E-Paper
Advertisement

ఏం థ్రిల్లర్ రా అయ్యా… ఈ పిల్లను పెళ్లి చేసుకోవాలనుకుంటే చస్తారు

ఏం థ్రిల్లర్ రా అయ్యా… ఈ పిల్లను పెళ్లి చేసుకోవాలనుకుంటే చస్తారు
Advertisement

Romantic Thriller: ఓటీటీలో మిస్టరీ, సస్పెన్స్ సినిమాలు చాలానే వస్తుంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం మొదటి నుంచి చివరి వరకు సస్పెన్స్ ను హోల్డ్ చేస్తూ ప్రేక్షకుడిలో ఆసక్తిని పెంచుతుంటాయి. ఒక ట్విస్ట్ నుంచి మరో ట్విస్ట్‌కు కథను తీసుకెళ్తూ, చివరి వరకు ఉత్కంఠను కొనసాగిస్తాయి. అలాంటి విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమే ‘అంధరన్: ది హంటర్ (Andharan: The Hunter)’. ఒక యువతిని ప్రేమించినా, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా, పెళ్లి జరిగేలోపే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోతుంటే… దాని వెనుక నిజంగా ఏదైనా శాపం ఉందా ? లేక ఎవరూ ఊహించని హంతకుడి పక్కా ప్రణాళికా ? అనే ఆసక్తికరమైన కథతో ఈ సినిమా రూపొందింది. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రావడంతో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. మరి ఈ సినిమా కథ ఏంటి ? ఇందులో ఉన్న రహస్యం ఏమిటి ? ఒకసారి చూద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

కార్తిక అనే యువతి జీవితంలో వరుసగా ఒకే తరహా సంఘటనలు జరుగుతుంటాయి. ఆమెను ప్రేమించిన వ్యక్తి అయినా, పెళ్లి చేసుకోవాలని ముందుకొచ్చిన వ్యక్తి అయినా, పెళ్లి పీటలు ఎక్కేలోపే అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తుంటాడు. ఒకసారి కాదు, మళ్లీ మళ్లీ అదే జరగడంతో కార్తిక జీవితమే ఒక పెద్ద మిస్టరీగా మారిపోతుంది. ఆమెకు దగ్గరయ్యేందుకు కూడా చాలామంది భయపడే పరిస్థితి ఏర్పడుతుంది.

Advertisement

మొదట కార్తిక ప్రేమించిన ఆటో డ్రైవర్ ఆదిత్య అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. దీంతో అందరి అనుమానం ఆమె తండ్రి శంకర్‌పైనే పడుతుంది. కులాన్ని ఎక్కువగా పట్టించుకునే అతనే ఈ హత్యలకు కారణమై ఉంటాడని చాలామంది భావిస్తారు. కానీ దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ కనిపించే ఆధారాలు మాత్రం పూర్తిగా కొత్త ప్రశ్నలను తెరపైకి తీసుకొస్తాయి.

ఈ వరుస మరణాల వెనుక ఉన్న నిజాన్ని కనిపెట్టేందుకు ఐపీఎస్ అధికారి చేజియన్ రంగంలోకి దిగుతాడు. అయితే ఈ కేసు అతనికి కేవలం డ్యూటి మాత్రమే కాదు పర్సనల్ కూడా. కార్తికతో అతనికి గతంలో ఉన్న ప్రేమ ఈ దర్యాప్తును మరింత వ్యక్తిగతంగా మారుస్తుంది. అందుకే ప్రతి చిన్న ఆధారాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలిస్తాడు.

Advertisement

దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ కార్తిక గతానికి సంబంధించిన కొన్ని సీక్రెట్స్ ఒక్కొక్కటిగా బయటపడతాయి. అదే సమయంలో ప్రతి నేరస్థలం దగ్గర ఒకే తరహా హింట్ కనిపించడం కేసులో ఊహించని మలుపు తీసుకొస్తుంది. ఆ ఆధారం ఎవరిది ? ఎందుకు ప్రతి సంఘటనలో అదే కనిపిస్తోంది ? అనే సందేహాలు మరింత పెరుగుతాయి.

ఒకవైపు ఈ మరణాల వెనుక ఎవరో హంతకుడు ఉన్నాడనే అనుమానం బలపడుతుంటే, మరోవైపు నిజంగానే కార్తిక జీవితాన్ని ఏదైనా అదృశ్య శక్తి వెంటాడుతోందా ? అనే సందేహం కూడా ప్రేక్షకుడిలో కలుగుతుంది. దర్శకుడు ఈ రెండు కోణాలను సమానంగా నడిపిస్తూ, సస్పెన్స్ ను చివరి వరకూ ఎక్కడా రివీల్ కాకుండా చూసుకున్నారు.

సినిమాలో వచ్చే ప్రతి ట్విస్ట్ ప్రేక్షకుడి అంచనాలను మార్చేస్తుంది. ఒక పాత్రపై అనుమానం మొదలవుతుండగానే మరో ఆధారం బయట పడుతుంది. దీంతో అసలు హంతకుడు ఎవరు ? కార్తిక జీవితంలో వరుసగా జరుగుతున్న ఈ మరణాలకు కారణం ఏమిటి ? ఇది నిజంగా శాపమా ? లేక చాలా తెలివిగా పన్నిన హత్యలా ? చివరికి చేజియన్ ఈ కేసును ఛేదించగలిగాడా ? అనే ప్రశ్నలు ప్రేక్షకుడిని చివరి వరకు ఉత్కంఠలో ఉంచుతాయి.అసలు నిజం బయటపడే వరకు తర్వాత ఏం జరుగుతుందో ఊహించడం కూడా కష్టమే.

తెలుగులో ఉందా లేదా?

‘అంధరన్: ది హంటర్’ సినిమాలో సినిమాలో ప్రాజిన్ పద్మనాభన్, ఇవానా వరుణ్, ఆధిరన్, అనుపమ కుమార్, సెంథిల్ కుమారి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంతోష్ రాగవన్ దర్శకత్వం వహించగా, హరి ఎస్ ఆర్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా Simply South ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు. ఒకసారి కథలోకి వెళ్లాక అసలు నిజం ఏంటో తెలుసుకునే వరకు స్క్రీన్ నుంచి చూపు తిప్పుకోవడం కష్టమే.

Read Also: బ్యాచిలర్ పార్టీకని వెళ్ళి దిక్కుతోచని చిక్కుల్లో… కట్ చేస్తే బట్టల్లేకుండా బీచ్ లో

Related News

స్కూల్లో చేయకూడని పని… కట్ చేస్తే రౌడీ సీఈఓతో… మనసును హత్తుకునే కొరియన్ ప్రేమ కథ

మానవాళి మనుగడ కోసం క్రూరమైన రాక్షసులతో వార్… సెన్సేషనల్ యానిమే సిరీస్ తెలుగులో

డాన్ సామ్రాజ్యానికి రాణిగా మారే ఛాన్స్… ఈ క్రైమ్ అండ్ బోల్డ్ డ్రామాలో సస్పెన్స్ పీక్స్

ఖైదీలపై డేంజరస్ మైండ్ ఎక్స్‌పెరిమెంట్స్… మైండ్ బెండింగ్ సైకలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

కారు సీటు కిందే బాంబు… డ్రైవింగ్ ఆపితే ప్రాణాలు గాల్లో… 90 నిమిషాల సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్

 పత్రిక మూతపడే ముప్పులో పడ్డా వెనక్కి తగ్గని రిపోర్టర్లు… న్యూస్‌రూమ్‌ థ్రిల్లర్ ను డోంట్ మిస్

అపార్ట్‌మెంట్ మెట్లపై అబ్బాయి మిస్సింగ్… ఒక్కో ట్విస్ట్ ఉంటది భయ్యా

బాయ్స్ టీమ్‌కు కెప్టెన్ గా అమ్మాయి… క్రేజీ యూత్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామా

Big Stories

Advertisement
×