Adventure Drama OTT : కొన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్ కోసమే కాకుండా మంచి సోషల్ మెసేజ్ ను కూడా ఇస్తుంటాయి. అలాంటి సినిమాలలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ అద్భుతంగా ఉంది. ఒక వ్యక్తి సమాజానికి దూరంగా బతకాలని నిర్ణయించుకుంటాడు. అయితే అతని ప్రయాణం ఎలా సాగింది అనేది ఈ కథ. ఈ సినిమా ప్రకృతి ప్రేమికులకు, జీవితంలో కొత్తదనాన్ని కోరుకునే వాళ్లకు బెస్ట్ సజెషన్ గా చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన రియల్ స్టోరీ. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాలను కూడా తెలుసుకుందాం.
‘ఇన్ టూ ది వైల్డ్’ (Into the Wild) 2007లో వచ్చిన ఒక అద్భుతమైన అమెరికన్ బయోగ్రాఫికల్ అడ్వెంచర్ చిత్రం. క్రిస్టోఫర్ మెక్‌కాండ్లెస్ అనే యువకుడి నిజ జీవిత ప్రయాణం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. సీన్ పెన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎమిలే హిర్ష్ ఇందులో క్రిస్టోఫర్ మెక్‌కాండ్లెస్ పాత్రలో అద్భుతంగా నటించారు. ప్రస్తుతం ఈ సినిమా Sonylivలో అందుబాటులో ఉంది.
1990లో క్రిస్టోఫర్ మెక్‌కాండ్లెస్ ఎమోరీ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తాడు. అతని తల్లిదండ్రులు అతనికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటారు. కానీ క్రిస్టోఫర్‌కు సమాజంలో కాకుండా ఒంటరిగా బతకడానికి మక్కువ చూపుతాడు. అందుకే తన వద్ద ఉన్న 24,000 డాలర్ల పొదుపు మొత్తాన్ని ఒక స్వచ్ఛంద సంస్థకు దానం చేసి, తన గుర్తింపు కార్డులను కూడ చింపివేసి, ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి వెళ్ళిపోతాడు. తన పేరును “అలెగ్జాండర్ సూపర్ ట్రాంప్” అని మార్చుకుని, తన పాత కారును వదిలేసి అమెరికా అంతటా ప్రయాణిస్తాడు. ఈ ప్రయాణంలో అతను అనేకమంది వ్యక్తులను కలుస్తాడు:
చివరకు 1992 ఏప్రిల్‌లో క్రిస్టోఫర్ అలస్కా చేరుకుంటాడు. అక్కడ జనసంచారానికి దూరంగా, ఒక అడవిలో పాత బస్సును నివాసంగా మార్చుకుంటాడు. ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడుపుతూ, దొరికినవి తింటూ జీవిస్తాడు. కొన్ని నెలల తర్వాత, ప్రకృతి కోపాన్ని కూడా చూస్తాడు. చలి పెరగడం, ఆహారం దొరకకపోవడం వల్ల అతను బలహీనపడతాడు. తిరిగి వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తాడు, కానీ మధ్యలో ఉన్న నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అతను దాటలేక మళ్ళీ బస్సు దగ్గరికే చేరుకుంటాడు.చివరికి అతని ప్రయాణం ఏ విధంగా ముగుస్తుందనేది సినిమా చూసి తెలుసుకోండి.
Read Also : 6 ఆస్కార్ నామినేషన్లు… IMDB రేటింగ్ 8.2… ఇలాంటి సినిమాను ఇప్పటిదాకా చూసుండరు భయ్యా