E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: మీనాక్షిని చంపేందుకు పల్లవి స్కెచ్.. తల్లి కోసం అవని కన్నీళ్లు.. చక్రధర్ కు దిమ్మతిరిగే షాక్..

Intinti Ramayanam Today Episode: మీనాక్షిని చంపేందుకు పల్లవి స్కెచ్.. తల్లి కోసం అవని కన్నీళ్లు.. చక్రధర్ కు దిమ్మతిరిగే షాక్..
Advertisement

Intinti Ramayanam Today Episode February 24th: నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి పై అవనికి అనుమానం ఉన్న విషయాన్ని అభి తో చెప్తుంది.. ఇక అభి తన కానిస్టేబుల్ ని పల్లవిని ఫాలో అవమని చెప్తాడు.. తన కానిస్టేబుల్ పల్లవిని ఫాలో అవుతూ అక్కడికి వస్తాడు.. పల్లవి ఒక చోటికి వెళ్లడం చూసిన కానిస్టేబుల్ రాజు ఆమెను ఫాలో అవుతూ ఉంటాడు.. అభి తో కూడా చెప్తాడు.. ఇక ఇంటికి వచ్చిన శ్రీకర్ కమల్ని చూసిన పార్వతీ ఏంట్రా మీ ఇద్దరే వచ్చారు పెద్దోడు ఎక్కడ కనిపించలేదు అని అడుగుతుంది.. వదిన ఇందాక సైట్ కి వచ్చిందమ్మా అన్నయ్య వదిన ఏదో ముఖ్యమైన పని ఉందని బయటికి వెళ్లారు అని శ్రీకర్ అంటాడు.. ఆ మాట విన్న శ్రియా మీ వదిన ఇంట్లో పనిలే కాదు బయట సైట్  కూడా పనిచేస్తుందా అంటూ మాట్లాడుతుంది. చక్రధర్ జైలు నుంచి ఇవాళ రిలీజ్ కాబోతున్నాడు.

అది తెలుసుకుందామని అక్కడికి వెళ్ళాము అని అక్షయ్ అంటాడు. ఆ మాట వినగానే భానుమతి పార్వతి ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఏంటి నా అల్లుడు జైలు నుంచి రిలీజ్ అయిపోతున్నాడా అంటూ భానుమతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.. ఆ చక్రధర్ జైల్లో ఉండగానే మా మీనాక్షి అత్తయ్యని కిడ్నాప్ చేయించాడు అని అనగానే అందరూ షాక్ అవుతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే..చక్రధర్ జైలు నుంచి ఇంటికి రాగానే రాజేశ్వరి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది.. రావడం నాకు చాలా సంతోషంగా ఉంది.. నాకు చాలా బాధగా ఉంది రాజేశ్వరి నన్ను మీ వాళ్ళు ఇంకా నమ్మడం లేదు.. నాన్నకు అలా జరగడానికి కారణం నేనే అని ఇంకొకటి అని నా మీద నిందలు వేస్తూనే ఉన్నారు.. జైలుకు వెళ్లడం పెద్ద ప్రాబ్లం కాదు కానీ మీ వాళ్ళు నన్ను అపార్థం చేసుకోవడమే నాకు బాధగా ఉంది అని ముసలి కన్నీళ్లు కారుస్తాడు చక్రధర్.. అక్కడికి వచ్చిన పల్లవి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది.. డాడ్ మీకోసం నేను ఎన్నో నిద్రలేని రాత్రులు మేలుకొని మీకోసం వెయిట్ చేస్తాను.. ఇంటికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ పల్లవి మురిసిపోతుంది. అయితే చక్రధర్ కి మీనాక్షిని కిడ్నాప్ చేసిన విషయాన్ని చెప్తుంది.

రాజేంద్రప్రసాద్ ని చంపడానికి మనమే ప్రయత్నించామని అవని అనుమాన పడుతుంది.. ఇంట్లో జరుగుతున్న వాటన్నిటికీ కారణం నేనే అని నామీద అవనికి అనుమానం వచ్చింది.. డైవర్ట్చేయాలి అంటే కచ్చితంగా వాళ్ళ అమ్మని కిడ్నాప్ చేయాల్సిందే అని ఫిక్స్ అయ్యాను అని పల్లవి చెప్తుంది.. మంచి పని చేసావ్ అమ్మ నువ్వు నా కూతురు కనిపించుకున్నావు అని చక్రధర్ పల్లవిని పొగడ్తల వర్షం కురిపిస్తాడు.. అయితే మనము కచ్చితంగా చంపాల్సిందే అని పల్లవి చక్రధర్ ఇద్దరు కూడా ప్లాన్ చేస్తారు.. ఏం చేస్తారు ఏం ప్లాన్ చేస్తారు అని రాజేశ్వరి అనగానే పల్లవికి దిమ్మ తిరిగే షాక్ అవుతుంది.. డాడ్ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు కదా మామ్ మంచి పార్టీ అరేంజ్ చేస్తాను ప్లాన్ చేస్తాను అంటే నాన్న వద్దు అని అంటున్నాడు..

Advertisement

వద్దని ఎందుకని అండి మీరు ఇన్ని రోజులు జైలుకెళ్ళి వచ్చారు.. ఆ సందర్భాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిందే కదా పార్టీని అరేంజ్ చెయ్ పల్లవి అని రాజేశ్వరి చెప్తుంది.. తర్వాత రాత్రి పల్లవి ఒక పాడు పడ్డ బంగ్లా దగ్గరికి వెళుతుంది. అక్కడ మీనాక్షి అరుస్తూ కనిపిస్తుంది.. ఏయ్ అరవద్దు అని ఒక గొంతు వినగానే మీనాక్షి షాక్ అవుతుంది.. అక్కడ పల్లవిని చూసిన మీనాక్షి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. పల్లవి నువ్వు నన్ను కిడ్నాప్ చేసావా ఎందుకమ్మా నేను నీకు తల్లి లాంటి దాన్ని కదా.. నీకు నేను ఏమి అన్యాయం చేశాను అని అడుగుతుంది.. నీ కూతురు రెచ్చిపోతుంది. నీకు బుద్ధి చెప్పాలని నిన్ను కిడ్నాప్ చేశాను..

అవనిలో ఉండాల్సిన లక్షణాలు ఒక్కటి కూడా నీకు లేవు ఎందుకు ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నావు. అని మీనాక్షి అనగానే పల్లవి నీతి బుద్దులు నాకేం అవసరం లేదు అని అంటుంది.. మా డాడీ పిల్లల పేరు మీద రాసి ఇచ్చిన వీలునామా ఎక్కడ పెట్టావు అని పల్లవి అడుగుతుంది.. వీరు నామ ఏం రాసిచ్చాడు అని మీనాక్షి ఎంతగా నాకు తెలియదని చెప్తున్నా సరే..పల్లవి మాత్రం నువ్వు ఆ డాక్యుమెంట్స్ ఇస్తేనే ఇకనుంచి బయట పడతావు.. లేదంటే నీ ప్రాణాలు తీస్తాను అని బెదిరిస్తుంది.. ఆ తర్వాత పల్లవిని ఫాలో అయిన కానిస్టేబుల్ పల్లవి ఎక్కడుందో తెలుసుకోలేక వెళ్లిపోతాడు.

తర్వాత రోజు ఉదయం అందరూ ఉండగా చక్రధర్ రాజేశ్వరి ఇంటికి వస్తారు.. అవని తన తల్లి గురించి బాధపడుతూ ఉండగా అక్షయ అక్కడికి వచ్చి మీ తల్లికి ఏం కాదు ఎక్కడున్నా ఇంటికి వస్తుంది అని ఓదారిస్తుంటాడు.. మాటలు విని అక్కడికొచ్చిన అక్షయ్ రేయ్ మా నాన్నని చంపాలని చూసావు. మా నాన్నని చంపడానికి వచ్చావు నువ్వు. అసలు ఎందుకు వచ్చావు మా ఇంటికి అని కాలర్ పట్టుకుని ముగ్గురు తమ్ముళ్లు కూడా అడుగుతారు… మా ఇంట్లో నుంచి వెళ్ళిపొండి అని ఎంత చెప్తున్నా సరే రాజేశ్వరి మాత్రం ఇది నా పుట్టినిల్లు నా ఇష్టం వచ్చినట్టు వస్తాను. నాకు అనిపించినన్ని రోజులు ఉంటాను అని అంటుంది.. నా భర్తనే అనే రైట్ఎ వరికి లేదు అది గుర్తుపెట్టుకోండి..

Also Read : ‘గుండెనిండా గుడిగంటలు ‘ యాక్టర్స్ ఏజ్.. మీనా వయసు ఎంతంటే..?

అసలు నా భర్తని కొట్టడానికి మీరెవరు ఎంత ధైర్యం ఉంటే నా భర్త కాలర్ పట్టుకుంటారు అని రాజేశ్వరి సీరియస్ అవుతుంది.. అక్షయ్ నీ కొట్టడంతో అవని నా భర్తను కొడుతున్నారేంటి అని అడుగుతుంది.. ఆడదానివి కాబట్టి బతికి పోయావు లేదంటే నీకు కూడా చెంప పగలకొట్టేది అని రాజేశ్వరి అంటుంది… డాడీ ని జైలు నుంచి తీసుకురాకుండా అడ్డుకునేది ఈ అవన్నీ పల్లవి అనడంతో కమల్ పల్లవి పై సీరియస్ అవుతాడు.. మీ నాన్న చేసిన దుర్మార్గపు పనుల వల్లే మా అన్నయ్య వదిన మీ నాన్నని జైల్లో పెట్టించారు.. ఇది గుర్తుపెట్టుకుంటే మంచిది అని కమల్ వార్నింగ్ ఇస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×