E-Paper
Advertisement

Action Thriller OTT : 30 గంటలు సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామా… అడుగడుగునా ట్విస్టులు… ఊహించని మలుపులు

Action Thriller OTT : 30 గంటలు సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామా… అడుగడుగునా ట్విస్టులు… ఊహించని మలుపులు
Advertisement

Action Thriller OTT : ఓటీటీలో బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్‌ ని చూడాలనుకుంటే ఇప్పుడు చెప్పుకోబోయే యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ పై ఓ లుక్ వేయండి. ఈ తమిళ సిరీస్ కేవలం 30 గంటల వ్యవధిలో జరిగే ఒక హై-వోల్టేజ్ డ్రామా. ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్, ఒక ప్రమాదకరమైన గ్యాంగ్‌స్టర్ మధ్య జరిగే ఎత్తులు, పైఎత్తుల చుట్టూ కథ తిరుగుతుంది. కాప్ vs గ్యాంగ్‌స్టర్ థీమ్‌తో ఈ ఇంటెన్స్ థ్రిల్లర్ సిరీస్ ఉంటుంది. దీని పేరు ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2023లో వచ్చిన ఈ తమిళ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘మథగమ్’ (Mathagam). ప్రసత్ మురుగేశన్ దీనిని రూపొందించారు. ఇది JioHotstar ఒరిజినల్ సిరీస్. ఇందులో అతర్వా మురళి IPS ఆఫీసర్ పాత్రలో నటించగా, కె. మణికండన్ పడలం శేఖర్ మెయిన్ విలన్ పాత్రలో నటించారు. ఇది పార్ట్ 1 2023 ఆగస్టు 18న స్ట్రీమింగ్ కి వచ్చింది. అలాగే పార్ట్ 2, 2023అక్టోబర్ 12 నుంచి స్ట్రీమింగ్ లో ఉంది. ఇది తమిళంలో నిర్మించబడినప్పటికీ తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, బెంగాలీ భాషల్లో డబ్బింగ్ వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి.

స్టోరీ ఏమిటంటే

Advertisement

నగరంలో ఎన్నో ఏళ్ల క్రితమే చనిపోయాడని అందరూ భావించిన పడలం శేఖర్ (మణికందన్) అనే ప్రమాదకరమైన గ్యాంగ్‌స్టర్ మళ్లీ బయటకు వస్తాడు. అతను ఒక పాత నేరస్థుడి పుట్టినరోజు వేడుకను నెపంగా పెట్టుకుని, చెన్నై నగరం శివార్లలోని ఒక ఫామ్‌హౌస్‌లో నగరం నలుమూలల నుంచి ఉన్న గ్యాంగ్‌స్టర్లందరితో కలిసి ఒక భారీ సమావేశాన్నిఏర్పాటు చేస్తాడు. ఈ సమావేశం వెనుక అతని అసలు ఉద్దేశం ఒక భారీ క్రైమ్ కి ప్లాన్ చేయడం.

మరోవైపు నైట్ పెట్రోలింగ్‌లో ఒక నేరస్థుడిని పట్టుకున్న డిసిపి అశ్వత్ రత్నకుమార్ (అథర్వ), ఈ రహస్య సమావేశం గురించి తెలుసుకుంటాడు. కమీషనర్ సయంతిక బిస్వాస్ సహకారంతో, అశ్వత్ ఒక సీక్రెట్ ఆపరేషన్ మొదలుపెడతాడు. పడలం శేఖర్‌కు మంత్రి వీరవల్ నలంగిల్లి అండ ఉంటుంది. పోలీసుల ఆపరేషన్ గురించి తెలిసిన మంత్రి, కమీషనర్‌ను బదిలీ చేయించి ఆపరేషన్‌ను ఆపడానికి ప్రయత్నిస్తాడు. చివరికి అశ్వత్ పడలం శేఖర్ ని పట్టుకుంటాడా ? గ్యాంగ్‌స్టర్లతో ఎలాంటి సమస్యలు వస్తాయి ? పడలం శేఖర్ చేయాలనుకుంటున్న క్రైమ్ ఏమిటి ? అనే విషయాలను ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also :  ఆది సాయికుమార్ సూపర్ హిట్ మిస్టిక్ థ్రిల్లర్ ను ఏ ఓటీటీలో ఎప్పుడు చూడవచ్చో తెలుసా ?

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×