E-Paper
Advertisement

ఓటీటీలోకి సైకలాజికల్ థ్రిల్లర్.. వరలక్ష్మి ‘సరస్వతి’ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి సైకలాజికల్ థ్రిల్లర్.. వరలక్ష్మి ‘సరస్వతి’ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Advertisement

Saraswathi OTT: హీరోయిన్లు అనగానే గ్లామర్ వలకబోయడానికి లేదా హీరో గౌరవాన్ని పెంచడానికి మాత్రమే కాదు తమలోని ప్రతిభను నిరూపిస్తూ సత్తా చాటుతున్నారు. కొంతమంది యాక్షన్ పెర్ఫార్మెన్స్ తో అదరగొడుతుంటే.. మరి కొంత మంది లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో రెచ్చిపోతున్నారు. ఇంకొంతమంది దర్శకులుగా, నిర్మాతలుగా యూ టర్న్ తీసుకుంటూ తమ టాలెంట్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు హీరోయిన్గా తన కెరీర్ ను మొదలుపెట్టి, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించి .. మళ్లీ తెలుగు చిత్రాల ద్వారా విలన్ గా యూటర్న్ తీసుకొని ఇప్పుడు స్టార్ సెలబ్రిటీగా, పాన్ ఇండియా స్టార్ గా తెలుగు హీరోలకు లక్కీ లేడీగా మారిపోయిన వరలక్ష్మి శరత్ కుమార్ (Varalakshmi Sarathkumar) దర్శకురాలిగా మారిన విషయం తెలిసిందే.

తొలిసారి సైకలాజికల్ థ్రిల్లర్ గా తన స్వీయ దర్శకత్వంలో ఎస్.సరస్వతి అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో పర్వాలేదనిపించుకున్న ఈ సినిమా గత నెలలో విడుదలై ఇప్పుడు సైలెంట్ గా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కి రావడంతో అభిమానులు సైతం షాక్ కి గురవుతున్నారు. చెప్పాపెట్టకుండా ఓటీటీలోకి రావడం ఏంటి? అని ఒక వైపు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే.. మరొకవైపు ఫ్యామిలీతో కలిసి చూసే అవకాశం లభించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. వరలక్ష్మి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్ర పోషిస్తుండగా.. జీవా, ప్రియమణి , మురళీ శర్మ, ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

సరస్వతి మూవీ స్టోరీ..

Advertisement

ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే లక్ష్మీ (వరలక్ష్మి శరత్ కుమార్) సింగిల్ మదర్. కుటుంబాన్ని పోషించడానికి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది. కూతురు సరస్వతి (నివేక్ష) తప్ప ఆమెకు మరో లోకం ఉండదు. అయితే ఆగస్టు 15 తన కూతురు పుట్టిన రోజు కావడంతో చాక్లెట్ బాక్స్ ఇచ్చి స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తుంది. సాయంత్రం తిరిగి వచ్చేసరికి స్కూల్లో తన కూతురు కనిపించదు. సిబ్బందిని అడిగితే సరస్వతి అనే పేరుతో ఆమె చెప్పిన క్లాస్ లో ఏ అమ్మాయి లేరని చెబుతారు. దీంతో లక్ష్మీ సరస్వతి కనిపించడం లేదని కంప్లైంట్ ఇస్తుంది. కానీ పోలీసులు ఫిర్యాదు తీసుకోరు. అదే రోజు రాత్రి స్కూల్ నుంచి లక్ష్మికి ఒక ఫోన్ వస్తుంది.

తాను స్కూల్ ప్రిన్సిపల్ రూమ్ లోనే ఉన్నానని , తనతో పాటు ఇంకో ఇద్దరు అంకుల్స్ కూడా ఉన్నారని, వాళ్ళని చూస్తే భయమేస్తోందని సరస్వతి చెబుతుంది. వెంటనే లక్ష్మి అక్కడికి వెళ్లి చూడగా.. అప్పటికే కూతురు అత్యాచారానికి గురై చనిపోయి ఉంటుంది . అదే రాత్రి కూతురు శవాన్ని స్మశానంలో పాతిపెట్టి ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది లక్ష్మి. అయితే లక్ష్మీ ఇచ్చిన కేసు ఫైల్ చేయాలి అంటే సాక్ష్యం కావాలని అడుగుతాడు సిఐ కృష్ణారెడ్డి (మురళీ శర్మ). శవం కోసం లక్ష్మీ చెప్పిన ప్రదేశంలో తవ్వి చూస్తే అక్కడ పాప శవం లభించదు. ఏ సాక్షాలు లేవని పోలీసులు ఆ కేసు నమోదు చేయరు.

Advertisement

దీంతో కోర్టును ఆశ్రయిస్తుంది లక్ష్మి. న్యాయవాది రామానుజం (ప్రకాష్ రాజ్) ఆమెకు తోడుగా నిలుస్తారు. ఎలాంటి సాక్షాలు లేని ఈ కేసులో రామానుజం విజయం సాధించాడా ? అసలు లక్ష్మీ ఎవరు ? ఆమెకు జరిగిన అన్యాయం ఏమిటి ? అటు లక్ష్మీ కూతురు సరస్వతి పై అత్యాచారానికి పాల్పడింది ఎవరు? కేసు విచారణ క్రమంలో రామానుజానికి తెలిసిన అసలు నిజాలు ఏంటి? ఇందులో వెన్నెల కిషోర్, ప్రియమణి పాత్రలు ఏమిటి? అనే విషయం తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. ఒక ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ సినిమా ఇక్కడ ఎలాంటి వ్యూస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

ALSO READ:పబ్ లో మళ్లీ అడ్డంగా దొరికిపోయిన సినీనటి హేమ.. ఈసారి డ్రగ్స్ టెస్టులో ఏమొచ్చిందంటే?

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×