E-Paper
Advertisement

ఓటీటీలో టాప్ రేటింగ్ తో అదరగొడుతున్న మినీ సిరీస్ లు

ఓటీటీలో టాప్ రేటింగ్ తో అదరగొడుతున్న మినీ సిరీస్ లు
Advertisement

Mini Series OTT : ఓటీటీ ప్రపంచంలో వెబ్ సిరీస్ లకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అలాంటి సిరీస్ అభిమానుల కోసమే ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆరు ఐకానిక్ డ్రామా, వార్ సిరీస్‌ లు. మరి ఈ సిరీస్ లు ఎక్కడ ఉన్నాయి ? వాటి పేర్లు ఏంటి ? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం పదండి.

Adolescence (2025)

వినూత్నమైన బ్రిటీష్ క్రైమ్ డ్రామా ‘అడోలసెన్స్’. ఒకే షాట్ లో చిత్రీకరించడం అన్నది ఈ సిరీస్ స్టోరీ. 13 ఏళ్ల బాలుడిపై మర్డర్ కేసు పడితే, ఆ కోర్టు ట్రయల్ మరియు అతని తండ్రి పడే మానసిక వేదన చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

Roots (1977)

Advertisement

అమెరికన్ టెలివిజన్ చరిత్రలో మైండ్-బ్లోయింగ్ మాస్టర్ పీస్ ‘రూట్స్’. ఆఫ్రికా నుండి కిడ్నాప్ కాగా, అమెరికాలో బానిసగా మారిన వ్యక్తి ‘కుంట కింటే’ (Kunta Kinte). అతని జీవితం, అతని తరువాతి తరాల వారిపై జరిగిన అణచివేత, స్వేచ్ఛ కోసం చేసిన పోరాటమే ఈ మూవీ స్టోరీ.

Pride and Prejudice (1995)

జేన్ ఆస్టెన్ రాసిన ప్రసిద్ధ నవల ఆధారంగా తెరకెక్కిన బెస్ట్ బీబీసీ (BBC) సిరీస్ ‘ప్రైడ్ అండ్ ప్రిజుడీస్’. స్వతంత్ర ఆలోచనలున్న ఎలిజబెత్ బెన్నెట్, అహంకారిగా కనిపించే ధనవంతుడు మిస్టర్ డార్సీ మధ్య మంచి బంధం ఏర్పడుతుంది. ఈ ఇద్దరి మధ్య తిరిగే కొన్ని అపోహల చుట్టూ తిరుగుతుంది ఈ క్లాసిక్ రొమాంటిక్ డ్రామా.

Brideshead Revisited (1981)

Advertisement

1920ల కాలంలో సాగే కథ ‘బ్రైడ్స్‌హెడ్ రీవిజిటెడ్’. చార్లెస్ రైడర్ అనే ఆర్టిస్ట్‌ ఉంటాడు. అతనికి లగ్జరీ బ్రిటీష్ క్యాథలిక్ కుటుంబానికి మధ్య ఉన్న దశాబ్దాల అనుబంధం, ప్రేమ, మతం, వారి పతనాన్ని ఈ సిరీస్ లో చూడవచ్చు. స్టోరీ అద్భుతంగా ఉంటుంది.

Band of Brothers (2001)

ఇది అత్యంత రియలిస్టిక్‌గా తీసిన వార్ సిరీస్‌. రెండవ ప్రపంచ యుద్ధంలో ‘బ్యాండ్ ఆఫ్ బ్రదర్స్’ అనే అమెరికా ఆర్మీకి చెందిన ‘ఈజీ కంపెనీ’ సైనికుల యదార్థ గాథ. పారాచూట్ ట్రైనింగ్ నుండి యుద్ధం ముగిసే వరకు వారు ఎదుర్కొన్న నరకం, వారి మధ్య ఉన్న స్నేహం గుండెల్ని పిండేసేలా ఉంటుంది.

Also Read : 1 గంట 49 నిమిషాల మూవీ… దిమాక్ కరాబ్ ట్విస్టులు మావా

Generation Kill (2007)

2003లో అమెరికా ఇరాక్‌పై చేసిన దాడి నేపథ్యంలో సాగే స్టోరీనే ‘జనరేషన్ కిల్’. ఇందులో మెరైన్ బెటాలియన్‌ తో కలిసి ప్రయాణించిన జర్నలిస్ట్ కళ్లారా చూసిన యుద్ధ విశేషాలు, మిలిటరీ బ్యూరోక్రసీలోని లోపాలను, సైనికుల మానసిక స్థితి ఇందులో చాలా రా (Raw) అండ్ రస్టిక్ గా చూపించారు.

ఎక్కడ చూడవచ్చు అంటే ?

ఈ సిరీస్‌లలో ‘బ్యాండ్ ఆఫ్ బ్రదర్స్’, ‘జనరేషన్ కిల్’ ప్రస్తుతం భారతదేశంలో JioCinema లో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉన్నాయి. ‘ప్రైడ్ అండ్ ప్రిజుడీస్’, ‘రూట్స్’ క్లాసిక్స్ Apple TV లేదా అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడటానికి అవైలబుల్ గా ఉన్నాయి. ‘అడోలసెన్స్ (2025)’ అనేది మాత్రం ఈ మధ్య కాలంలో వచ్చిన సరికొత్త సిరీస్ కాబట్టి నెట్‌ఫ్లిక్స్ ద్వారా వీక్షించవచ్చు.

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×