Crime Thriller OTT : బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కర్తవ్య’ ఓటీటీలో ట్రెండ్ అవుతోంది. మరి ఈ మూవీ ఓటీటీలో ట్రెండ్ అవ్వడానికి గల కారణం ఏంటి ? ఏ ఓటీటీలో ఈ మూవీని చూడొచ్చు ? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం పదండి.
సైఫ్ అలీ ఖాన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘కర్తవ్య’. 2026 మే 15న డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది ఈ మూవీ. సస్పెన్స్, థ్రిల్స్ కలగలిసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో నలుగురు స్టార్స్ నటించడం విశేషం. సినిమా ఓటీటీలో ఆలా విడుదలైందో లేదో ఇలా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. స్టోరీ అద్భుతంగా ఉండడంతో రిలీజైన గంటల వ్యవధిలోనే ఈ మూవీ ఓటీటీతో పాటు సోషల్ మీడియా సంచలనంగా మారింది. మరి ఈ చిత్రం గూగుల్ లో ఎందుకు ట్రెండింగ్ లో ఉందో ఇప్పుడు చూద్దాం.
ఈ మూవీ ఇలా ట్రెండింగ్ లోకి రావడానికి చాలా కారణాలే ఉన్నాయి. మొదటి కారణం ఈ చిత్రం 3 సంవత్సరాలు ఆలస్యంగా విడుదల అయ్యింది. రెండవది, మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అవ్వడానికి సౌరభ్ ద్వివేది కారణం అవ్వడం. ఈ చిత్రంలో ఆయన విలన్ గా నటించగా, సైఫ్ అలీ ఖాన్ మరోసారి పోలీస్ అధికారి పాత్రలో సూపర్ గా నటించారు. మొత్తానికి ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో ట్రెండింగ్ జాబితాలో కూడా అగ్రస్థానంలో కొనసాగుతుండడం విశేషం.
‘కర్తవ్య’లో ఉన్న అద్భుతమైన తారాగణం గూగుల్ లో జనాలు ఈ సినిమా కోసం వెతికేలా చేసింది. ఈ చిత్రంలో సైఫ్ తో పాటు సౌరభ్ ద్వివేది, రసికా దుగ్గల్, సంజయ్ మిశ్రా, మనీష్ చౌదరి, జాకిర్ హుస్సేన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. సౌరభ్ ద్వివేది ఈ మూవీతోనే నటుడిగా పరిచయం అవ్వడం విశేషం. సినిమాలో గ్లామర్ లేదు, అతి స్టైలింగ్ లేదు.ఒక్కొక్కరూ యాక్టింగ్ తో ఇరగదీశారు.
,మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ‘కర్తవ్య’ చిత్రానికి షారుఖ్ ఖాన్ తో ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయనే ఈ సినిమాని నిర్మించారు. సైఫ్ అలీ ఖాన్ వంటి స్టార్ హీరోగా నటిస్తే, ఈ క్రైమ్ థ్రిల్లర్ ను షారుఖ్ ఖాన్ తో పాటు ఆయన భార్య గౌరీ ఖాన్ నిర్మించారు. తమ సొంత నిర్మాణ సంస్థ అయిన రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై తెరకెక్కించారు.
Also Read : ఈ 5 రోజుల్లో ఓటీటీలోకి ఏకంగా 17 తెలుగు సినిమాలు… ఇందులో మీరెన్ని చూశారు ?
పవన్ మాలిక్ (సైఫ్ అలీ ఖాన్) హర్యానాలో ఉండే కఠినమైన పోలీస్ ఆఫీసర్. ఆయన 40వ పుట్టినరోజు నాడే అదే ఊరిలో ఉన్న పవర్ ఫుల్ కాంట్రోవర్షియల్ బాబా ‘ఆనంద్ శ్రీ’ (సౌరభ్ ద్వివేది) ఆశ్రమంలో జరిగే స్కామ్ ను బయట పెట్టె ప్రయత్నం జరుగుతుంది. ఒక మహిళా జర్నలిస్ట్ అక్కడ జరిగే చిన్న పిల్లల లైంగిక వేధింపుల స్కామ్ ను బయట పెట్టడానికి ట్రై చేస్తుంది. పవన్ ఆమెకు రక్షణ కల్పిస్తాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే… ఆ జర్నలిస్ట్ ను అందరి ముందే దారుణంగా కాల్చి చంపేస్తారు. రక్షణ కల్పించడంలో ఫెయిల్ అయ్యాడనే నెపంతో పవన్ ను సస్పెండ్ చేయాలని చూస్తారు. కానీ ఆ హంతకుడిని పట్టుకోవడానికి పవన్ ఒక వారం రోజులు గడువు కావాలని కోరతాడు. ఆ తరువాత కథలో ఊహించని ట్విస్ట్ వస్తుంది. మరి ఆ ట్విస్ట్ ఏంటి ? హంతకుడిని హీరో ఎలా పట్టుకున్నాడు ? ఆ దొంగ బాబా పని పట్టాడా లేదా ? చివరికి ఏమైంది ? అన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.