BigTV English

OTT Movie : ఊరికి దూరంగా విల్లా… యవ్వనాన్ని కాపాడుకోవడానికి మంత్రగత్తె అరాచకం… గుండె ధైర్యం ఉంటేనే చూడండి

OTT Movie : ఊరికి దూరంగా విల్లా… యవ్వనాన్ని కాపాడుకోవడానికి మంత్రగత్తె అరాచకం… గుండె ధైర్యం ఉంటేనే చూడండి

OTT Movie : ఓటీటీలో రకరకాల జానర్ లతో సినిమాలు స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. అయితే థ్రిల్లర్ జానర్లకు ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటోంది. ఈ సినిమాలను చూడటానికి ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సూపర్‌ నాచురల్ హారర్ థ్రిల్లర్ సినిమా డిఫరెంట్ స్టోరీతో ఆకట్టుకుంటోంది. ఈ కథ DNA టెస్ట్ ద్వారా తన ఫ్యామిలీని కనిపెట్టిన యువకుడి చుట్టూ తిరుగుతుంది. అదే ఫ్యామిలితో అతడు ఎదుర్కునే భయంకరమైన సంఘటనలు, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో వణుకు పుట్టిస్తాయి. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


ఏ ఓటీటీలో ఉందంటే

‘Amelia’s Children’ గాబ్రియేల్ అబ్రాంటెస్ దర్శకత్వం వహించిన పోర్చుగీస్ సూపర్‌ నాచురల్ హారర్ థ్రిల్లర్. ఇందులో కార్లోటో కొట్టా (ఎడ్వర్డ్), బ్రిజెట్ లండీ-పైన్ (రైలీ) అనబెలా మోరీరా (అమేలియాగా) ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ చిత్రం 2023 సెప్టెంబర్‌లో ఇంటర్నేషనల్ హారర్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. ఆ తరువాత పోర్చుగల్‌లో 2024 జనవరి 18న థియేట్రికల్‌గా విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ+, హులు, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

ఈ కథ ఎడ్వర్డ్ అనే అమెరికన్ సంగీతకారుడు చుట్టూ తిరుగుతుంది. అతను ఒక DNA టెస్ట్ ద్వారా తన తల్లి అమేలియా, సోదరుడు మాన్యుయెల్ ఉన్నారని తెలుసుకుంటాడు. తన స్నేహితురాలు రైలీతో కలిసి, ఎడ్వర్డ్ పోర్చుగల్‌లోని ఒక విలాసవంతమైన విల్లాకు వెళ్తాడు. అక్కడ అతని తల్లి, సోదరుడు నివసిస్తుంటారు. వాళ్ళను కలుసుకున్న ఎడ్వర్డ్ సతోషంలో మునిగిపోతాడు. ఈ కలయిక మొదట్లో బాగానే అనిపిస్తుంది. కానీ రైలీకి త్వరలోనే ఈ కుటుంబం ఏదో విచిత్రంగా ఉందని అనుమానం కలుగుతుంది. అమేలియా విచిత్రమైన ప్రవర్తన, ఆమె ప్లాస్టిక్ సర్జరీ ముఖం, మాన్యుయెల్ అసాధారణ ప్రవర్తన రైలీలో భయాన్ని పుట్టిస్తాయి. కథలో ఒక సూపర్‌ నాచురల్ ట్విస్ట్‌ వస్తుంది. అక్కడ అమేలియా తన యవ్వనాన్ని కాపాడుకోవడానికి ఒక భయంకరమైన రహస్యాన్ని దాచిపెడుతుంది.


ఇది ఆమె కుమారులతో సంబంధం కలిగి ఉంటుంది. అమేలియా తన కుమారులతో అసహ్యకరమైన సంబంధాల ద్వారా యవ్వనాన్ని కొనసాగించే ఒక విచిత్రమైన ఆచారంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇది తెలుసుకున్న ఎడ్వర్డ్, రైలీ భయంతో వణికిపోతారు. రైలీ, తన ప్రియుడిని ఈ భయంకరమైన కుటుంబం నుండి రక్షించడానికి పోరాడుతుంది. కానీ విల్లాలో జరిగే అతీంద్రియ సంఘటనలు, ఆమెను ఒక భయంకరమైన ఉచ్చులో చిక్కుకునేలా చేస్తాయి. చివరికి ఎడ్వర్డ్, రైలీ ఆ ఇంట్లో నుంచి బయట పడతారా ? అమేలియా యవ్వనం కోసం ఎలాంటి చర్యలకు పాలపడుతుంది ? అక్కడ జరిగే సీక్రెట్స్ ఏమిటి ? అనే విషయాలను ఈసినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : జోకర్ కార్డుతో జీవితం తారుమారు… భార్యాభర్తల అరాచకం మామూలుగా ఉండదు భయ్యా… తెలుగులోనే స్ట్రీమింగ్

Related News

OTT Movie : అమ్మాయంటే పడి చచ్చే సోఫా… అబ్బాయిలు చెయ్యేస్తే చావే… ఇదెక్కడి దిక్కుమాలిన చేతబడి భయ్యా ?

OTT Movie : అమ్మాయిని వదలకుండా… సొంత తండ్రి నుంచి అద్దెకిచ్చిన ఓనర్ దాకా… క్లైమాక్స్ కి పిచ్చోళ్ళయిపోతారు మావా

OTT Movie : భార్య ఉండగా పెళ్ళైన మాజీ గర్ల్ ఫ్రెండ్ తో సీక్రెట్ గా… పక్క అపార్ట్మెంట్లోకి మారి ఆమె చేసే పనికి దిమాక్ ఖరాబ్

OTT Movie : నవ్వుతూ చంపే మిస్టీరియస్ వ్యక్తి… డబ్బు కోసం వెళ్లి అడ్డంగా బుక్కయ్యే అమాయకుడు… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్

OTT Movie : HIV ఎక్కించి అమ్మాయిల్ని చంపే సైకో… ఇదెక్కడి దిక్కుమాలిన ఆలోచన సామీ ?

OTT Movie : ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో భార్య… మెంటల్ మాస్ షాక్ ఇచ్చే భర్త… వీడు మగాడ్రా బుజ్జి

OTT Movie : హాంటెడ్ ప్లేస్ లో అమ్మాయి మిస్సింగ్… భయపెడుతూనే కితకితలు పెట్టే మలయాళ హర్రర్ మూవీ

Big Stories

×