E-Paper
Advertisement

Kothagudem Bus Accident: కొత్తగూడెం జిల్లాలో ప్రమాదం.. ట్రావెల్ బస్సు బోల్తా, స్పాట్‌లో 40 మంది

Kothagudem Bus Accident: కొత్తగూడెం జిల్లాలో ప్రమాదం.. ట్రావెల్ బస్సు బోల్తా, స్పాట్‌లో 40 మంది
Advertisement

Kothagudem Bus Accident: భద్రాద్రి కొత్తగుడెం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రావెల్ బస్సులో బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఘటన సమయంలో బస్సులో దాదాపు 40 మంది వరకు ప్రయాణీకులు ఉన్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అసలేం జరిగింది?

కొత్తగూడెం జిల్లాలో ట్రావెల్ బస్సుకి ప్రమాదం

Advertisement

సంక్రాంతి తర్వాత ఆదివారం అమావాస్య కావడంతో ఏపీ నుంచి భాగ్యనగరానికి వచ్చేవారు వెనుకడుగు వేశారు. దీంతో సోమవారం రాత్రి వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ సిటీకి బయలుదేశారు ప్రజలు. ఈ క్రమంలో 40 మంది ప్రయాణీకులతో రాజమండ్రి నుండి హైదరాబాద్‌కు కేవీఆర్ ట్రావెల్స్‌కి చెందిన స్లీపర్ బస్సు బయలు దేరింది.

అర్ధరాత్రి భద్రాద్రి కొత్త గుడెం జిల్లాలోని దమ్మపేట మండలం గట్టు గుడెం వద్ద ఆ బస్సు బోల్తా పడింది. అశ్వారావుపేట దాటి ఇరవై కిలోమీటర్లు వెళ్లిన తర్వాత గట్టు గూడెం వద్ద బస్సు ఒక్కసారిగా అదుపు తప్పింది. రోడ్డు పక్కనున్న పొలాల్లో బోల్తా పడింది. ఘటన సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణిలు ఉన్నారు.

Advertisement

బోల్తాపడిన బస్సులు.. పలువురు ప్రయాణికులకు తీవ్రగాయాలు

అందులో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన అర్ధరాత్రి సమయంలో ఘటన జరగడంతో ప్రయాణికులు గాఢమైన నిద్రలో ఉన్నారు. బస్సు బోల్తా పడడంతో చీకట్లో ఏం జరిగిందో తెలియని పరిస్థితి నెలకొంది. ఒకరిపై ఒకరు పడిపోవడంతో తీవ్రగాయాలు అయ్యాయి. బస్సుకు ఎగ్జిట్‌ డోర్ లేకపోవడంతో ప్రయాణికులు తమ రక్షించాలంటూ గట్టిగా కేకలు పెట్టారు.

నేషనల్ హైవే కావడంతో అటువైపు వెళ్తున్న వాహనదారులు ప్రమాదాన్ని గమనించి బస్సులోని ప్రయాణికులను ఒక్కొక్కరిని బయటకు తీశారు. వెంటనే ఘటన గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పోలీసు వాహనాలు, అంబులెన్సుల్లో దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ALSO READ:  వినుకొండ ఆర్టీసీ బస్టాండులో తొక్కిసలాట.. నలుగురు స్పాట్‌లో

ప్రస్తుతం అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. బ్రేక్ ఫెయిల్ కావడం వల్ల ప్రమాదం జరిగిందని బస్సు డ్రైవర్ చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సివుంది.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×