E-Paper
Advertisement

జననాయగన్ ఓటీటీ డీల్ క్యాన్సిల్ చేసుకున్న అమెజాన్..మరో సమస్థ చేతికి ఓటీటీ రైట్స్!

జననాయగన్ ఓటీటీ డీల్ క్యాన్సిల్ చేసుకున్న అమెజాన్..మరో సమస్థ చేతికి ఓటీటీ రైట్స్!

Jananayagan OTT: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ఆఖరి చిత్రం జననాయగన్ (Jananayagan). ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 9వ తేదీప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా ఈ సినిమా సెన్సార్ కారణాల వల్ల వాయిదా పడింది. ఇలా సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ రాని నేపథ్యంలో ఈ సినిమా విడుదల విషయంలో ఎన్నో రాజకీయాలు చుట్టుముట్టడంతో ఇది కాస్త ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. విజయ్ ఆఖరి సినిమాగా పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదల ఆలస్యం కావడంతో ఈ సినిమా ఓటీటీ డీల్ కూడా క్యాన్సిల్ అయింది.

ఒప్పందం రద్దు చేసుకున్న అమెజాన్..

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్(Amazon Prime Videos) సుమారు 120 కోట్లకు కైవసం చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి అయితే ఈ సినిమా ఇప్పటికీ విడుదల కాని నేపథ్యంలో అమెజాన్ కుదుర్చుకున్న ఒప్పందం రద్దు చేసుకుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరొక వార్త వైరల్ అవుతుంది. అమెజాన్ ఒప్పందం రద్దు చేసుకోవడంతో మరొక ఓటీటీ సంస్థ అయిన జీ 5 (Zee 5)ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకోవడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

రూ.50 కోట్లకు జీ 5 ఆఫర్..

అమెజాన్ ప్రైమ్ వీడియో 120 కోట్ల రూపాయల ఓటీటీ డీల్ కుదుర్చుకోగా ఈ సినిమా చుట్టూ ఎన్నో వివాదాలు చెలరేగడంతో జీ 5 , 50 కోట్ల రూపాయల డీల్ ఆఫర్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చుట్టూ పెద్ద ఎత్తున వివాదం నెలకొన్నప్పటికీ జీ 5 ఏకంగా 50 కోట్ల రూపాయలు ఆఫర్ ఇవ్వడం అనేది చాలా మంచి డీల్ అంటూ సినీ ప్రముఖులు భావిస్తున్నారు. మరి ఈ సినిమా ఓటీటీ డీల్ విషయం గురించి వస్తున్న వార్తలలో ఎంత వరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.

ఇప్పటికైనా మోక్షం లభించేనా…

ఇక జననాయగన్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో విజయ్ జోడిగా పూజ హెగ్డే(Pooja Hedge) నటించగా, మమత బైజు విజయ్ కూతురి పాత్రలో నటించారని తెలుస్తోంది. ఈ సినిమా విడుదలకు ముందు సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి . ఈ సినిమా చివరి నిమిషంలో వాయిదా పడటం అనేది అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. తమిళనాడులో ఎన్నికలు పూర్తి కావడంతో ఇప్పటికైనా ఈ సినిమా విడుదలకు మోక్షం లభిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. విడుదల కాకుండా ఇప్పటికే పెద్ద ఎత్తున కొన్ని సన్నివేశాలు లీక్ అయిన సంగతి తెలిసిందే.

Also Read: రామ్ చరణ్ అన్నయ్యలా సపోర్ట్ చేస్తారు… లావణ్య కామెంట్లపై ఫ్యాన్స్ షాకింగ్ రియాక్షన్!

Related News

ఒక్క క్షణం కూడా విసుగు రాకుండా పరుగులు తీసే సౌత్ మూవీస్… చివరి క్షణం వరకూ వీడని సస్పెన్స్

యూఫోరియా సీజన్ 3 క్లైమాక్స్ ఎక్స్ప్లెనేషన్… చివరికి జరిగింది ఇదే

IMDbలో 8.2 రేటింగ్‌… మైండ్‌బ్లోయింగ్ క్రైమ్ థ్రిల్లర్‌ భయ్యా

జీవితాన్ని మార్చేసే ఒకే ఒక్క ఫోన్ కాల్… ఇంటెన్స్ సస్పెన్స్‌ థ్రిల్లర్

IMDbలో 8.5 రేటింగ్… ఈ 8 ఎపిసోడ్‌ల సిరీస్ క్లైమాక్స్ చూస్తే బుర్ర తిరిగిపోద్ది భయ్యా

ఓటీటీలోకి మోస్ట్ అవైటింగ్ సిరీస్ ‘గ్రామ చికిత్సాలయ్ సీజన్ 2’

ఓటీటీలోనే టాప్ 10 మూవీస్ లో ఒకటి ఈ మిలటరీ థ్రిల్లర్… సీక్వెల్ అనౌన్స్మెంట్

ఒకరోజు ముందుగానే ఓటీటీలోకి హిందీ డార్క్ కామెడీ థ్రిల్లర్

Big Stories

×