E-Paper
Advertisement

Andhra King Taluka OTT: క్రిస్మస్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా!

Andhra King Taluka OTT: క్రిస్మస్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా!
Advertisement

Andhra king Taluka OTT: ఇటీవల కాలంలో ఒక సినిమా విడుదలైన కేవలం నాలుగు వారాల వ్యవధిలోనే తిరిగి ఓటీటీలో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఇక నవంబర్ నెలలో పెద్ద ఎత్తున సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి అయితే నవంబర్లో విడుదలైన సినిమాలన్నీ కూడా ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. నవంబర్ నెలలో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలలో ఆంధ్ర కింగ్ తాలూకా(Andhra King Taluka) సినిమా ఒకటి. నటుడు రామ్ పోతినేని(Ram Pothineni) భాగ్యశ్రీ(Bhagya Shri) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా నవంబర్ 27వ తేదీ థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.

క్రిస్మస్ సందర్భంగా డిజిటల్ స్ట్రీమింగ్..

ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అనుకున్న విధంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఇలా థియేటర్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైందని సమాచారం . ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి ఎక్కడ అధికారక ప్రకటన లేకపోయినా ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని డిసెంబర్ 25వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్(Net Flix) లో ప్రసారం కాబోతుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతుంది.

ఫ్యాన్ కల్చర్ ఎమోషనల్ డ్రామాగా..

Advertisement

ఈ సినిమా ఒక హీరో అభిమాని నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా ఫ్యాన్ కల్చర్ ఎమోషనల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అనుకున్న విధంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో మరోసారి రామ అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు పి మహేష్ బాబు. ఇదివరకు ఈయన డైరెక్షన్ లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వంటి మంచి సక్సెస్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడంతో ఆంధ్ర కింగ్ తాలూకాపై కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా థియేటర్ లో విడుదలయి 30 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిందని తెలుస్తోంది.

థియేటర్లో మెప్పించలేకపోయిన రామ్ ..

Advertisement

రామ్ నటించిన ఇదివరకు సినిమాలతో పోలిస్తే ఈ సినిమా పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ అనుకున్న స్థాయిలో సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది.. ఈ సినిమాలో రామ్ భాగ్యశ్రీ నటన కూడా అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో అయిన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సంబంధించి అధికారక ప్రకటన కూడా వెల్లడించనున్నారు. ఇక భాగ్యశ్రీ వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ ఏ సినిమా కూడా తనకు సక్సెస్ అందించలేక పోయిందని చెప్పాలి. ఓకే నెలలో కాంత ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు రెండు సినిమాలు కూడా నిరాశపరిచాయి.

Also Read: The Paradise: నాని ది ప్యారడైజ్ రిలీజ్ పై క్లారిటీ.. వెనకడుగు వేసే ప్రసక్తే లేదంటూ!

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×