E-Paper
Advertisement

Adventure Thriller Movie OTT: సినిమా అంటే ఇదే మావా… ప్రేమించినందుకు 14 ఏళ్ళ జైలు… కట్ చేస్తే ఎన్నడూ చూడని రివేంజ్

Adventure Thriller Movie OTT: సినిమా అంటే ఇదే మావా… ప్రేమించినందుకు 14 ఏళ్ళ జైలు… కట్ చేస్తే ఎన్నడూ చూడని రివేంజ్
Advertisement

Adventure Thriller Movie OTT : ఒక ఫ్రెంచ్ మూవీ రిలీజ్ అయినప్పటినుంచి సెన్సేషన్ అయింది. కేవలం ఫ్రాన్స్‌లోనే 90 లక్షల మందికి పైగా థియేటర్లలో చూశారు ఈ సినిమాను. గ్లోబల్‌గా కూడా ఈ సినిమాకు చాలా మంచి రేటింగ్స్ వచ్చాయి. ఐయండిబిలో దీనికి ఏకంగా 8.0/10 రేటింగ్ ఉంది. ఫ్రాన్స్‌లో ఇచ్చే అత్యున్నత సినిమా అవార్డులు అయిన సెసార్ అవార్డ్స్ లో ఈ సినిమాకు ఏకంగా 14 నామినేషన్లు దక్కాయి. ఈ సినిమా దాదాపు 3 గంటల పాటు ఉంటుంది. కథ పెద్దదైనా ఎక్కడా బోర్ కొట్టకుండా, చాలా వేగంగా సాగే స్క్రీన్‌ప్లేతో డైరెక్టర్లు మ్యాజిక్ చేశారు. ఈ ఫ్రెంచ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలతో బాక్సాఫీస్ విజయాన్ని అందుకుంది. దీనిపేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ ఫ్రెంచ్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది కౌంట్ ఆఫ్ మాంటి క్రిస్టో’ (The Count of Monte Cristo). 2024 లో వచ్చిన ఈ సినిమాకు మాథ్యూ డెలాపోర్టే, అలెగ్జాండర్ డి లా పటెల్లియర్దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో ప్రధాన పాత్రలో పియరీ నినీ (ఎడ్మండ్ డాంటెస్‌గా) నటించగా, బాస్టియన్ బౌయిలాన్, అనాస్ డెమౌస్టియర్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. దాదాపు 3 గంటలు నిడివి ఉన్న ఈ సినిమా, ఫ్రెంచ్ చిత్ర పరిశ్రమలోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు. దాదాపు ఈ సినిమాకు 400కోట్లు ఖర్చు చేశారు. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు డబ్బింగ్‌లో అందుబాటులో లేదు. Amazon Prime Video, Apple TV, Google Play ప్లాట్‌ ఫామ్‌లలో ఫ్రెంచ్ భాషలో ఇంగ్లీష్ ఆడియో/సబ్ టైటిల్స్ తో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఎడ్మండ్ డాంటెస్ అనే ఒక మంచి కుర్రాడు షిప్పులో కెప్టెన్‌గా ప్రమోషన్ పొంది, తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుందామనుకుంటాడు. కానీ అతని ఎదుగుదల చూసి ఓర్వలేని ముగ్గురు స్నేహితులు కలిసి ఒక ప్లాన్ వేస్తారు. ఎడ్మండ్ దేశద్రోహి అని అబద్ధపు సాక్ష్యాలు సృష్టించి, సరిగ్గా పెళ్లి రోజే అతన్ని అరెస్ట్ చేయిస్తారు. పాపం, ఏ తప్పూ చేయని ఎడ్మండ్‌ను సముద్రం మధ్యలో ఉన్న ఒక భయంకరమైన జైలుకు పంపిస్తారు. అక్కడ అతను ఏళ్ల తరబడి నరకం అనుభవిస్తాడు. జైలులో ఉన్నప్పుడు ఎడ్మండ్‌కు ఒక ముసలి ఖైదీ పరిచయమవుతాడు. ఆ ముసలాయన ఎడ్మండ్‌కు చదువు, కత్తి యుద్ధం నేర్పించడమే కాకుండా, ఒక రహస్య ద్వీపంలో దాగి ఉన్న భారీ నిధి గురించి చెబుతాడు.

సుమారు 14 ఏళ్ల తర్వాత, ఎడ్మండ్ అతి కష్టం మీద జైలు నుంచి తప్పించుకుంటాడు. ఆ ద్వీపానికి వెళ్లి అక్కడ ఉన్న అంతులేని బంగారాన్ని, వజ్రాలను చేజిక్కించుకుంటాడు. అప్పటివరకు సాదాసీదాగా ఉన్న ఎడ్మండ్, ఒక్కసారిగా కోటీశ్వరుడిగా మారిపోతాడు. తనను మోసం చేసిన ముగ్గురు ఇప్పుడు సమాజంలో పెద్ద మనుషులుగా, గొప్ప పదవుల్లో ఉంటారు. తాను ప్రేమించిన అమ్మాయి కూడా వాళ్ళల్లో ఒకడిని పెళ్లి కూడా చేసుకుని ఉంటుంది. ఇప్పుడు ఎడ్మండ్ కొత్త రూపంలో ఎవరికీ అనుమానం రాకుండా, వాళ్ల దగ్గరకు వెళ్తాడు. తనను జైలుకు పంపిన వాళ్లందరిపై పగ తీర్చుకునే క్రమంలో ఈ సినిమా క్లైమాక్స్ చాలా క్రేజీగా ఉంటుంది.

Advertisement

Read Also : అద్దెకు వచ్చిన అబ్బాయితో అరాచకం… స్పర్శ కావాలంటూ పాడు పనులు… పెద్దోళ్ల సినిమా

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×