BigTV English

OTT: నేరుగా ఓటీటీలోకి రాబోతున్న కొత్త మూవీ.. అదిరిపోయే క్యాప్షన్!

OTT: నేరుగా ఓటీటీలోకి రాబోతున్న కొత్త మూవీ.. అదిరిపోయే క్యాప్షన్!

OTT:టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) మిడిల్ క్లాస్ మెలోడీస్, బేబీ వంటి సినిమాలతో ప్రేక్షకుల మనసుకు దగ్గరయ్యారు. అలా ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ తో ఈయన చేసే సినిమాలు ఎంతోమంది ప్రేక్షకులను అలరించాయి. అయితే అలాంటి ఆనంద్ దేవరకొండ బేబీ సినిమా తర్వాత మళ్లీ కొత్త సినిమాతో మన ముందుకు రాలేదు. పైగా ఇప్పటివరకు కొత్త సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేకపోయినప్పటికీ.. తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తాజా మూవీ తక్షకుడు త్వరలోనే ఓటీటీలోకి రాబోతుందట.. మరి ఇంత సడన్ గా ఓటీటీలోకి సినిమా తీసుకురావడం ఏంటి..? థియేటర్లను వదిలిపెట్టి ఆనంద్ దేవరకొండ ఇలా ఓటీటీ బాట ఎందుకు పట్టారు ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..


త్వరలో ఓటీటీలోకి నేరుగా రాబోతున్న ఆనంద్ దేవరకొండ మూవీ..

ఆనంద్ దేవరకొండ బేబీ లాంటి రొమాంటిక్ డ్రామా లవ్ స్టోరీ సినిమా తర్వాత చేసిన ‘తక్షకుడు’ మూవీతో మన ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా నేరుగా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్టు స్వయంగా నెట్ ఫ్లిక్స్ సంస్థ ట్వీట్ చేసింది. ఈ సినిమాకి సంబంధించి “అత్యాశ ప్రారంభమైతే ప్రతీకారం వెంటాడుతుంది” అనే ట్యాగ్ తో పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే బేబీ మూవీతో మంచి ఫామ్ లోకి వచ్చిన ఆనంద్ దేవరకొండ ఎందుకు ఇలా తన సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు..రిలీజ్ చేయడం కోసం థియేటర్లు దొరకడం లేదా అనే అనుమానం కూడా కొంతమందిలో కలుగుతుంది.ఇక మరికొంత మందేమో పెద్దపెద్ద హీరోలే తమ సినిమాలని ఓటీటీలో రిలీజ్ చేసుకోగా లేనిది ఆనంద్ దేవరకొండ తన సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తే తప్పేంటి అని కామెంట్స్ పెడుతున్నారు.

ALSO READ:Bigg Boss 9 Promo: బిగ్ బాస్ హౌస్‌కు నిప్పు పెట్టిన దివ్వెల.. రచ్చ చేసి.. ఏడ్చేసి.. వామ్మో మహానటి!


తక్షకుడు మూవీతో మెప్పిస్తారా?

అలా ఫైనల్ గా తక్షకుడు మూవీతో ఆనంద్ దేవరకొండ ప్రేక్షకులను అలరించడం కోసం రాబోతున్నారు. ఈ సినిమాకి మిడిల్ క్లాస్ మెలోడీస్ డైరెక్టర్ వినోద్ అనంతోజు దర్శకత్వం వహించారు . అయితే ఆనంద్ దేవరకొండ గతంలో కూడా హైవే అనే మూవీని ఓటీటీలో రిలీజ్ చేశారు. సైకో కిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది. అలా తాజాగా మరో మూవీని కూడా ఆనంద్ దేవరకొండ ఓటీటీ లో రిలీజ్ చేయబోతున్నారు.

ఆనంద్ దేవరకొండ సినిమాలు..

ఆనంద్ దేవరకొండ సినిమాల విషయానికొస్తే.. దొరసాని సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన.. ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్, పుష్పక విమానం, హైవే, బేబీ వంటి సినిమాలతో అలరించారు.ఇక త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో తక్షకుడు అనే తన కొత్త సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా కాకుండా ఆనంద్ దేవరకొండ మిథున్ వరదరాజ కృష్ణన్ డైరెక్షన్ లో డ్యూయెట్ అనే సినిమా చేస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ గా మిరాయ్ మూవీ హీరోయిన్ రితికా నాయక్ నటిస్తోంది.

Related News

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు .. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

Netflix Top Movies: నెట్ ఫ్లిక్స్ లో టాప్ 5 మూవీస్ ఇవే.. ట్రెండింగ్ లో ఆ మూవీ..!

OTT Movie : 1 గంట 54 నిమిషాల మిస్టరీ థ్రిల్లర్… రన్నింగ్ ట్రైన్ లో ఊహించని ట్విస్టులు… బుర్రకు పదును పెట్టే కథ

OTT Movie : ఒంటరి అమ్మాయిలతో జల్సా… ఒక్కొక్కరు ఒక్కోలా … క్లైమాక్స్ బాక్స్ బద్దలే

OTT Movie : వింత జంతువుతో అమ్మాయి సరసాలు… ఫ్రెండ్ తో కలిసి పాడు పని… ఇది అరాచకమే

OTT Movie : ఇద్దరు భర్తలకు ఒక్కటే భార్య … మైండ్ బ్లాకయ్యే సీన్స్ … స్టోరీ చాలా తేడా

OTT Movie : గ్రిప్పింగ్ మర్డర్ మిస్టరీ… క్రిమినల్ కే సపోర్ట్… మతిపోగోట్టే ట్విస్టులున్న లీగల్ థ్రిల్లర్

Big Stories

×