E-Paper
Advertisement

అమరావతిపై వైసీపీ ద్వంద్వ వైఖరి.. ధర్మాన వ్యాఖ్యలతో బయటపడ్డ అసలు రంగు!

అమరావతిపై వైసీపీ ద్వంద్వ వైఖరి.. ధర్మాన వ్యాఖ్యలతో బయటపడ్డ అసలు రంగు!
Advertisement

Dharmana: దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు.. ఇక తన రాజకీయ భవిష్యత్తుకు వైసీపీ ఒక్కటే దిక్కనుకుంటున్నారా? రాజధాని అమరావతిపై వైసీపీ చేస్తుంది దుష్ప్రచారం అని తెలిసినా.. ధర్మాన ఇంకా అమరావతిపై వ్యతిరేకంగానే ఎందుకు మాట్లాడుతున్నారు? తన వ్యాఖ్యలతో అందరికీ టార్గెట్ అవుతున్నా అంత సీనియర్ నేత ఇంకా ఆ ప్రచారమే ఎందుకు చేస్తున్నారు? అది వ్యూహమా? వ్యూహాత్మక తప్పిదమా? లేక ఇంకే దిక్కూలేక జగన్ స్క్రిప్టే ఫాలో అవుతున్నారా?

నవ్యాంధ్రలో రాజధాని వివాదం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నవ్యాంధ్ర రాజకీయాలు ఎక్కువగా రాజధాని అంశం చుట్టే తిరుగుతున్నాయి. 2024లో వైసీపీ ఓటమికి ప్రధాన కారణాల్లో క్యాపిటల్ ఇష్యూ కూడా ఒకటి అని పొలిటికల్ పండిట్స్ విశ్లేషణ. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. కానీ, సీఎం చంద్రబాబు మాత్రం ప్రపంచపటంలో నిలిచిపోయేలా అమరావతి రాజధానిని నిర్మించాలని అంటున్నారు. వైసీపీ, టీడీపీ మధ్య ఈ గ్యాప్ రాజకీయ విమర్శలకు, సవాళ్లకు కేంద్రబిందువుగా మారుతోంది.

ధర్మాన ప్రసాద్‌రావు కీలక వ్యాఖ్యలు

Advertisement

ఆ క్రమంలో ‘మన మూలపేటకు పోదాం పదా’ అంటూ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి,వైసీపీలో కొనసాగుతున్న ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళంలో నిర్వహించిన సభలో రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతికి చట్టబద్దత కల్పిస్తామంటున్న కూటమి ప్రభుత్వంపై ధర్మాన విరుచుకుపడ్డారు. ఏపీకి ఇప్పటికే నాలుగు రాజధానులు మారాయాని.. మరోసారి మారదని గ్యారెంటీ ఏంటీ అని ప్రశ్నించారు.

రేపు అమరావతి వాళ్లు తరిమిస్తే…?

65 ఏళ్ల పాటు హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తే.. అక్కడ నుంచి తరిమేస్తే.. ఇక్కడకు వచ్చిపడ్డామని.. రేపు అమరావతి వాళ్లు కూడా మమ్నల్ని తరిమేస్తే మేం ఎక్కడకు వెళ్లాలన్నారు. శాశ్వత రాజధాని అనే విధానం రాజ్యాంగంలో లేదని.. ఇప్పుడు శాశ్వత రాజధాని అని తీర్మానం చేస్తే.. రేపు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదా..? అని ధర్మాన ప్రశ్నిస్తున్నారు. తెలిసి మాట్లాడారో? లేకపోతే పార్టీ అధ్యక్షుడ్ని ప్రసన్నం చేసుకోవడానికి ఎరేంజ్డ్ స్క్రిప్ట్ అప్పజెపారో కాని.. ధర్మాన సోషల్ మీడియాలో అందరికీ చక్కగా దొరికిపోయారు. అది చాలదన్నట్లు ఆ సభలో ఆయన సభికులకు అరేంజ్ చేసిన భోజనాల గురించి మాట్లాడిన తీరు .. ప్రత్యర్ధులకు లేనిపోని అస్త్రం అందించినట్లైంది.

వ్యతిరేకం కాదు కానీ అవినీతిపై విమర్శలు

Advertisement

అంటే అమరావతి రాజధానిగా ఉండటాన్ని ధర్మాన వ్యతిరేకిస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే.. ఇదేం కొత్తకాదు.. మాజీ సీఎం జగన్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చినప్పటి నుంచి ధర్మాన సహా వైసీపీ శ్రేణులు అమరావతిని వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. కానీ, 2024లో ఘోర ఓటమి తర్వాత వైసీపీ నేతల్లో కొంత మార్పు కనిపించింది. సజ్జల, పేర్ని నాని, లాంటి వారు తాము అమరావతికి వ్యతిరేకం కాదని అడపా దడపా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. కాకపోతే అక్కడ ఏదో అవినీతి జరిగిపోతుందని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ధర్మాన vs ఇతర నేతలు

ఏదేమైనా కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ వైసీపీ శ్రేణుల్లో నెమ్మదిగా అమరావతి మాత్రమే రాజధానని మెంటల్‌గా ఫిక్స్ అవుతున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ, ఈ మార్పు ధర్మాన లో కనిపించడం లేదు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మొదటి నుంచి ధర్మాన అమరావతిని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. మూలపేట మీటింగ్ లో మరోసారి అదే స్వరం వినిపించారాయన. ఇక్కడ ఎవరి పర్సనల్ ఓపినియన్ వాళ్లది అనుకోవచ్చు. అయితే సజ్జల వంటి వారు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలకు, ధర్మాన పూర్తి విరుద్దమైన స్టేటస్మెంట్స్ ఇస్తుండటంతో వైసీపీ క్యాడర్ కన్ఫూజ్ అవుతున్నారంటున్నారు.

ఉత్తరాంధ్రలో ధర్మాన రూల్ కొనసాగుతోంది

మనం మూడు రాజధానులకు అనుకూలమా? అమరావతి ఏకైక రాజధానికి అనుకూలమా? అనే అంశంపై ఆ పార్టీ శ్రేణులకు క్లారిటీ రావడం లేదంట. కూటమి పరిపాలన, పాలసీలపై కోస్తా, రాయలసీమ వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారే తప్పా.. రాజధాని అంశాన్ని వదిలేశారు. కానీ, ఉత్తరాంధ్ర వైసీపీలో పూర్తిగా ఆ మార్పు కనిపించడం లేదు. అవకాశం దొరికిన ప్రతిసారీ రాజధాని అంశాన్నే ప్రధాన అస్త్రంగా ప్రయోగిస్తున్నారు. మరో మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు వంటి వారు కూడా ధర్మాన పాటే పాడుతున్నారు.

జగన్ ఐదేళ్ల పాలనపై ప్రశ్నలు

ఏపీ రాజధానిగా విశాఖను చేస్తామని అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత అక్కడ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదన్న విమర్శ ఉంది. జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లలో విశాఖలో చెప్పుకోదగ్గ నిర్మాణం ఏదైనా జరిగిందా? అంటే రుషికొండపై కట్టిన ప్యాలెస్ తప్ప ఏదీ కనిపించదు. పైగా వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున భూ దోపిడి జరిగిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి విమర్శలు ఉండగా ధర్మాన లాంటివాళ్లు అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడటం ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ధర్మాన స్ట్రాటజీపై అంచనాలు

ప్రభుత్వాన్ని పాలసీలపై, అభివృద్ధిపై ప్రశ్నించకుండా ఇంకా రాజధాని అంశాన్ని పట్టుకుని వేలాడటం.. రాజకీయంగా ఉత్తరాంధ్ర వైసీపీకి మైనస్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. అయితే.. నలబై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ధర్మాన లాంటి వారు ఏ వ్యూహం లేకుండానే ఇలా చేస్తారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి చూడాలి ధర్మాన స్ట్రాటజీ ఏంటో?

Also Read: ఓట్లు రాలేదు కానీ కోట్లు ఖర్చయ్యాయి.. తెలంగాణ బీజేపీ నేతలకు ‘ఢిల్లీ’ చెమటలు!

Story by: Apparao, Big Tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×