E-Paper
Advertisement

Action Thriller OTT : ఓటీటీలో దుమ్ము లేపుతున్న ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్… మాఫియాపై అలుపెరుగని పోరాటం… ట్రెండింగ్‌లోనూ తోపే

Action Thriller OTT : ఓటీటీలో దుమ్ము లేపుతున్న ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్… మాఫియాపై అలుపెరుగని పోరాటం… ట్రెండింగ్‌లోనూ తోపే
Advertisement

Action Thriller OTT : అనిల్ కపూర్ నటించిన ‘సుబేదార్’ (Subedaar) మూవీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ థియేటర్లకు వెళ్ళకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చింది. అలా వచ్చిన రోజు నుంచి ఈ మూవీ ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఇది తెలుగులో కూడా ఉండటంతో, ఇప్పుడు తెలుగు ఆడియన్స్ కూడా ఫుల్ జోష్‌లో చూస్తున్నారు. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అర్జున్ మౌర్య, ఒక కరుడు గట్టిన మాఫియాని ఎదుర్కొనే క్రమంలో స్టోరీ నడుస్తుంది. 60 ఏళ్లు దాటిన వయసులో కూడా అనిల్ కపూర్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అనిల్ కపూర్ ఫ్యాన్స్, యాక్షన్ థ్రిల్లర్ లవర్స్ ఈ సినిమాను అస్సలు మిస్ చేయకండి.

అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ 

సురేష్ త్రివేణి దర్శకత్వంలో వచ్చిన ‘సుబేదార్’ (Subedaar) మార్చి 5 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కి వచ్చింది. వచ్చినప్పటినుంచి ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. హిందీతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది. ఇందులో నిల్ కపూర్ లీడ్ రోల్‌లో ఉండగా, రాధికా మదన్, మోనా సింగ్, ఆదిత్య రావల్, సౌరభ్ శుక్లా, ఖుష్బూ సుందర్ కీలక పాత్రల్లో ఉన్నారు. ఇక ఈ సినిమాకు అనిల్ కపూర్, సురేష్ త్రివేణి, విక్రమ్ మల్హోత్రా నిర్మాతలుగా వ్యవహరించారు. అనిల్ కపూర్ యాక్షన్ లుక్, మాఫియా ఫైట్ సీన్స్ ఈ సినిమాను ఎక్కడికో తీసుకెల్లాయి. ఇక తండ్రి-కూతుళ్ల మధ్య ఉండే ఎమోషన్స్ సినిమాకు ప్రాణం పోశాయి.

కథలోకి వెళ్తే

Advertisement

అర్జున్ మౌర్య (అనిల్ కపూర్) అనే ఒక రిటైర్డ్ ఆర్మీ సుబేదార్, దేశం కోసం యుద్ధాలు చేసి, రిటైర్ అయ్యాక తన ఊరికి వస్తాడు. ఇంట్లో చూస్తే తన కూతురు శ్యామ (రాధికా మదన్)తో అస్సలు పడదు. తండ్రి కూతుళ్ల మధ్య ఎప్పుడూ గొడవలే. పాత కాలపు పద్ధతులతో బతికే ఈ మొండి మనిషికి, మారుతున్న లోకంతో ఎలా కలిసి నడవాలో అర్థం కాక సతమతమవుతుంటాడు. ఊరిలో ప్రశాంతంగా బతుకుదామనుకుంటే, అక్కడ పరిస్థితి అంతకంటే దారుణంగా ఉంటుంది. అదే సమయంలో ఆ ఊరిలో ఇసుక మాఫియా ఆగడాలు మితిమీరిపోతుంటాయి.

బాబ్లీ దీదీ (మోనా సింగ్), ఆమె కొడుకు ప్రిన్స్ (ఆదిత్య రావల్) అనే రౌడీలు ఊరిని తమ గుప్పిట్లో పెట్టుకుని చెలరేగిపోతుంటారు. మొదట్లో వీళ్ల జోలికి వెళ్లకూడదని అర్జున్ అనుకున్నా, ఈ గ్యాంగ్ తన కూతురిని వేధించడం, తన ప్రాణప్రదమైన రెడ్ జిప్సీ కారును తగులబెట్టడంతో అర్జున్ లోని పాత సైనికుడు నిద్రలేస్తాడు. ఇక అక్కడి నుంచి అసలు ఆట మొదలవుతుంది. మరి ఈ ఆట ఎలా ఉంటుంది ? అర్జున్ ఆ మాఫీయాకు ఎలా బుద్ది చెప్పాడు ? తండ్రి కూతుళ్ల సమస్య ఎలా సమసిపోతుంది ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : రక్తం రుచి మరిగిన సముద్రపు దొంగలు… ఓటీటీలో దుమ్ములేపుతున్న సిరీస్… తెలుగులోనూ స్ట్రీమింగ్

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×