School Upgrade: కర్పోరేట్ స్ధాయిలో సర్కారీ స్కూళ్లు
–క్యూర్ అర్బన్ రీజియన్ పరిధిలోని
–రాష్ట్రంలో 11 స్కూళ్లు అప్గ్రేగేడ్
–రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోనే అత్యధికం
–ఎకరానికి పైగా ఉన్న స్కూళ్లనే ఎంపిక
రంగారెడ్డి బ్యూరో, స్వేచ్చ: రాష్ట్రంలో సర్కారి బడులను పటిష్టం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దశల వారీగా విద్యా వ్యవస్థను ప్రక్షాళిన చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది. అందులో భాగంగానే వచ్చే ఏడాదిలో మరో 11 ప్రభుత్వ స్కూల్స్‌ను ఇంటర్ దాకా అప్గ్రేడ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో మూడు స్కూల్స్‌ను అప్గ్రేడ్ చేసి సక్సెస్ దిశగా నడిపిస్తుంది. రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాలో మూడు ప్రభుత్వ స్కూల్స్‌ను ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేసి సకాల సౌకర్యాలతో నడిపిస్తుంది. ఈ స్కూల్స్‌ను తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) నామాకరణం చేయడం జరిగింది. ఇదే తరహాలో మరిన్ని స్కూల్స్‌కు అప్‌గ్రేడ్‌కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ఫ్రీ–ప్రైమరి నుంచి ఇంటర్మీడియేట్ వరకు ఒకే ప్రాంగణంలో విద్యనందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయితే ఈ స్కూల్ అప్గ్రేడ్ ప్రభుత్వానికి భూ విస్తీర్ణం సవాల్‌గా మారిపోయింది. తక్కువలో తక్కువగా ఎకరం స్థలం ఉండాల్సిందేననే నిబంధన పెట్టుకున్నారు. దీంతో కొన్ని ప్రభుత్వ స్కూల్స్ అర ఎకరం విస్తీర్ణం లేని స్కూల్స్ కూడా ఉండటంతో ప్రభుత్వానికి తలనొప్పిగా మారిపోయింది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోని మొదటగా స్కూల్ ఎంపిక చేసిన తరువాత స్థల సేకరణపై దృష్టి పెట్టాలని భావిస్తుంది. అందుకు అనుగుణంగా కొర్ అర్బన్ రీజియన్ పరిధిని పరిమితంగా పెట్టుకొని స్కూల్స్‌ను ఎంపిక చేసింది. ఎంపిక చేసిన 11 ప్రభుత్వ స్కూల్స్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే అధికంగా ఉండటం గమనార్హం.
రాష్ట్ర ప్రభుత్వం మూడు రీజియన్లుగా విభజిస్తూ నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగు రోడ్డు వరకు కోర్ అర్బన్, రీజినల్ రింగు రోడ్డు వరకు అర్బన్ , ఆతర్వాత ప్రాంతమంతా రూరల్ రీజియన్‌గా విభజిస్తూ పరిపాలన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకు అనుగుణంగా రింగు రోడ్డుల హద్దుగా ప్రాంతాల అభివృద్ధికి సీఎం కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. విద్య వ్యవస్థను అదే పద్దతిలో అభివృద్ధికి ప్రణాళిక చేశారు. కోర్ అర్బన్ రీజియన్ ఔటర్ రింగు రోడ్డు లోపలున్న ప్రాంతాల్లోని పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్ధులకు నాణ్యమైన విద్య అంధించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే మొదటి విడుతలో అర్బన్ రీజియన్‌లో మూడు స్కూల్స్‌ను ఎంపిక చేసి విజయవంతంగా నడిపిస్తున్నారు. ఇప్పుడు కోర్ అర్బన్ ప్రాంతాల్లో 11 స్కూల్స్ ఎంపిక చేసి ముందుకు సాగుతున్నారు.
Also read: Tax Disparity: బీజేపీ యేతర రాష్ట్రాలపై కేంద్రం సవతి తల్లి ప్రేమ: మంత్రి జూపల్లి
రాష్ట్రంలో దశల వారీగా ప్రభుత్వ స్కూల్స్ రూపురేఖలను మార్చాలనే సంకల్పంతో సర్కార్ ముందుకు పోతుంది. పిల్లల చదువు కోసం పేద, మధ్య, ధనిక అనే తేడా లేకుండా అప్పులు చేసి చదివిస్తున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలు పిల్లల చదువు కోసం అనేక కష్టాలు పడుతున్నారు. ఈవిషయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోని అడుగులు వేస్తోంది. కార్పోరేట్ స్ధాయికి దీటుగా స్కూల్స్ ఉండాలని ప్రభుత్వం 23 స్కూల్స్‌ను ఎంపిక చేసింది. ఆ స్కూల్స్లో డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ లాబ్స్, విశాలమైన తరగతి గదులు, లైబ్రరీ, క్రీడాల వంటివి ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా నాణ్యమైన విద్యనందించేందుకు ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్, లైబ్రరీయన్తో పాటు నాన్ టీచింగ్ సిబ్బందిని సైతం కాంట్రాక్ట్ పద్దతిలో నియామకం చేసుకుంటున్నారు. అయితే 23 స్కూల్స్‌ను హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఎంపిక చేశారు.
ఇందులో 12 ప్రాంతాల్లో నూతన భవనాలు నిర్మిస్తున్నారు. అయితే 11 స్కూల్స్లో హైస్కూళ్లు, జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తు నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన స్కూల్స్లో తగినంత స్థలం లేకపోవడంతో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని బాచుపల్లి, అమీర్‌పేట్, మారేడ్‌పల్లి, బండ్లగూడ, సరూర్‌నగర్, బాలాపూర్ తదితర స్కూల్కులకు అవసరమైన స్థలం సేకరించాలని కలెక్టర్లను ఆదేశించినట్లు సమాచారం. స్తల సేకరణ పూర్తైన వెంటనే నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం సూచంచింది. ఈ స్కూల్స్ నిర్మాణం, అప్‌గ్రేడ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు రూ.587 కోట్లు అవసరమైతాయని ప్రతిపాదనలు సిద్దం చేసి ప్రభుత్వానికి పంపారు.
హైదరాబాద్‌లో ఆరు స్కూల్స్‌ను ఎంపిక చేశారు. అమీర్‌పేట్, ఖైరతాబాద్, మారేడ్‌పల్లి, కందికల్ గేట్, హాపీజ్ బాబా నగర్, ధూల్పేట ప్రభుత్వ స్కూల్స్. రంగారెడ్డి జిల్లాలో 11 స్కూళ్సలో లింగోజిగూడ, సరూర్‌నగర్, లక్ష్మిగూడ (రాజేంద్రనగర్), కిస్మత్పూర్, బాలాపూర్, రాందాస్‌పల్లి, బాగ్ హయత్‌నగర్, చందానగర్, భూపేష్ గుప్తా నగర్, జల్పల్లి, గౌలిదొడ్డిలో.. మేడ్చల్‌లో నాలుగు స్కూల్స్ పాతుల్లగూడ (ఉప్పల్), పోచారం, బాచుపల్లి, గాజులరామారంలో… సంగారెడ్డిలొ అమీన్పూర్, కొల్లూరు స్కూల్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇందులో కొన్ని స్కూల్స్ నిర్మాణంలో ఉండగా, మరికొన్ని స్కూల్స్ నిర్మాణం పూర్తై అప్గ్రేడ్ చేసినట్లు అధికారులు వివరిస్తున్నారు.
Also read: కల్తీ గ్యాంగులకు సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్.. నెక్స్ట్ టార్గెట్..?