E-Paper
Advertisement

పర్ఫెక్ట్ మామిడి పండును ఎలా ఎంచుకోవాలో తెలుసా? అసలైన ట్రిక్స్ ఇవే!

పర్ఫెక్ట్ మామిడి పండును ఎలా ఎంచుకోవాలో తెలుసా? అసలైన ట్రిక్స్ ఇవే!
Advertisement

 Mangoes tips: సమ్మర్ వచ్చిందంటే చాలు మనందరి మనసు మామిడి పండ్లవైపే..తియ్యగా, గుమగుమలాడే వాసనతో ఉండే మామిడి పళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. కేవలం రుచి ఒక్కటే కాదండోయ్… మామిడిలో ఎన్నో హెల్త్ సీక్రెట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్ C, విటమిన్ A, ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, వేసవిలో వచ్చే డైజేషన్ ప్రాబ్లమ్స్‌ని కూడా సాల్వ్ చేస్తాయి.అయితే  మనం మామిడి పళ్ళు కొందాం అని మార్కెట్‌లోకి వెళ్ళినప్పుడు, కుప్పలుగా ఉన్న మామిడి పండ్లలో ఏది తియ్యగా ఉంటుంది, ఏది పుల్లగా ఉంటుంది, ఏది సహజంగా పండింది అని ఎంచుకోవడం పెద్ద టాస్కే.

కొన్ని పళ్ళు పసుపు రంగులో నిగనిగలాడుతూ

Advertisement

నిజానికి రంగు ఒక్కదాన్నే మనం పరిగణలోకి తీసుకున్నామంటే బొల్తా పడ్డట్టే. అవును… కొన్ని పళ్ళు పసుపు రంగులో నిగనిగలాడుతూ ఉండి పాడైపోయినవి ఉంటే, కొన్ని రకాలు ఆకుపచ్చగా ఉన్నా లోపల అద్భుతంగా అమృతంలా ఉంటాయి.సో పండును సెలెక్ట్ చేసుకునేటప్పుడు రంగు కంటే అది ఎలా ఉంది అని చూడటం చాలా ముఖ్యం. చేతితో మెల్లగా ఒత్తి చూసినప్పుడు అది కొద్దిగా సాఫ్ట్‌గా అనిపిస్తే అది పండినట్లు లెక్క. అలా కాకుండా రాయిలా గట్టిగా ఉంటే అది ఇంకా పండలేదని, మరీ మెత్తగా ముద్దలా ఉంటే అది ఎక్కువగా పండిపోయి పాడవుతోందని మనం అర్థం చేసుకోవాలన్న మాట.

also read :మెగా మేనల్లుడి ‘ఓవర్ కాన్ఫిడెన్స్’? చేతిలో సినిమాలు లేవు కానీ.. అప్పుడే ప్రొడక్షన్ హౌస్ అంటూ రిస్క్!

Advertisement

ఒక్కో రకానికి ఒక్కో రుచి, గుణం

ఇక మామిడి పండ్లలో కొన్ని వందల రకాలు ఉంటాయి. వాటిలో ఒక్కో రకానికి ఒక్కో రుచి, గుణం ఉంటుంది.మన తెలుగు రాష్ట్రాల్లో బంగినపల్లి రకానికి ఉన్న క్రేజే వేరు. ఇది సైజులో పెద్దగా, సాఫ్ట్‌గా ఉండి అందరి ఫేవరెట్‌గా నిలుస్తుంది. ఇక అల్ఫోన్సో మామిడి పండ్లు వరల్డ్ వైడ్‌గా మంచి వాసనకి, వాటి ఆకారానికి ఫేమస్.ఇక గుజరాత్‌కు చెందిన కేసర్ మామిడి పండ్లు డెజర్ట్‌లు, స్వీట్లు తయారు చేయడానికి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి. నార్త్ ఇండియాలో ఫేమస్ అయిన దసేరి, లాంగ్రా వంటి రకాలు ఒక సెపరేట్ టేస్ట్‌ని ఇస్తాయి.ఇక విదేశీ రకాలైన అతౌల్ఫో, కెంట్, టామీ అట్కిన్స్ వంటివి కూడా ఇప్పుడు మార్కెట్‌లో అందుబాటులోకి వస్తున్నాయి. కాబట్టి మీరు ఏ అవసరం కోసం మామిడిని కొంటున్నారో ముందే డిసైడ్ అవ్వాలి. తాజాగా ముక్కలు కోసుకుని తినాలంటే అల్ఫోన్సో లేదా కెంట్ రకాలు బాగుంటాయి. అదే స్మూతీస్, ప్యూరీల కోసం అయితే అతౌల్ఫో వంటి జ్యూసీ రకాలు ది బెస్ట్.

మామిడి పండును కాడ దగ్గర వాసన చూసినప్పుడు 

ఇక ఒక మంచి మామిడిని గుర్తించడానికి సువాసన కూడా సరైన ఇండికేషన్ అనే చెప్పాలి. మామిడి పండును కాడ దగ్గర వాసన చూసినప్పుడు తియ్యటి సువాసన వస్తే అది పక్కాగా పండినట్లే అని అర్థం.అలా కాకుండా అసలు వాసనే లేకపోతే మాత్రం అది ఇంకా పచ్చిగా ఉందని, ఒకవేళ పుల్లటి వాసన వస్తే అది కుళ్లిపోవడానికి సిద్ధంగా ఉందని అర్థం చేసుకోవాలి.అలాగే పండు తొక్కను కూడా గమనించాలండోయ్. తొక్క ముడతలు లేకుండా, కోతలు లేకుండా స్మూత్‌గా, టైట్‌గా ఉండాలి. నల్లటి మచ్చలు ఎక్కువగా ఉంటే ఆ పండు క్వాలిటీగా లేదని అర్థం.పండును చేతిలోకి తీసుకున్నప్పుడు దాని సైజుకు తగ్గ బరువు అనిపిస్తే అది జ్యూసీగా, గుజ్జుతో నిండి ఉందన్న మాట.

మరి ఇకనైనా మార్కెట్‌కి వెళ్ళినప్పుడు సరైన పళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు కదూ!

also read :‘బెటర్ హాఫ్’ అంటే కేవలం భార్య మాత్రమేనా? ఈ పదం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో తెలుసా!

Related News

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

Big Stories

Advertisement
×