరో ప్రయత్నిస్తాడు. చివరగా ఈ స్ప్లిట్ పర్సనాలిటీ నుంచి నారేటర్ బయట పడతాడా ? ఆ పర్సనాలిటీ వల్ల ఎలాంటి చిక్కులు వస్తాయి ? ఈ కథ క్లైమాక్స్ ఎలా ఉంటుంది ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : తల్లి పెళ్లి కోసం అదిరిపోయే స్కెచ్ వేసే కొడుకు… ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ ఎంటర్టైనర్