E-Paper
Advertisement

Steve Smith: మ‌రో 30 ఏళ్లు అయినా ఐపీఎల్ ను PSL దాట‌లేదు..పాకిస్తాన్ ప‌రువు తీసిన స్మిత్

Steve Smith: మ‌రో 30 ఏళ్లు అయినా ఐపీఎల్ ను PSL దాట‌లేదు..పాకిస్తాన్ ప‌రువు తీసిన స్మిత్
Advertisement

Steve Smith:  పాకిస్తాన్ సూపర్ లీగ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) ఒకేసారి కొనసాగుతున్న నేపథ్యంలో రెండు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తమ టోర్నమెంట్ గొప్పదంటే.. తమది గొప్పదంటూ సోషల్ మీడియా వేదికగా అటు పాకిస్తాన్, ఇటు ఇండియాకు సంబంధించిన మాజీ క్రికెటర్లు రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇటీవల పాకిస్తాన్ సూపర్ లీగ్ (Pakistan Super League 2026) ఆడిన ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ కంటే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ చాలా గొప్పదంటూ వ్యాఖ్యానించారు స్టీవ్ స్మిత్ ( Steve Smith).

Also Read: Islamabad United vs Hyderabad Kingsmen, Eliminator 2 PSLలో  మ‌రో అరాచ‌కం.. డ‌బ్బులు లేక ఆంటీల‌తో క్లీన్ చేయిస్తున్నారు, దొంగ‌ల్లా దూరేస్తున్నారు

మ‌రో 30 ఏళ్లు అయినా ఐపీఎల్ ను PSL దాట‌లేదు

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటు ఫైనల్ మ్యాచ్ ఇవాళ జరుగుతోంది. హైదరాబాద్ కింగ్స్ మెన్ వర్సెస్ పెషావర్ జల్మీ జట్ల మధ్య లాహోర్ వేదికగా ఫైనల్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు ముల్తాన్ సుల్తాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన స్టీవ్ స్మిత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రపంచంలో అత్యున్నత టోర్నమెంట్ ఐపీఎల్ అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడిప్పుడే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ఎదుగుతా ఉందని.. భవిష్యత్తులో మంచి టోర్నమెంట్ కానుందని వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడైతే ఈ టోర్నమెంట్ క్రమ క్రమంగా ఎదుగుతూ ఉందని వెల్లడించారు. ఐపీఎల్ టోర్నమెంట్ తో పాకిస్తాన్ సూపర్ లీగ్ ను పోల్చలేమని వెల్లడించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని పేర్కొన్నారు. మ‌రో 30 ఏళ్లు అయినా ఐపీఎల్ ను PSL దాట‌లేదంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు స్టీవ్ స్మిత్.

ముల్తాన్ సుల్తాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన స్టీవ్ స్మిత్

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ముల్తాన్ సుల్తాన్స్ జట్టు తరఫున స్టీవ్ స్మిత్ ఆడిన సంగతి తెలిసిందే. గతంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో ఆడిన అనుభవం అతనికి ఉంది. అయితే మొన్నటి సీజన్ సందర్భంగా మినీ వేలం నిర్వహించారు. అందులో స్టీవ్ స్మిత్ ను ఎవరు కొనుగోలు చేయలేదు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు స్టీవ్ స్మిత్. ఈ క్రమంలోనే అతన్ని 14 కోట్ల PKR కు ముల్తాన్ సుల్తాన్ జట్టు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఇప్పటివరకు 11 ఇన్నింగ్స్ లో ఆడాడు స్టీవ్ స్మిత్. ఇందులో 380 పరుగులు సాధించాడు. అంతేకాదు హైదరాబాద్ కింగ్స్ మెన్ జట్టు పైన సెంచరీ కూడా నమోదు చేశాడు స్టీవ్ స్మిత్. 50 బంతుల్లోనే 106 పరుగులు చేసి అదరగొట్టాడు. ఓవరాల్ గా 160 స్ట్రైక్ రేట్ తో దుమ్ము లేపాడు.

Advertisement

Also Read: Ramiz Raja Hug: కామెంట్రీలో చేస్తుండ‌గా రొమాన్స్‌..రమీజ్ రాజా, లీసా హాట్ వీడియో వైర‌ల్

 

https://www.facebook.com/photo?fbid=993858263554916&set=a.808612632079481

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×