E-Paper
Advertisement

Ugadi festival: ఉగాది పండుగ గురించి చాలా మందికి తెలియని ఆసక్తికరమైన విషయాలేంటో తెలుసా

Ugadi festival: ఉగాది పండుగ గురించి చాలా మందికి తెలియని ఆసక్తికరమైన విషయాలేంటో తెలుసా
Advertisement

Ugadi festival: ఉగాది పండుగ గురించి చాలా మందికి చాలా విషయాలు తెలియకపోవచ్చు.. అయితే ఆ తెలియని విషయాలేంటో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

సృష్టి ప్రారంభమైన రోజు:  పురాణాల ప్రకారం ఉగాది రోజునే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించారని చెప్తారు. అందుకే ఉగాదిని సృష్టి ప్రారంభ దినంగా భావిస్తారు. యుగాది కాలక్రమేనా ఉగాదిగా మారిపోయింది.

Advertisement

తెలుగులో ప్రతి ఉగాదికో కొత్త పేరు: తెలుగు ప్రజలు జరుపుకునే ఉగాదికి 60 పేర్లు ఉన్నారు. ప్రతి సంవత్సరం ఉగాదికో పేరు మారుతూ 60 సంవత్సరాల తర్వాత మళ్లీ పేర్లు రిపీట్‌ అవుతుంటాయి. అవే ప్రభవ, విభవ.. అంటూ ఇలా ఉంటాయి. ఈ సంవత్సరం 2026లో పరాభవ నామ సంవత్సరంగా ఉగాదిని జరుపుకోబోతున్నాం.

ఉగాది రోజున పంచాంగ శ్రవణం: ఉగాది రోజున పండితులు పంచాంగ శ్రవణం చేస్తారు. ఇందులో గ్రహాల స్థితి ఆధారంగా వచ్చే సంవత్సరానికి సంబంధించిన వర్షాలు, వ్యవసాయం, ఆర్థిక పరిస్థితి వంటి విషయాలు చెబుతారు. మనుషుల గ్రహస్థితిని రాశుల ఆధారంగా అంచనా వేస్తుంటారు.

Advertisement

ఉగాది పచ్చడిలోని 6 రుచుల ప్రత్యేకత: ఉగాది రోజున ప్రత్యేకంగా చేసే ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయి. ఇవి జీవితంలోని ఆరు భావాలను సూచిస్తాయి. అవి  ఆనందం, దుఃఖం, కోపం, ఆశ్చర్యం, భయం, అసహ్యం.

ఉగాది రోజున నూనె స్నానం చేయాలి: ఉగాది రోజున తలస్నానం (నూనె రుద్ది స్నానం లేదా అభ్యంగన స్నానం) చేయడం శుభమని నమ్మకం. ఇది శరీరానికి ఆరోగ్యం మరియు కొత్త ప్రారంభాన్ని ఇస్తుందని పండితులు చెప్తుంటారు.

గుమ్మానికి కట్టే మామిడి ఆకుల తోరణం: ఉగాది రోజున ఇళ్లకు మామిడి ఆకుల తోరణం కడతారు. ఇది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ రావడానికి సాయపడుతుంది. అలాగే నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తుందని పండితులు చెప్తుంటారు.

ఉగాది రోజు కొత్త పనులు ప్రారంభిస్తారు: చాలా మంది ఉగాది రోజు ఏదో ఒక చిన్న పెద్దదైన కొత్త పనులు ప్రారంభిస్తారు. కొత్త వ్యాపారం కావొచ్చు.. కొత్త పుస్తకాలు కావొచ్చుక.. ఏదైనా సరే ఉగాది రోజు ప్రారంభించడం అలవాటుగా ఉంటుంది.

పంచాంగం విడుదల చేసే రోజు: ఉగాది రోజున కొత్త పంచాంగం విడుదల చేస్తారు. ఈ పంచాంగం ఆధారంగానే సంవత్సరం మొత్తం పండుగలు, ముహూర్తాలు, గ్రహణాలను పండితులు నిర్ణయిస్తారు.

ఉగాది కవితలు మరియు సాహిత్యం: తెలుగు సాహిత్యంలో ఉగాదికి ప్రత్యేక స్థానం ఉంది. చాలా మంది కవులు తాము రాసిన కవితలు  ఉగాది పండుగ  సందర్భంగా విడుదల చేస్తుంటారు.

ఉగాది రోజున శుభ సంకల్పం చేయడం: కొత్త సంవత్సరానికి లక్ష్యాలు, సంకల్పాలు పెట్టుకోవడం సంప్రదాయం. పాత కాలంలో  రాజులు ఉగాది  రోజునే కొత్త కార్యక్రమాలు ప్రారంభించేవారట. కొత్త పాలన నిర్ణయాలు కూడా ప్రకటించేవారట. ఇక ఉగాది రోజు ఉదయం నిద్ర లేవగానే.. పండ్లు, పూలు, బంగారం లాంటివి చూడటం కొన్ని ప్రాంతాలలో ఆచారంగా వస్తుందట. అవి చూడటం వల్ల ఆ సంవత్సరం అంతా శుభం జరుగుతుందని నమ్ముతారట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: మీకు మంచి రోజులు వచ్చే ముందు ప్రకృతి మీకు కొన్ని సంకేతాలు పంపిస్తుందట

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×