E-Paper
Advertisement

OTT Movie : రేటింగ్ కోసం భూతాలతో ఆటలు… రాకాసి దెయ్యం ఎంట్రీతో ఒక్కొక్కరూ మిస్సింగ్… ఓటీటీలోకి కన్నడ హారర్ థ్రిల్లర్

OTT Movie : రేటింగ్ కోసం భూతాలతో ఆటలు… రాకాసి దెయ్యం ఎంట్రీతో ఒక్కొక్కరూ మిస్సింగ్… ఓటీటీలోకి కన్నడ హారర్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : రీసెంట్ గా మరో హారర్ మూవీ ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేసింది. ఇది ఫౌండ్ ఫుటేజ్ జానర్‌లో కన్నడ సినిమాల్లో రికార్డ్ సెట్ చేసింది. ఆడియన్స్ నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక మిస్టీరియస్ గ్రామంలో ఎంట్రీ ఇచ్చిన నలుగురు వ్యక్తుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సస్పెన్స్ తో నడిచే ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? దీని పేరు ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎందులో స్ట్రీమింగ్ అంటే

ఈ కన్నడ హారర్ థ్రిల్లర్ మిస్టరీ మూవీ పేరు ‘అంతిమ క్షణగళు’ (Anthima Kshanagalu). నిర్మల్ బేబీ వర్గీస్ డైరెక్షన్ లో 2025 మే 20న ఈ సినిమా విడుదలైంది. ఇందులో జెఫిన్ జోసెఫ్, వరుణ్ రవీంద్రన్, అస్వతి అనిల్ కుమార్, ష్యామ్ సలాష్ లీడ్ రోల్స్ లో నటించారు. 95 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 8.8/10 రేటింగ్ ని పొందింది. నవంబర్ 28 నుంచి బీసీనీట్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

దీపా, రీమా ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్, యూట్యూబ్‌లో ‘మిస్టరీ హంటర్స్’ అనే ఛానల్ నడుపుతారు. దీని కోసం కేరళ-కర్ణాటక బోర్డర్ దగ్గర ఉన్న మిస్టరీ గ్రామానికి వెళ్తారు. ఆ గ్రామంలో 30 ఏళ్ల క్రితం ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఒకే రాత్రి మొత్తం గ్రామంలోని 27 మంది మిస్సింగ్ అయిపోయారు, ఎవరూ తిరిగి రాలేదు. ఆ గ్రామం ఇప్పుడు ఖాళీగా ఉంది. లోకల్స్ కూడా ఎవరూ దగ్గరికి రారు. దీపా, రీమా ఇద్దరూ రెండు కెమెరాలు, ఒక డ్రోన్ తీసుకుని ఆ గ్రామంలోకి వెళతారు. మొదట రోజు అంతా నార్మల్ గా ఉంటుంది. పాడుబడిన ఇళ్లు, పాత బస్సు, దేవాలయం, అక్కడే సిథిలంగా ఉండే స్కూలుని షూట్ చేస్తారు. అయితే ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్లు వార్నింగ్ ఇస్తారు. రాత్రి 7 అయ్యాక ఎవరూ ఉండకూడదు, లేదంటే తిరిగి రారు అని హెచ్చరిస్తారు. కానీ ఇద్దరూ ఛానల్ కోసం ఒక రాత్రి పూర్తిగా బయట షూట్ చేయాలని డిసైడ్ అవుతారు. ఇక సూర్యుడు అస్తమించగానే నరకం మొదలవుతుంది.

Read Also : ఆరు ఆస్కార్లు గెలిచిన సినిమా … బ్యాండ్ వాయించే వాడితో ప్రేమ… ఊహించని ట్విస్ట్ తో హార్ట్ టచింగ్ క్లైమాక్స్

Advertisement

అక్కడి రీమా బాయ్‌ ఫ్రెండ్ రాహుల్, మరో ఫ్రెండ్ ష్యామ్ వాళ్లని వెతక్కుండా వస్తారు కానీ వాళ్లు కూడా చిక్కుకుపోతారు. రీమా కెమెరాలో గతంలో మిస్సింగ్ అయిన 27 మంది ముఖాలు కనిపిస్తాయి. ఆమె గొంతులో వేరే గొంతులా మాట్లాడుతుంది. 30 ఏళ్ల క్రితం ఆ గ్రామంలో ఒక బ్లాక్ మ్యాజిక్ రిచ్యువల్ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక ఆత్మ ఆ గ్రామంలోనే ఉంది. దీపా శరీరంలోకి ఆ ఆత్మ ఎంటర్ అయిపోతుంది. దీంతో స్టోరీలో భయంకరమైన సంఘటనలు మొదలవుతాయి. ఒక్కొక్కరూ దారుణంగా హంట్ అవుతుంటారు. చివరికి వీళ్లల్లో ఎవరైనా ప్రాణాలతో బయట పడతారా ? ఆ గ్రామంలో 27 మంది ఎలా చనిపోయారు ? ఈ కథ క్లైమాక్స్ ఏంటి ? అనే విషయాలను ఈ కన్నడ హారర్ మూవీని చూసి తెలుసుకోండి.

 

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×