Paris Apartment : ఫారిస్ …దీన్ని చూడాలని ఎవరికుండదు.అందుకే కాస్త డబ్బుండి, ఏ మాత్రం సమయం చిక్కినా ఈ అందాల నగరాన్ని చూసేందుకు వాలిపోతుంటారు. అలాంటి పారిస్ నగరంలో సొంతంగా ఒక ఇల్లు ఉండాలని, ముఖ్యంగా ఐఫిల్ టవర్ కనిపించేలా బాల్కనీ ఉండాలని కలలు కనడం చాలా సహజం. అదే కలని నిజం చేసుకునేందుకు ఎంత కష్టమైనా అనుభవిస్తానంటున్నాడు ఓ క్రేజీ మ్యాన్.
అగ్గిపెట్టె కంటే చిన్నగా ఉండే ఈ ఫ్లాట్ కోసం
విషయంలోకి వెళ్తే సెబాస్టియన్ హెడ్‌బర్గ్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను షాక్ కి గురి చేస్తుంది. ఎందుకంటారా.. అగ్గిపెట్టె కంటే చిన్నగా ఉండే ఈ ఫ్లాట్ కోసం నెలకు ఏకంగా రూ. 66,900 అద్దె చెల్లిస్తున్నాడు మరి. ఈ అపార్ట్‌మెంట్‌లోకి అడుగుపెట్టగానే ఎవరికైనా కలిగే ఫస్ట్ ఫీలింగ్ అసలు ఇది ఇల్లేనా అని.
also read :‘పెద్ది’ రిలీజ్ ముందు టాలీవుడ్‌లో పర్సంటేజ్ చిచ్చు.. సునీల్ నారంగ్ అవుట్..అసలు కారణం అదేనా?
అవును..అడుగు వేయడానికి కూడా ఇబ్బందిగా ఉండే ఈ గదిలో, మహా అయితే ఒక మనిషి పడుకోవడానికి వీలుంటుంది.ప్రైవసీ అనేది అక్కడ దొరికే చాలా కాస్ట్లీ థింగ్.ఎందుకంటే, తలుపు తీయగానే ఒకవైపు బట్టలు వేలాడదీసే స్టాండ్, మరోవైపు షవర్ ఏరియా కనిపిస్తాయి. వంటగది, పడకగది అన్నీ అక్కడ కలిసిపోయి ఉంటాయి. పారిస్‌లో స్థలం విలువ ఎంత ఎక్కువగా ఉంటుందో చెప్పడానికి ఇదొక ప్రత్యక్ష నిదర్శనం.అయితే కష్టాలు అక్కడితో ముగియలేదండోయ్.ఈ అపార్ట్‌మెంట్ ఆ భవనంలో ఏడో అంతస్తులో ఉంది. ఇక అది చాలా ఓల్డ్ అవడంతో ఆ బిల్డింగ్‌లో అసలు లిఫ్ట్ ఫెసిలిటీనే లేదు.ఇక అతను రోజు బయటికి వెళ్లి వచ్చినప్పుడల్లా చచ్చినట్టు 134 మెట్లు ఎక్కాల్సిందే. బహుశా అదే అతనికి పెద్ద ఎక్సర్ సైజ్ కాబోలు.
అయితే అసలు ఏమీ ఫెసిలిటీస్ లేని ఈ అపార్ట్‌మెంట్‌కు అంత రెంట్ ఎందుకని ఆలోచిస్తున్నారా ..ఎందుకంటే ఆ బాల్కనీ తలుపులు తీయగానే ఎదురుగా ఐఫిల్ టవర్ మెరిసిపోతూ, ఫారిస్ అతని పాదాల కింద ఉన్నట్టు ఉంటుంది మరి.యస్..ఆ వ్యూ చూస్తుంటే ఎవరైనా సరే మైమరిచిపోవాల్సిందే మరి,ఇక అపర కుబేరులు కూడా తమ కోట్లాది రూపాయల విల్లాలు వదిలి, ఇలాంటి చిన్న చిన్న గదుల్లో కేవలం ఆ అందం కోసమే ఉండటానికి ఇష్టపడతారంటే ఆశ్చర్యం లేదు.
చిన్న గదులకి డిమాండ్ చాలా ఎక్కువ
నిజానికి పారిస్‌లో ఇలాంటి ‘గారెట్స్’ (చిన్న గదులు) పట్ల డిమాండ్ చాలా ఎక్కువ. టూరిజం, చదువుకోవడానికి వచ్చే వారు పారిస్ లైఫ్ స్టైల్‌ను కోరుకునే యూత్ ఇలాంటి చిన్న గదులకే లక్షలు ఖర్చు చేస్తున్నారట . కనీస సౌకర్యాలు లేకపోయినా, పారిస్ నడిబొడ్డున నివసిస్తున్నామనే ఆ తృప్తి, ఐఫిల్ టవర్ అందాలను ఉచితంగా ( ఇలా అద్దె కి ఉంటూ) రోజూ చూడవచ్చనే ఆశ వారిని కష్టాలకు అలవాటు చేస్తోంది. నెటిజన్లు మాత్రం ఈ వీడియో చూసి “ఒక చిన్న బాల్కనీ వ్యూ కోసం ఇంతటి నరకమా?” అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం, “ఆ ఐఫిల్ టవర్ అందం కోసం 134 మెట్లు ఏంటి, ఎన్ని మెట్లైనా ఎక్కొచ్చు” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
also read :సమ్మర్ హెల్త్ టిప్స్.. వేసవిలో ఆరోగ్యంగా ఉండేందుకు చిట్కాలు!
ఏది ఏమైనా, మనిషి సౌకర్యం కంటే అందం, అనుభూతి కోసమే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడనడానికి ఈ పారిస్ అపార్ట్‌మెంట్ బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. స్థలం తక్కువ, సౌకర్యాలు నిల్లు, అయినా కానీ ఈ అపార్ట్‌మెంట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో అత్యంత క్రేజీయెస్ట్ అడ్రస్‌గా నిలిచిపోయింది . మరి మీరూ అందమైన ఐఫిల్ టవర్ వ్యూ కోసం ఇలాంటి చిన్న ఇంట్లో ఉండటానికి రెడీయా ?