E-Paper
Advertisement

Romantic Movie OTT: అద్దెకు వచ్చిన అబ్బాయితో అరాచకం… స్పర్శ కావాలంటూ పాడు పనులు… పెద్దోళ్ల సినిమా

Romantic Movie OTT: అద్దెకు వచ్చిన అబ్బాయితో అరాచకం… స్పర్శ కావాలంటూ పాడు పనులు… పెద్దోళ్ల సినిమా
Advertisement

Romantic Movie OTT : రొమాంటిక్ సినిమాలు రకరకాల కంటెంట్ తో వస్తుంటాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం పెద్దలకు అన్నట్లే ఉంటాయి. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే రొమాంటిక్ సినిమా ఎలా ఉంటుందంటే, ఈ సినిమా చూస్తున్నప్పుడు మన పక్కింట్లో జరిగే కథలా అనిపిస్తుంది. చాలా తక్కువ డైలాగులతో, కేవలం చూపులు, ఎమోషన్స్ తోనే కథను నడిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా లైట్‌గా ఉంటుంది. అయితే ఇది ఒక గే రొమాంటిక్ మూవీ. దీనికి ఐయండిబిలో 7.3 రేటింగ్ కూడా ఉంది.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

ఈ అర్జెంటీనా రొమాంటిక్ డ్రామా సినిమా పేరు ‘ది బ్లాండ్ వన్’ (The Blonde One). 2019లో వచ్చిన ఈ సినిమాకు మార్కో బెర్గర్ దర్శకత్వం వహించారు. ఈయన ఇలాంటి గే రొమాన్స్ సినిమాలను తీయడంలో చాలా ఫేమస్. ఆయన సినిమాల్లో డైలాగులు చాలా తక్కువగా ఉంటాయి. కేవలం చూపులు, బాడీ లాంగ్వేజ్‌తోనే సీన్ పండించడం ఆయన స్టైల్. ఇందులో గాబ్రియేల్‌గా నటించిన గస్టన్ రే, జువాన్‌గా నటించిన అల్ఫోన్సో బారన్ ఇద్దరూ అద్భుతంగా నటించారు. 2019లో విడుదలైన ఈ సినిమా చాలా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడింది. ముఖ్యంగా మిన్నియాపాలిస్ సెయింట్ పాల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమాకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా ఆపిల్ టివి, ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

గాబ్రియేల్ అనే ఒక యువకుడు, పెళ్ళాం పోయాక దిక్కుతోచని స్థితిలో తన ఆఫీస్ మేట్ జువాన్ ఇంట్లో అద్దెకు దిగుతాడు. జువాన్ అంటే ఆ ఏరియాలో ఒక రేంజ్ బిల్డప్. చూడటానికి గట్టి కటౌట్, ఎప్పుడూ అమ్మాయిలతో తిరుగుతూ, మందు కొడుతూ నేను పక్కా లోకల్ అన్నట్టు ఉంటాడు. కానీ లోలోపల అతనికి గాబ్రియేల్ మీద ఒక కన్ను ఉంటుంది. గాబ్రియేల్ మాత్రం చాలా సైలెంట్, తన పని తను చేసుకుంటూ జువాన్ చేసే పనులన్నీ గమనిస్తూ ఉంటాడు. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ వంటావార్పు కలిపి చేసుకుంటూ, మెల్లమెల్లగా ఒకరికొకరు అలవాటు పడిపోతారు.

వీరిద్దరి మధ్య అసలు కథ ఆ నాలుగు గోడల మధ్యే మొదలవుతుంది. బయట లోకానికి జువాన్ ఎంత గంభీరంగా కనిపించినా, ఇంట్లో మాత్రం గాబ్రియేల్ తో చాలా క్లోజ్ గా ఉంటాడు. మాటల కంటే ఒకరినొకరు చూసుకునే చూపుల్లోనే అసలు మేటర్ అంతా అర్థమైపోతుంటుంది. ఒకానొక టైమ్ లో వీరిద్దరి మధ్య ఉన్న ఆకర్షణ కాస్తా శృంగారానికి దారితీస్తుంది. అయితే జువాన్ కి బయట తన ఇమేజ్ పోతుందేమో అన్న భయం ఎక్కువ. అందుకే గాబ్రియేల్ ని ప్రేమిస్తున్నా సరే, బయట మాత్రం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతుంటాడు. ఈ దాగుడు మూతల వ్యవహారం గాబ్రియేల్ కి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. చివరికి ఈ అబ్బాయిల ప్రేమ కథ ఎలాంటి మలుపు తీసుకుంటుందనే విషయాన్ని, ఈ రొమాంటిక్ మూవీని చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also :  భార్యను దెయ్యానికి తాకట్టు… రాత్రయితే రగడ… వణికిస్తున్న ఒక్కో సీన్

Tags

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×