E-Paper
Advertisement

Crime Thriller Series : హిట్ అండ్ రన్ కేసు వెనుక హీట్ ఎక్కించే బయో వార్ మిస్టరీ… ఫ్యూజులు అవుటయ్యే ఇన్వెస్టిగేషన్

Crime Thriller Series : హిట్ అండ్ రన్ కేసు వెనుక హీట్ ఎక్కించే బయో వార్ మిస్టరీ…  ఫ్యూజులు అవుటయ్యే ఇన్వెస్టిగేషన్
Advertisement

Crime Thriller Series : మెడికల్ మాఫియా అన్నిటికంటే ప్రమాదకరంగా మారిపోయింది. ప్రజల ప్రాణాలు ఏ మాత్రం లెక్కలో లేకుండా పోయాయి. తెలిసింది గోరంత, తేలాల్సింది కొండంత ఈ మెడికల్ మాఫియాలో. అదృష్టం ఏంటంటే చాలా మందికి ఇప్పుడిప్పుడే వీటి సీక్రెట్స్ గురించి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కోల్‌కతా నేపథ్యంలో సాగే ఈ కథ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ గా సాగుతుంది. ఒక హత్య కేసుతో మొదలు పెడితే, మెడికల్ మాఫియా దగ్గర ఆగుతుంది ఈ కథ. ప్రతి ఎపిసోడ్ లో సస్పెన్స్‌ను ఓ రేంజ్ లో చూపించారు ఇందులో. అయితే ప్రతి ఒక్కరు చూడాల్సిన సిరీస్ ఇది.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘P.I. Meena’. ఈ హిందీ సిరీస్‌ను దేబాలోయ్ భట్టాచార్య డైరెక్ట్ చేశారు. ఇందులో తాన్యా మణిక్తల, పరమ్ బ్రత ఛటర్జీ, జిషూ సేన్‌గుప్తా, వినయ్ పాఠక్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇందులో ముఖ్యంగా తాన్యా మణిక్తల (మీనా పాత్రలో) తన నటనతో ఆకట్టుకుంది. ఆమె గతంలో ‘A Suitable Boy’ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే బెంగాలీ స్టార్ హీరో పరమ్ బ్రత ఛటర్జీ, సీనియర్ నటుడు వినయ్ పాఠక్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఇది 2023 నవంబర్ 3 న మొత్తం 8 ఎపిసోడ్లతో Amazon Prime Videoలో స్ట్రీమ్ అవుతోంది. ఇది ఒరిజినల్‌గా హిందీలో తీసినప్పటికీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

మీనా అనే అమ్మాయి కోల్‌కతాలో ఒక ప్రైవేట్ డిటెక్టివ్. ఏదో చిన్న చిన్న కేసులు చూసుకునే ఆమె కళ్లముందే ఒక కుర్రాడు రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. పోలీసులు దాన్ని హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ అని కొట్టేస్తారు. కానీ ఆ అబ్బాయి తల్లి మాత్రం నా కొడుకుది ముమ్మాటికీ హత్య, నువ్వే న్యాయం చేయాలని మీనా కాళ్లవేళ్ల పడుతుంది. ఇన్వెస్టిగేషన్ లో మీనాకు ఆ చావు వెనుక ఏదో పెద్ద స్కామ్ ఉందని అర్థమవుతుంది. ఆ కుర్రాడు ఒక మెడికల్ స్టూడెంట్ అని, వాడు ఏదో ప్రమాదకరమైన విషయాన్ని కనిపెట్టాడని తెలుస్తుంది.

ఇక అక్కడి నుండి కథ అసలు మలుపు తిరుగుతుంది. అది కేవలం ఒక హత్య మాత్రమే కాదు, ఒక పెద్ద బయో-టెర్రరిజం కుట్ర అని మీనాకు క్లారిటీ వస్తుంది. అంటే కొంతమంది పెద్ద మనుషులు కలిసి ఒక భయంకరమైన వైరస్‌ను జనాల్లోకి వదిలి, ఆ తర్వాత దానికి మందులు అమ్మి కోట్లు సంపాదించాలని ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో మీనాను ఆపడానికి రౌడీలు, పోలీసులు, ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు అందరూ వెంటపడతారు. ఆమెను చంపడానికి ట్రై చేస్తారు, కానీ మీనా అస్సలు తగ్గకుండా ఆ వైరస్ వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరో వెతకడం మొదలుపెడుతుంది. చివరికి మీనా అసలు నెరస్తులను కనిపెడుతుందా ? ఆ మెడికల్ మాఫియా కుట్రను బయట పెడుతుందా ? మీనా ఈ కేసుతో ఎలాంటి చిక్కుల్లో పడుతుంది ? అనే విషయాలను, ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also :   చచ్చిన శవంలో నిద్రలేచే పిశాచి… పుట్టబోయే బిడ్డ కోసం వేట… క్షణక్షణం ఉత్కంఠ

Related News

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×