Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌కి చెందిన ఓ కుటుంబం కురవి వీరభద్రస్వామిని దర్శనం కోసం ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో బయలుదేరారు. బస్సు డ్రైవర్.. రోడ్డుపై ఉన్న పెద్ద గుంతను తప్పించబోయాడు. దీంతో బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికుల సహాయంతో క్షతగాత్రులను హాస్పిటల్‌కి తరలించారు. ఈ ప్రమాదంలో 30 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.. అందులో ఐదుగురు పరిస్థితి సీరియస్‌గా ఉందని వైద్యులు తెలిపారు.