Prabhas : టాలీవుడ్ స్టార్, పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు.. ప్రతి ఏడాది ఈయన నుంచి ఒకటి రెండు సినిమాలు వస్తుంటాయి. ఈ ఏడాది ఆయన నటించిన హారర్ కామెడీ చిత్రం రాజా సాబ్ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది.. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.. బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ ను అందుకుంది.. దాంతో డార్లింగ్ ఫ్యాన్స్ కు నిరాశ మాత్రమే మిగిలింది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాలు ఏవి? ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ కాబోతుందో ఒకసారి తెలుసుకుందాం..
‘సీతా రామం’ వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తోన్న మూవీ ఫౌజీ.. రెబల్ స్టార్ ప్రభాస్, ఇమాన్ వి జంటగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో బిజీగా ఉంది..1940ల నాటి బ్యాక్ డ్రాప్‌తో స్టోరీ సాగనుండగా.. మూవీలో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని దాదాపు 600 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఈ ఏడాది దసరా కానుకగా థియేటర్లలోకి రాబోతున్నట్లు తెలుస్తుంది..
అర్జున్ రెడ్డి మూవీ తో తెలుగులో ఒక సంచలనం క్రియేట్ చేసిన స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.. స్పిరిట్ అనే మూవీ వీరిద్దరి కాంబోలో రాబోతుంది. ఈ మూవీ పై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి.. తృప్తి దిమ్రి ప్రభాస్ కి జోడిగా నటిస్తుంది. ఇటీవలే ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టరు జనాలని ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ వచ్చేయడాది మార్చి5న థియేటర్లోకి రాబోతుంది..
గతంలో వచ్చిన బిగ్గెస్ట్ హిట్ మూవీ కల్కి.. పౌరాణిక కథతో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటుగా కలెక్షన్లు కూడా భారీగానే వసూలు చేసింది.. ఈ చిత్రానికి సీక్వల్ గా కల్కి 2 రాబోతున్న విషయం తెలిసిందే.. ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.. ఈ చిత్రం వచ్చే ఏడాది అక్టోబర్ లో విడుదల కాబోతుంది..
గతంలో వచ్చిన ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ సలార్.. భారీ యాక్షన్స్ సన్నివేశాలతో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీకి సీక్వెల్ గా సలార్ 2 రాబోతున్న విషయం తెలిసిందే.. ఈ మూవీ 2028 సమ్మర్ లో రిలీజ్ కాబోతుంది..
Also Read : వామ్మో.. గ్లోబల్ బ్యూటీ రేంజే వేరు..అన్ని వేల కోట్లా..?
ఈ సినిమాలన్నీ కూడా ఇంకా రిలీజ్ అవ్వకముందే ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలను లైన్లో పెట్టుకుంటున్నట్లు తెలుస్తుంది.. భారీ బడ్జెట్ తో కథతో రాబోతున్న ఈ సినిమాలన్నీ కూడా హిట్ అయితే మాత్రం ప్రభాస్ రేంజ్ మళ్లీ అందనంత ఎత్తుకు చేరుతుంది.. మరి ఏ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..