Hyderabad: హైదరబాద్‌లో పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్ఆర్ నగర్ చౌరస్తాలోని ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద ఓ ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను కిందకి దించాడు. ఆ వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటన స్థలికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎవ్వరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.