BigTV English
Advertisement

OTT Movie : జోకర్ కార్డుతో జీవితం తారుమారు… భార్యాభర్తల అరాచకం మామూలుగా ఉండదు భయ్యా… తెలుగులోనే స్ట్రీమింగ్

OTT Movie : జోకర్ కార్డుతో జీవితం తారుమారు… భార్యాభర్తల అరాచకం మామూలుగా ఉండదు భయ్యా… తెలుగులోనే స్ట్రీమింగ్

OTT Movie : జనం మెచ్చిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సిరీస్ ‘అలిస్ ఇన్ బోర్డర్‌ల్యాండ్’  ఇది వరకే వచ్చిన రెండు సీజన్ లు ఓటీటీని షేక్ చేశాయి. ఇది అన్నిరకాల ఎలిమెంట్స్ తో సూపర్ హిట్ గా నిలిచింది. మూడు సంవత్సరాల గ్యాప్ తరువాత మూడవ సీజన్, సరికొత్త కంటెంట్ తో ఆడియన్స్ ని మరోసారి అలరిస్తోంది. ఈ రోజు నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలు తెలుసుకుందాం పదండి.


నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘అలిస్ ఇన్ బోర్డర్‌ల్యాండ్ సీజన్ 3’ అనేది షిన్సుకే సాటో డైరెక్ట్ చేసిన జపనీస్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సిరీస్. ఈ సీజన్ 2025 సెప్టెంబర్ 25 (ఈ రోజు) నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. 6 ఎపిసోడ్‌లతో (సీజన్ 1, 2లో 8 ఎపిసోడ్‌లతో పోలిస్తే). ఈ సిరీస్ IMDbలో 7.7/10 రేటింగ్ పొందింది. సీజన్ 1కి IMDbలో 7.7/10, రాటెన్ టొమాటోస్‌లో 80%, సీజన్ 2కి 7.2/10, 89% రేటింగ్స్ వచ్చాయి. ఇది తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్, డబ్బింగ్ తో అందుబాటులోకి వచ్చింది.

స్టోరీలోకి వెళ్తే

‘Alice in Borderland సీజన్ 3 కథ అరిసు, ఉసాగి చుట్టూ తిరుగుతుంది. వీళ్ళు సీజన్ 2లో బోర్డర్‌ల్యాండ్ అనే ఒక ఊహాత్మక ప్రపంచంలో ఘోరమైన గేమ్‌లను జయించి వాస్తవ ప్రపంచానికి తిరిగి వచ్చారు. ఈ సీజన్‌లో అరిసు, ఉసాగి పెళ్ళి చేసుకుని, బోర్డర్‌ల్యాండ్ జ్ఞాపకాలను మరచిపోయి, సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంటారు. కానీ వీళ్ళకి అప్పుడప్పుడు ఆ ఘోరమైన ఇన్సిడెంట్స్ హాలూసినేషన్‌లలో కనిపిస్తుంటాయి. అయితే ఉసాగి, ర్యూజీ అనే ఒక గుర్తుతెలియని సైన్టిస్ట్ చేత కిడ్నాప్ కి గురవుతుంది. ఆమెను ఆ వ్యక్తి మళ్లీ ఆ బోర్డర్‌ల్యాండ్‌లోకి తీసుకెళ్తాడు. అరిసు, తన భార్యను రక్షించడానికి, బోర్డర్‌ల్యాండ్‌లోని ప్రమాదకరమైన ప్రపంచంలోకి తిరిగి ఎంటరవుతాడు. అక్కడ అతను ‘జోకర్’ అనే కొత్త గేమ్ స్టేజ్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది.


బోర్డర్‌ల్యాండ్‌లో, అరిసు, ఉసాగి వేర్వేరు టీంలలో ఉంటారు. ఈ సీజన్‌లోని గేమ్‌లు గత సీజన్‌ల కంటే ఎక్కువ ఉత్కంఠభరితంగా ఉంటాయి. ఈ గేమ్ లు ఆటగాళ్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటాయి. అరిసు, ఉసాగిని రక్షించడానికి కొత్త ఆటగాళ్లతో జట్టు కడతాడు.
ఇక క్లైమాక్స్ అరిసు, ఉసాగి జోకర్ స్టేజ్‌లోని గేమ్‌లను ఎదుర్కునే సన్నివేశాలు ఉత్కంఠభరితంగా సాగుతాయి. ఇక్కడ వీళ్ళు బోర్డర్‌ల్యాండ్‌లో చిక్కుకోకుండా, వాస్తవ ప్రపంచానికి తిరిగి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు. చివరికి ఈ జంట ఆ ప్రమాదకరమైన గేమ్స్ లో చిక్కుకుంటారా ? బోర్డర్‌ల్యాండ్‌ నుంచి బయట పడతారా ? మళ్ళీ వాస్తవ ప్రపంచంలో కి తిరిగి వస్తారా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : అమ్మాయిని కిడ్నాప్ చేసి 7 రోజులు అదే పాడు పని… వీళ్ళు మనుషులా మానవ మృగాలా ? ఈ మూవీ పెద్దలకు మాత్రమే

Related News

OTT Movie : పూలమ్మే పిల్ల జీవితంలోకి మాజీ ప్రియుడు… ఖతర్నాక్ క్లైమాక్స్ మావా

OTT Movie : కుర్రాడి నుంచి పండు ముసలిదాకా ఎవ్వర్నీ వదలని అమ్మాయి… ఇదెక్కడి తేడా యవ్వారంరా సామీ ?

OTT Movie : ప్రియుడిని వదిలేసి మరొకడితో… కళ్ళు తెరిచినా మూసినా అవే సీన్లు… క్లైమాక్స్ కెవ్వు కేక

OTT Movie : చేతబడులతో చచ్చి బతికే కుటుంబం… ‘విరూపాక్ష’ను మించిన బ్లాక్ మ్యాజిక్ మరాఠీ మూవీ తెలుగులో

OTT Movie : తాత వల్ల నలిగిపోయే కూతురు, మనవడు… గుండెను పిండేసే రాశి ఫ్యామిలీ ఎంటర్టైనర్

OTT Movie : హిందువుల ఊచకోతను కళ్ళకు కట్టినట్టు చూపించే మరో రియల్ స్టోరీ… ‘బెంగాల్ ఫైల్స్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

OTT Movie : యాక్షన్ లేదు, రొమాన్స్ లేదు… IMDbలో 7.4 రేటింగ్‌… హృదయాన్ని హత్తుకునే ఫ్యామిలీ డ్రామా

OTT Movie : మంత్రముగ్ధులను చేసే కథ… మెంటలెక్కించే క్లైమాక్స్.. ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌లో మిస్ అవ్వకుండా చూడాల్సిన థ్రిల్లర్లు

Big Stories

×