E-Paper
Advertisement

Comedy Series OTT: తల్లి పెళ్లి కోసం అదిరిపోయే స్కెచ్ వేసే కొడుకు… ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ ఎంటర్టైనర్

Comedy Series OTT: తల్లి పెళ్లి కోసం అదిరిపోయే స్కెచ్ వేసే కొడుకు… ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ ఎంటర్టైనర్
Advertisement

Comedy Series OTT : ఓటీటీలోకి ఒక కొత్త కామెడీ సిరీస్ రాబోతోంది. ఒక పక్క నవ్విస్తూనే, మరోపక్క గుండెకు హత్తుకునేలా ఈ కథ సాగుతుంది. డిఫరెంట్ కంటెంట్ తో వస్తున్న ఈ సిరీస్ ఒక గణిత మేధావి చుట్టూ తిరుగుతుంది. ఇతను ప్రతి విషయాన్ని లెక్కలతోనే పోల్చుకుంటూ ఉంటాడు. ఆఖరికి తన తల్లికి మరో పెళ్లి చేయడానికి కూడా ఫార్ములాతో పరుగులు పెడుతుంటాడు. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఇది పక్కా ఎంటర్టైన్ చేయబోతోంది. ఈ సిరీస్ పేరు ? ఏ ఓటీటీలోకి రాబోతోంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ప్రైమ్ వీడియో (Prime Video)లో స్ట్రీమింగ్

ఈ మ్యాథమెటికల్ కామెడీ డ్రామా పేరు ‘మా కా సమ్’ (Maa Ka Sum). ఇందులో ప్రధాన పాత్రల్లో మోనా సింగ్ (తల్లిగా), మిహిర్ అహుజా (కొడుకుగా) నటించారు. వీళ్ళతో పాటు అంగీరా ధర్, రణవీర్ బ్రార్, రోహన్ జోషి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. జీ స్టూడియోస్ (Zee Studios) నిర్మించిన ఈ సిరీస్ 2026 ఏప్రిల్ 3 నుంచి ప్రైమ్ వీడియో (Prime Video)లో స్ట్రీమింగ్ కానుంది. ఇది హిందీలో రూపొందించబడినప్పటికీ, ప్రైమ్ వీడియో సాధారణంగా తన ఒరిజినల్ సిరీస్‌లను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోకి డబ్ చేసి విడుదల చేస్తుంది. ఇది కూడా అలాగే వచ్చే అవకాశం ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ కథ చాలా సరదాగా, కొత్తగా ఉంటుంది. కథలోకి వెళ్తే, ఒక 19 ఏళ్ల కుర్రాడు మ్యాథ్స్ లో మహా మేధావి. అతనికి లోకంలో ఏ సమస్య వచ్చినా దాన్ని ఈక్వేషన్లతో సాల్వ్ చేయడం అలవాటు. ఈ క్రమంలో తన సింగిల్ మదర్ జీవితంలో మళ్లీ సంతోషం నింపాలని, ఆమెకు ఒక మంచి తోడుని వెతకాలని నిర్ణయించుకుంటాడు. సాధారణంగా పెళ్లి సంబంధాలు చూసినట్టు కాకుండా, మనోడు తన మ్యాథ్స్ తెలివితేటలని ఇక్కడ వాడుతాడు. తన తల్లికి పర్ఫెక్ట్ జోడీ ఎవరో తెలుసుకోవడానికి రకరకాల లెక్కలు వేస్తూ ఒక ప్రత్యేకమైన డేటాను తయారు చేస్తాడు. ఈ క్రమంలో వచ్చే ఫన్నీ ఇన్సిడెంట్స్, ఆ తల్లి కొడుకుల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ ఈ సిరీస్‌లో హైలైట్‌గా నిలుస్తాయి. అయితే జీవితం అంటే కేవలం లెక్కలు, ఫార్ములాలు మాత్రమే కాదని ఆ కుర్రాడు చివరికి ఎలా తెలుసుకున్నాడనేదే అసలు ట్విస్ట్.

Read Also :  ప్రతీకారం తీర్చుకునే ఆత్మ… అమ్మాయి శరీరంలోకి గ్యాంగ్‌స్టర్… మెంటల్ మాస్ మూవీ

Related News

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×