E-Paper
Advertisement

Takshakudu Teaser: చీకటి లోకంలో దేనికోసం నీ వెతుకులాట… ఆసక్తికరంగా తక్షకుడు టీజర్ రిలీజ్!

Takshakudu Teaser: చీకటి లోకంలో దేనికోసం నీ వెతుకులాట… ఆసక్తికరంగా తక్షకుడు టీజర్ రిలీజ్!
Advertisement

Takshakudu Teaser: ఆనంద్ దేవరకొండ దొరసాని సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు. ఎంతో విభిన్నమైన కథ చిత్రాలను ఎంపిక చేసుకుంటూ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన అద్భుతమైన విజయాలను అందుకుంటున్నారు. ఇక బేబీ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda) త్వరలోనే మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆనంద్ దేవరకొండ హీరోగా యాక్షన్ త్రిల్లర్ సినిమాగా తక్షకుడు(Takshakudu) ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. సితార ఎంటర్టైన్మెంట్,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్  నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. వినోద్ అనంటోజు దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో ఆనంద్ జోడిగా నితాన్షి గోయల్ నటిస్తున్నారు.

అంచనాలు పెంచిన టీజర్..

ఇక తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ టీజర్ వీడియోని షేర్ చేస్తూ “చీకటి లోకంలో దేనికోసం నీ వెతుకులాట?” పగ? ప్రేమ? క్షమ? దేనికోసం నీ వెతుకులాట అంటూ ఈ టీజర్ వీడియోని విడుదల చేశారు. ఇక ఈ టీజర్ చూస్తుంటే ఇదివరకు ఆనంద్ దేవరకొండను ఎప్పుడూ చూడని విధంగా విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఆనంద్ దేవరకొండ ఎవరికోసమో వెతుకుతూ ఉంటారని ఈ టీజర్ ద్వారా చూపించారు. ఇక ఈ టీజర్ వీడియోలో వాడు ఇక్కడే ఉన్నాడు.. నా కళ్ళ ముందే ఉన్నాడు కానీ కనిపెట్టలేకపోతున్నాను అని డైలాగులు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

నెట్ ఫ్లిక్స్ లో విడుదల..

Advertisement

ఇలా విభిన్నమైన కాన్సెప్ట్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని టీజర్ చూస్తేనే స్పష్టమవుతుంది. మరి ఈ సినిమా ద్వారా ఆనంద్ దేవరకొండ ఎలాంటి సక్సెస్ అందుకుంటారనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా నెట్ ఫ్లిక్స్(Net Flix) లో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ యాక్షన్ త్రిల్లర్ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందనే విషయాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.. ఇదివరకే వినోద్ ఆనంద్ దేవరకొండ కాంబినేషన్లో మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Advertisement

ఇలా వీరిద్దరి కాంబినేషన్లో విడుదలైన మిడిల్ క్లాస్ మెలోడీస్ మంచి ఆదరణను సొంతం చేసుకున్న నేపథ్యంలో మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న తక్షకుడు సినిమా పై కూడా అదే స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ద్వారా ఆనంద్ దేవరకొండ ఎలాంటి సక్సెస్ అందుకుంటారనేది తెలియాల్సి ఉంది. ఇక ఈయన చివరిగా 2024వ సంవత్సరంలో గం గం గణేశా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోయినా పర్వాలేదు అనిపించుకుంది.

Also Read: Biker Release:  శర్వానంద్ బైకర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. నిహారిక సినిమాకు పోటీగా?

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×