E-Paper
Advertisement

కరీంనగర్ జ్యువెలరీ ఘటన.. ఆ దొంగలను పట్టిస్తే.. రూ.లక్ష బహుమతి!

కరీంనగర్ జ్యువెలరీ ఘటన.. ఆ దొంగలను పట్టిస్తే.. రూ.లక్ష బహుమతి!
Advertisement

కరీంనగర్‌లో సంచలనం సృష్టించిన జ్యువెలరీ షాపు దోపిడీ కేసుకు సంబంధించి పోలీసులు కీలక పురోగతి సాధించారు. కాల్పులు జరిపి నగదు, నగలతో పరారైన నిందితుల చిత్రాలను ఉన్నతాధికారులు అధికారికంగా విడుదల చేశారు. ఈ ముఠా ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయల నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు.

కరీంనగర్ నగరంలో ఆదివారం పట్టపగలే జరిగిన భారీ దోపిడీ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. స్థానిక బంగారు దుకాణంలోకి చొరబడిన ఐదుగురు దుండగులు తుపాకులతో బెదిరించి భారీ మొత్తంలో నగలు, నగదు ఎత్తుకెళ్లారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిపై కాల్పులు జరిపి తప్పించుకున్నారు. ఈ సాహసోపేత దోపిడీని సీరియస్‌గా తీసుకున్న జిల్లా పోలీస్ యంత్రాంగం నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దొంగల ఫోటోలను సేకరించి వాటిని బహిరంగ పరిచారు.

Advertisement

నిందితుల గురించి కచ్చితమైన సమాచారం అందించిన వారికి లక్ష రూపాయల పారితోషికం ఇస్తామని పోలీస్ కమిషనరేట్ ప్రకటించింది. ఈ దొంగల చిత్రాలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు ఇప్పటికే చేరవేశారు. సోషల్ మీడియా వేదికగా, వాట్సాప్ గ్రూపుల ద్వారా సాధారణ పౌరులకు కూడా ఈ ఫోటోలను షేర్ చేస్తున్నారు. అనుమానిత వ్యక్తులు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని ప్రజలను కోరారు.

హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరితో పాటు నూతనంగా ఏర్పాటైన ఫ్యూచర్ సిటీ పరిధిలోని పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. ప్రధాన రహదారులు, చెక్ పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. దొంగలు ఇతర జిల్లాలకు లేదా పొరుగు రాష్ట్రాలకు పారిపోయే అవకాశం ఉన్నందున రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద నిఘా పెంచారు. ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో సైతం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

ఈ కేసులో సమాచారం ఇవ్వదలచిన వారు డయల్ 100 లేదా కరీంనగర్ 2 టౌన్ ఇన్ స్పెక్ట‌ర్ (8712670762), ఏసీపీ కరీంనగర్ టౌన్ (8712670711), ఎస్బీ కంట్రోల్ కరీంనగర్ (8712670713) నంబర్లకు ఫోన్ చేయవచ్చు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని పోలీసులు హామీ ఇచ్చారు. దర్యాప్తుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని వారు విజ్ఞప్తి చేశారు. నిందితులు ఆయుధాలు కలిగి ఉన్నందున నేరుగా పట్టుకోవడానికి ప్రయత్నించకుండా పోలీసులకు సమాచారం ఇవ్వడమే శ్రేయస్కరమని సూచించారు.

ALSO READ: విశాఖలో విషాదం.. జాకీలతో ఇల్లును ఎత్తుతుండగా ప్రమాదం, ఒకరు మృతి

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×