E-Paper
Advertisement

Anchor Ravi: బ్రేకప్ తర్వాత అలా చేసే వాళ్లు మెంటల్లీ సిక్ పీపుల్.. వెంటనే కట్ చేయండి

Anchor Ravi: బ్రేకప్ తర్వాత అలా చేసే వాళ్లు మెంటల్లీ సిక్ పీపుల్.. వెంటనే కట్ చేయండి
Advertisement

Anchor Ravi: ఎందుకు ఈ పనికిరాని ఈగోలు, డిప్రెషన్‌లు. స్ట్రెస్ వదిలెయ్. అదంతా పాస్ట్.. అక్కడిది వదిలెయ్. మూడు మంత్రాలు చెబుతాను వినండని యాంకర్ రవి (Anchor Ravi) లవ్‌లో ఫెయిలై డిప్రెషన్‌కి వెళ్లే వారికి సలహాలు ఇచ్చారు. తాజాగా ఆయన ‘బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ విత్ వర్ష’ (Big TV Kissik Talks With Varsha) పాడ్‌క్యాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొని, ఎన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అలా.. బ్రేకప్‌ తర్వాత డిప్రెషన్‌కు వెళ్లేవారికి ఆయన కొన్ని సలహాలు ఇచ్చారు.. అవేంటో ఆయన మాటల్లోనే..

Also Read- Big TV Kissik Talks Show: నాపై పూజలు చేయించారు.. ఎందుకంటే? – యాంకర్ రవి

లైఫ్ ఈజ్ సో బ్యూటీఫుల్

Advertisement

‘‘బ్రేకప్‌తో డిప్రెషన్‌కు వెళ్లే వారి గురించి చెప్పాలంటే.. ఒక అమ్మాయిని ఎంచుకున్నారు. ఆమెతో వర్కవుట్ అవ్వలేదు. ఆ అమ్మాయిని పోనివ్వండి. మెంటల్‌గా స్ట్రాంగ్ అవ్వాలి. మనం టీచర్స్ కాదు.. వాళ్లకి నేర్పడానికి. ప్రతి క్షణం మనకు నేచర్ ఎంతో నేర్పుతుంది. చుట్టు పక్కల ఉన్న ఎంతో మంది నేర్పుతూ ఉంటారు. వస్తువులు నేర్పుతూ ఉంటాయి. అలా ఏదో ఒకచోట నేర్చుకోవాలి. లైఫ్‌లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. లైఫ్ ఈజ్ సో బ్యూటీఫుల్. ఎందుకు ఈ పనికిరాని ఈగోలు, డిప్రెషన్‌లు. స్ట్రెస్ వదిలెయ్. అదంతా పాస్ట్.. అక్కడిది వదిలెయ్. మూడు మంత్రాలు చెబుతాను.. నీ చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్లకు రెస్పెక్ట్ ఇస్తూ బతుకు. దేశం అంటే ప్రేమ ఉండేలా చూసుకో. దేవుడిని నమ్మి, అన్నీ ఆయన మీద వదిలెయ్.. కష్టపడుతూ ఉండు అంతే.

Also Read- Kissik Talks: చిరంజీవిని అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చా.. కానీ అంత ఈజీ కాదు – యాంకర్ రవి

అలాంటి వారికి దూరంగా ఉండండి

Advertisement

విరాట్ కోహ్లీ కూడా అదే చెబుతాడు.. ప్రతి మ్యాచ్‌లో సెంచరీ తర్వాత పైకి చూపెడతాడు. అంతమందిలో కూడా నేను ఇది చేయలేదు.. ఆయనే ఇది చేయిస్తున్నాడని పైకి చూపెడతాడు. అల్లా, జీసస్, తిరుమల వేంకటేశ్వర స్వామి.. ఎవరైనా సరే.. అక్కడ కొంత ఎనర్జీ ఉంటుంది. నీకు ఏదైతే కావాలో, దాని కోసం హార్డ్ వర్క్ చెయ్. చుట్టూ ఎవరూ లేరు, నువ్వొక్కడివే ఉన్నావని భావిస్తూ ప్రయాణం చెయ్. డిప్రెషన్ కాదు, సోది కాదు.. ఏదీ ఉండదు. బ్రేకప్ తర్వాత అమ్మాయిని అబ్బాయికానీ, అబ్బాయిని అమ్మాయి కానీ బ్యాడ్ చేస్తున్నారంటే.. వాళ్లు మెంటల్లీ ఇల్ పీపుల్ కిందే లెక్క. అలా రివెంజ్ తీసుకోవాలని చూసే వాళ్లు.. మెంటల్లీ సిక్ పీపుల్. అలాంటి వారికి నేను ఒక్కటే చెబుతున్నా.. వాళ్లు అట్లాంటోళ్లు అని చిన్న క్లూ దొరికినా.. వెంటనే థ్యాంక్యూ సో మచ్ అని చెప్పేసి, వారికి దూరం జరగండి. రివెంజ్‌లాంటివి వద్దు. జీవితాలన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. ఫ్యామిలీస్ అన్నీ రోడ్ల మీదకి వస్తున్నాయ్. సెట్ అవ్వడం లేదు.. డేంజరస్ అనిపిస్తే.. అక్కడే కట్ చేయండి. అది అందరికీ మంచిది’’ అని రవి సలహా ఇచ్చారు.

Also Read- OTT Movie: చిన్నప్పుడు చేసిన తప్పుకి శిక్ష.. సన్ నెక్ట్స్‌లో దుమ్మురేపుతోన్న చిన్న చిత్రం!

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×