E-Paper
Advertisement

Action Thriller OTT: తండ్రిని చంపిన హంతకుడిపై పగ… అదిరిపోయే క్లైమాక్స్

Action Thriller OTT: తండ్రిని చంపిన హంతకుడిపై పగ… అదిరిపోయే క్లైమాక్స్
Advertisement

Action Thriller OTT : ఇప్పుడు మనం కొరియాలో అత్యంత ప్రజాదరణ పొందిన ఒక వెబ్ సిరీస్ గురించి చెప్పుకోబోతున్నాం. ఇది తండ్రిని చంపిన హంతకుడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి, పోరాటం చసే ఒక యువతి చుట్టూ తిరుగుతుంది. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ తో ఈ సిరీస్ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక పవర్‌ఫుల్ రివెంజ్ డ్రామా. చూడటం మొదలు పెడితే, ప్రతి ఎపిసోడ్ చూపు తిప్పుకోకుండా చూస్తారు.  క్లైమాక్స్ మాత్రం మరో లెవెల్ లో ఉంటుంది. మరి ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

ఈ కొరియా యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ టెలివిజన్ సిరీస్ పేరు ‘మై నేమ్’ (My Name). కిమ్ జిన్-మిన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో హాన్ సో-హీ, పార్క్ హీ-సూన్, అహ్న్ బో-హ్యూన్ లీడ్ రోల్స్ లో నటించారు. ఇది ‘ఆన్ స్క్రీన్’ విభాగంలో 26వ బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. ఎనిమిది ఎపిసోడ్‌లలో ఈ సిరీస్ 2021 అక్టోబర్ 15న నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

తండ్రిని తన కళ్ల ముందే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చంపేయడంతో, జి-వూ అనే అమ్మాయి ఎలాగైనా ఆ హంతకుడిని పట్టుకోవాలని డిసైడ్ అవుతుంది. తన తండ్రికి స్నేహితుడైన ఒక పెద్ద గ్యాంగ్‌స్టర్ దగ్గరకు వెళ్లి సాయం కోరుతుంది. అతను ఆమెకు ట్రైనింగ్ ఇచ్చి, పేరు మార్చి, పోలీసు డిపార్ట్‌మెంట్‌లోకి అండర్ కవర్ ఏజెంట్‌గా పంపిస్తాడు. ఇప్పుడు తన తండ్రిని చంపింది ఎవరో కనిపెట్టడమే ఆమె మెయిన్ టార్గెట్.

ఇక పోలీసుగా పని చేస్తూనే, తన తండ్రి మరణం వెనుక ఉన్న భయంకరమైన నిజాలను ఆమె తెలుసుకుంటుంది. తను నమ్ముతున్న గ్యాంగ్ లీడర్ అసలు రంగు ఏంటి? తన తండ్రి నిజంగా ఎవరు? అనే విషయాలు బయటపడే కొద్దీ కథలో ట్విస్టులు పెరుగుతాయి. చివరికి ఆమె తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంత దూరం వెళ్లింది? ఎంత మందిని ఎదిరించింది ? తన టార్గెట్ పూర్తి చేసిందా ? అనేదే ఈ సిరీస్ క్లైమాక్స్.

Advertisement

Read Also : మరికొన్ని గంటల్లో బ్లైండ్ డేటింగ్ కామెడీ రియాలిటీ షో… కళ్ళకు గంతలు కట్టి అలాంటి పనులు.. ఎక్కడ చూడచ్చో తెలుసా ?

Tags

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×