E-Paper
Advertisement

Tv Serials : కన్నడ హీరోయిన్స్ ను పెళ్లి చేసుకున్న తెలుగు హీరోలు ఎవరో తెలుసా..?

Tv Serials : కన్నడ హీరోయిన్స్ ను పెళ్లి చేసుకున్న తెలుగు హీరోలు ఎవరో తెలుసా..?
Advertisement

Tv Serials : సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాదు.. అటు బుల్లితెరపై కూడా కన్నడ హీరోయిన్ల హవా కొనసాగుతుంది. ఈమధ్య తెలుగులో ప్రసారమవుతున్న ప్రతి కొత్త సీరియల్ లోను కన్నడ స్టార్ హీరోయిన్లు కనిపిస్తున్నారు. తెలుగు సీరియల్స్లలో కన్నడ యాక్టర్స్ మెయిన్ లీడర్ గా నటించడం విశేషం. ఈ తంతు గత కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉంది. కన్నడ ఇండస్ట్రీలో సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎంతో మంది సీరియల్ యాక్టర్స్ తెలుగులో వరుసగా సీరియస్ లో నటించే అవకాశాన్ని అందుకొని ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే కేవలం సీరియస్లలో నటించడం మాత్రమే కాదు.. తెలుగులో హీరోలుగా నటించిన సీరియల్ యాక్టర్స్ ని పెళ్లి చేసుకున్నారు. ఇప్పటివరకు ఎంతమంది తెలుగు హీరోలను పెళ్లి చేసుకున్నారు అన్నది ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

తెలుగు హీరోలను పెళ్లి చేసుకున్న కన్నడ హీరోయిన్లు..

మంజుల పరిటాల.. 

మంజుల పరిటాల ఈమె కన్నడ ముద్దుగుమ్మ. అక్కడ వరుసగా సీరియల్స్ చేసి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో చంద్రముఖి సీరియల్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సీరియలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో హీరోగా తెలుగు యాక్టర్ నిరూపం పరిటాల నటించాడు.. ఆ సీరియల్ టైమ్ లోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇరు కుటుంబాలని ఒప్పించి వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.. వీరిద్దరి దాంపత్యానికి గుర్తుగా ఒక బాబు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు తెలుగులో పలు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు..

కీర్తి ధనుష్.. 

Advertisement

మంజుల పరిటాల సొంత చెల్లెలు కీర్తి. తన అక్క ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఈమె కూడా పలు సీరియల్స్లలో నటించింది. హీరోయిన్ గా కన్నా విలన్ గా నటించి మెప్పించింది. ఈమె తెలుగు నటుడు అయినా ధనుష్ ను పెళ్లి చేసుకుంది. నిజానికి ఈమెది కూడా ప్రేమ వివాహమే. వీరిద్దరికీ ఒక బాబు ఉన్నాడు. ప్రస్తుతం కీర్తి సీరియల్స్ కి దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటూ తన ఫ్యామిలీ విషయాలను షేర్ చేసుకుంటూ వస్తుంది. ధనుష్ మాత్రం సీరియల్స్చేస్తూ బిజీగా ఉన్నాడు.

శోభా శెట్టి.. 

తెలుగులో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న సీరియల్ కార్తీకదీపం. ఇందులో హీరో పాత్రలో నటించాడు నిరూపం పరిటాల. కేరళ కుట్టి ప్రేమి విశ్వనాథ్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సీరియల్ లో విలన్ పాత్రలో నటించింది కన్నడ కుట్టి శోభా శెట్టి. ఈమె తెలుగులో కొన్ని సీరియల్స్ లో నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు నటుడు యశ్వంత్ ని ప్రేమించి ఇటీవలే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం తమిళంలో వరుసగా సీరియస్ చేస్తూ బిజీగా ఉంది..

Advertisement

వీళ్ళే కాదు.. నవ్య సామి కూడా తెలుగు యాక్టర్ రవికృష్ణతో ప్రేమాయణం నడిపిస్తుంది అన్న విషయం తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తనూజ పుట్టస్వామి కూడా సీరియల్ హీరో పవన్ సాయి తో ప్రేమాయణం నడిపిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.. దీనిగురించి ఇప్పటివరకు ఒక క్లారిటీ అయితే రాలేదు..

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Big Stories

Advertisement
×