BigTV English

Bigg Boss 9 Promo: బిగ్ బాస్ హౌస్‌కు నిప్పు పెట్టిన దివ్వెల.. రచ్చ చేసి.. ఏడ్చేసి.. వామ్మో మహానటి!

Bigg Boss 9 Promo: బిగ్ బాస్ హౌస్‌కు నిప్పు పెట్టిన దివ్వెల.. రచ్చ చేసి.. ఏడ్చేసి.. వామ్మో మహానటి!

Bigg Boss 9 Promo: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 9 5 వారాలు పూర్తి చేసుకుంది.ఐదు వారాలకు గాను మొత్తం 6 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. సెలబ్రిటీ కేటగిరీలో హౌస్ లోకి అడుగుపెట్టిన లేడీ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ (Shrasti Varma) మొదటి వారం ఎలిమినేట్ అవ్వగా.. రెండవ వారం కామనర్ కేటగిరీలో అడుగుపెట్టిన మర్యాద మనీష్(Maryada Manish) ఎలిమినేట్ అయ్యారు. మూడవ వారం ప్రియా శెట్టి, హరిత హరీష్ ఎలిమినేట్ కాగా.. ఐదవ వారం డబుల్ ఎలిమినేషన్స్ లో భాగంగా దమ్ము శ్రీజ, ఫ్లోరా షైనీ ఎలిమినేట్ అయ్యారు.


మొదటిరోజే రచ్చ చేసిన దివ్వెల మాధురి .

ఇదిలా ఉండగా ఆరవ వారానికి సంబంధించిన మొదటి రోజు ప్రారంభం అయింది. సోమవారంలో భాగంగా 36వ రోజుకు సంబంధించి మొదటి ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. ఇందులో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగుపెట్టిన దివ్వెల మాధురి(Divvala Madhuri) చేసిన పర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇక ఈమె ఇచ్చిన పర్ఫామెన్స్ కి.. హౌస్ లో పెట్టుకున్న గొడవకి.. చివరికి మళ్ళీ ఆమె ఏడవడం చూసి ఇదంతా ఆడియన్స్ సింపతి కోసమా.. బిగ్ బాస్ స్ట్రాటజీని బాగానే వంట పట్టించుకున్నారుగా అంటూ అప్పుడే ఈమెను ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. మరి తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం..

మరీ ఇలా అయితే కష్టమే..

ప్రోమో విషయానికి వస్తే.. దివ్వెల మాధురి సిట్టింగ్ ఏరియాకి రాగానే కళ్యాణ్ మర్యాదగా చైర్ జరిపి కూర్చోండి అంటూ ఆమెకు చెప్పారు. దివ్వెల మాధురి పర్లేదు నేను మళ్ళీ కుకింగ్ దగ్గరకు వెళ్లాలి అంటూ కామెంట్ చేసింది. అయ్యో పర్లేదు కూర్చోండి అని కళ్యాణ్ మర్యాదగా అడిగినా.. కూర్చోకపోతే చెప్పరా అంటూ వాయిస్ రైస్ చేసింది మాధురి. టైమ్ ఎంత అవుతుంది ఈరోజు అంటే ఇలా ఉంది కానీ రేపటి నుంచి ఇలా ఉండదు అంటూ కళ్యాణ్ తెలిపాడు. నేను వచ్చి అరగంట కూర్చున్నాను. అప్పుడేం చేశారు మీరు లేట్ అవుతుందని మీకు తెలియదా అంటూ తిరిగి ప్రశ్నించింది. ఇక్కడ గొడవపడడానికి ఎవరూ రాలేదు. మార్నింగ్ టైంలో కుకింగ్ సమయానికి ఎవరు ఇక్కడ లేరు.. అంటూ దివ్య నిఖిత చెప్పగా.. కుకింగ్ టైం లో నేనొక్కదాన్నే కాదు మరో ముగ్గురు ఉన్నారు అంటూ కౌంటర్ వేసింది మాధురి.


వామ్మో మహానటి..

మీరు మెయిన్ చెఫ్ అని మేం చెప్పినప్పుడు.. మీరు చెబితే వాళ్ళు చేసేస్తారు అని దివ్య చెప్పినా మాధురి.. ఉదయం లేవగానే ఎంత రేషన్ కావాలో అక్కడ పెట్టేయండి అంటూ కామెంట్ చేసింది. నేను మర్యాదగా కూర్చోండి మేడం అని రెస్పెక్ట్ ఇచ్చాను. కూర్చోకపోతే చెప్పవా అనేదాన్ని వెటకారమనే అంటారు అంటూ కళ్యాణ్ వాయిస్ రైస్ చేశాడు. అలా ఇద్దరి మధ్య గొడవ తారస్థాయికి చేరిపోయింది. ఆ తర్వాత దివ్వెల మాధురి ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇది చూసిన నెటిజన్స్ ఇదొక కొత్త రకం స్ట్రాటజీ అంటూ ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు. మొదటి రోజే బిగ్ బాస్ హౌస్‌కు నిప్పు పెట్టి.. రచ్చ చేసి.. ఏడ్చేసి.. వామ్మో మహానటి అంటూ కూడా ట్రోల్స్ చేస్తున్నారు

ALSO READ:Suresh Gopi: మళ్లీ సినిమాలు చేస్తానంటున్న సురేష్.. కేంద్ర పదవికి రాజీనామా?

Related News

Bigg Boss 9 Telugu : మొదటి రోజే హౌస్ లో పచ్చళ్ళ పాప రచ్చ.. ఇలా అయితే కష్టమే..!

Bigg Boss 9: నాన్న ఆఖరి చూపుకు కూడా నోచుకోలేకపోయా..రమ్య ఎమోషనల్!

Bigg Boss 9: 5 వారాలకు గానూ.. ఫ్లోరా, శ్రీజ దమ్ము ఎంత సంపాదించారో తెలుసా?

Bigg Boss Buzzz Srija : నేను గ్రూపు దగ్గర కూర్చుంటే వాళ్ళు లేచి వెళ్ళిపోయే వాళ్ళు, ప్లాన్డ్ గా లవ్ యాంగిల్ నడిపాడు

Bigg Boss 9 Wild Card : తమిళ్ బిగ్ బాస్ లో 65 రోజులు ఉన్నా, ఈ లోపు నా బాయ్ ఫ్రెండ్ ఇంకో అమ్మాయితో…

Bigg Boss 9 Wild Card : బిగ్ బాస్ లోకి దువ్వాడ మాధురి. షాక్ అయిన హౌస్ మేట్స్, శ్రీజ తో ఆర్గ్యుమెంట్ మొదలు 

Bigg Boss 9 : మైండ్ చెదిరిపోయే ట్విస్టులు, డబుల్ ఎలిమినేషన్స్, వైల్డ్ ఫైర్ వైల్డ్ కార్డు ఎంట్రీస్

Big Stories

×