E-Paper
Advertisement

‘స్క్విడ్ గేమ్’ ను మించిన అరాచకం… ప్రపంచాన్ని వణికించిన జపాన్ మూవీ

‘స్క్విడ్ గేమ్’ ను మించిన అరాచకం… ప్రపంచాన్ని వణికించిన జపాన్ మూవీ
Advertisement

Action Thriller Movie OTT : సినిమా చరిత్రలోనే ఒక యాక్షన్ థ్రిల్లర్ ప్రపంచాన్ని వణికించేలా చేసింది. పాతికేళ్ళ క్రితం వచ్చిన ఈ సినిమా అనేక వివాదాలలో కూడా నిలిచింది. ఈ సినిమాలోని విపరీతమైన హింస కారణంగా అనేక దేశాల్లో దీనిని నిషేధించారు కూడా. ఈ కథలో మైనర్ పిల్లలు ఒక దీవిలో ఒకరిని ఒకరు చంపుకోవడమే అందుకు కారణం. అయితే గేమింగ్ ప్రపంచంలో పాపులర్ అయిన ‘PUBG’, ‘Fortnite’ వంటి బాటిల్ గేమ్స్ రావడానికి ఈ సినిమానే మూల కారణం. ప్రపంచవ్యాప్తంగా వివాదాలతో పాటు, అంత భారీ క్రేజ్‌ను సంపాదించుకున్న సినిమా ఇది.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ జపనీస్ డిస్టోపియన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా పేరు ‘బాటిల్ రాయల్’ (Battle Royale). 2000లో వచ్చిన ఈ సినిమా కౌషున్ తకామి రాసిన నవల ఆధారంగా, కింజి ఫుకాసాకు దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమా 2000వ సంవత్సరంలో విడుదలైనప్పుడు జపాన్ పార్లమెంట్‌లోనే పెద్ద చర్చకు దారితీసింది. మైనర్ పిల్లలు ఒకరినొకరు చంపుకోవడం అనే కాన్సెప్ట్ వల్ల దీనిని నిషేధించాలని చాలా మంది డిమాండ్ చేశారు, కానీ అదే వివాదం ఈ సినిమాకు భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది. దర్శకుడు కింజి ఫుకాసాకు తన 70 ఏళ్ల వయసులో ఈ సినిమాను తీశారు. ప్రస్తుతం ప్రపంచాన్ని ఊపేస్తున్న ‘బాటిల్ రాయల్’ అనే గేమింగ్ ట్రెండ్‌కి ఇదే అసలైన పునాది. PUBG, Fortnite వంటి ఆటలు ఈ సినిమా కాన్సెప్ట్ నుండే పుట్టాయి. అలాగే హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘ది హంగర్ గేమ్స్’, నెట్‌ఫ్లిక్స్ లో సెన్సేషన్ సృష్టించిన ‘స్క్విడ్ గేమ్’ వంటి వాటిపై ఈ సినిమా ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే సినిమా ప్రేమికులు దీనిని ఒక క్లాసిక్ గా భావిస్తారు. ప్రస్తుతం ఈ సినిమా Prime video, Mubi ఓటీటీలలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

భవిష్యత్తులో జపాన్ దేశం పరిస్థితి అస్సలు బాలేదు. జపాన్ ఆర్థికంగా కుప్పకూలి, నిరుద్యోగం పెరిగిపోయి, యువత పెద్దల పట్ల గౌరవం లేకుండా ప్రవర్తిస్తుంటుంది. ఈ పరిస్థితిని అదుపు చేయడానికి ప్రభుత్వం ‘బాటిల్ రాయల్’ అనే చట్టం తీసుకువస్తుంది. దీని ప్రకారం, ప్రతి ఏటా ఒక స్కూల్ క్లాస్‌ను ఎంపిక చేసి ఒక నిర్మానుష్యమైన ద్వీపానికి పంపిస్తారు. ఆ విద్యార్థులకు ఆహారం, మ్యాప్ కొన్ని ఆయుధాలు కూడా ఇస్తారు. ప్రతి ఒక్కరి మెడకి ఒక బాంబు బెల్టు కూడా కడతారు. అక్కడ నియమం ఒక్కటే: మూడు రోజుల టైమ్ ఇస్తారు, ఒకరినొకరు నరుక్కుని, చంపుకుని చివరికి ఒక్కడు మాత్రమే మిగలాలి. ఎవరూ చావకపోతే మెడలో ఉన్న బాంబులు పేలి అందరూ చచ్చిపోతారు.

ఇంకేముంది ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రాణ స్నేహితులే ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటారు. చాలా మంది భయం భయంగా చస్తుంటే, మరికొందరు మాత్రం రక్తదాహంతో వేట మొదలుపెడతారు. ఇందులో హీరో షూయా తన క్లాస్ అమ్మాయి నోరికోను కాపాడుకుంటూ ఎలాగైనా బయటపడాలని చూస్తాడు. అయితే అది అంత తేలిగ్గా సాగాదు. రక్తం ఏరులై పారుతుంది. చివరికి హీరో ఆ అమ్మాయిని కాపాడతాడా ? వాళ్లు ఆ నరకం నుండి బయటపడ్డారా ? అనేదే ఈ సినిమా క్లైమాక్స్.

Advertisement

Read Also : నైట్ షిఫ్ట్ జాబ్ లో అందాల విందు… సింగిల్స్ కి పండగే మావా

Related News

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

వచ్చేవారం నెట్ ఫ్లిక్స్ లో 3 సినిమాలు.. ఆ 2 మస్ట్ వాచ్!

Big Stories

Advertisement
×