E-Paper
Advertisement

నిర్మల్ జిల్లా రైతులకు అండగా బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్..ఆర్థిక సాయం చేసిన రైతు బిడ్డ!

నిర్మల్ జిల్లా రైతులకు అండగా బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్..ఆర్థిక సాయం చేసిన రైతు బిడ్డ!
Advertisement

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ పరిచయం అవసరం లేని పేరు. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఒక రైతు బిడ్డగా అందరికీ సుపరిచితమైన ఈయన రైతులకు ఏదైనా కష్టం వస్తే ఆదుకోవడానికి ముందు వరుసలో ఉంటారు. తాజాగా నిర్మల్ జిల్లాలో మొక్కజొన్న పంట కాలి బూడిద కావడంతో రైతులు కన్నీరు అవుతున్న సంగతి తెలిసిందే. నిర్మల్ జిల్లాలోని పెంబి మండలంలో గోసుకుల రాములు, కన్నె మల్లేష్ అనే ఇద్దరు రైతులు తమకున్న 10 ఎకరాల పొలంలో మొక్కజొన్నను నాటారు. అయితే పంట చేతికి వచ్చే సమయంలో విద్యుత్ తీగలు తగిలి షార్ట్ సర్క్యూట్ కారణంగా 10 ఎకరాల మొక్కజొన్న పంట మొత్తం కాలి బూడిదైన సంగతి తెలిసిందే.

నిర్మల్ జిల్లా రైతులకు అండగా ప్రశాంత్..

ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెలలపాటు ఎంతో కష్టపడి చేతికి వచ్చిన పంట ఇలా బూడిద పాలు కావడంతో రైతులు విలవిల ఏడుస్తున్నటువంటి ఘటనలు అందరిని కలిచి వేసాయి. అయితే ఈ రైతు బాధను అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వం అలాగే పలువురు ఆర్థికంగా సహాయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్ కూడా ఈ ఘటనపై స్పందిస్తూ రైతులకు అండగా నిలిచారు.

రైతులకు ఆర్థిక సాయం చేసిన ప్రశాంత్..

Advertisement

నిర్మల్ జిల్లాలో రైతుల పంట బూడిద కావడంతో ఈ విషయం తెలుసుకున్న పల్లవి ప్రశాంత్ తన మనుషులను అక్కడికి పంపించి వారికి ఆర్థిక సహాయం అందజేశారు. అయితే ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ మాలలో ఉన్న నేపథ్యంలో అక్కడికి వెళ్లలేకపోయారని మాల తీసిన వెంటనే స్వయంగా వెళ్లి రైతులను కలుస్తాను అంటూ వీడియో కాల్స్ ద్వారా సదరు రైతులతో మాట్లాడి వారికి ధైర్యం కల్పించారు. ఇలా తన వంతుగా కొంత డబ్బును వారికి సహాయంగా పల్లవి ప్రశాంత్ అందజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

?igsh=MWJsOXM3empoNXZ4aQ%3D%3D

Advertisement

ఇలా పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డగా రైతు కష్టం తెలిసిన వ్యక్తిగా రైతులకు సహాయం చేస్తానని మొదటి నుంచి కూడా చెబుతూ వస్తున్నారు . అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాల్గొన్న ఈయన సీజన్ సెవెన్ కార్యక్రమంలో విన్నర్ అయితే ప్రైజ్ మనీగా వచ్చిన డబ్బు మొత్తం రైతుల కోసమే ఖర్చు చేస్తానని ఆపదలో ఉన్న రైతును ఆదుకుంటానని ఈయన తెలిపారు. అయితే ఇప్పటికే కొంతమందికి పల్లవి ప్రశాంత్ సహాయం చేసినప్పటికీ ఈయన సింపతీ కొట్టేయడం కోసమే అలా చెప్పారని రైతులకు సహాయం చేయలేదు అంటూ ఎంతో మంది పల్లవి ప్రశాంత్ పై విమర్శలు కురిపించారు. కానీ పల్లవి ప్రశాంత్ ఆపదలో ఉన్న రైతులకు అండగా నిలుస్తున్నారనే విషయం తెలిసిన ఈయన అభిమానులు అలాగే సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ పల్లవి ప్రశాంత్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Also Read: సినీ గేయ రచయిత చంద్రబోస్ ఇంట్లో తీవ్ర విషాదం.. స్నేహితులను కలవడానికి వెళ్ళి!

Related News

కళ్యాణ్ రామ్ భయాన్ని పోగొడతానంటున్న అనిల్ రావిపూడి!

కార్, నెక్లెస్ గిఫ్ట్ అన్నారు.. కానీ.. బిగ్ బాస్ ప్రైజ్ మనీ గుట్టు రట్టు చేసిన రైతుబిడ్డ!

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఇల్లు ఇల్లాలు పిల్లలు అవుట్..?

Monday Movies in Tv : సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్..

Podarillu Today Episode : మహాను రెచ్చగొట్టిన తాయారు.. పెద్ది, మనీష కు పెళ్లి..? శైలుకు పెళ్లి..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కోసం రోహిణి ప్లాన్.. అరుణ్, సుమతి లవ్ ట్రాక్.. ప్రభావతి దెబ్బకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ తో తన పెళ్లి చేయమన్న జ్యో      

Illu Illalu Pillalu Today Episodes: సాగర్ మాటతో నర్మద ఫిదా.. ధీరజ్ ఎంట్రీతో ప్రేమ షాక్.. కన్నీళ్లు పెట్టించిన వేదవతి..

Big Stories

Advertisement
×