E-Paper
Advertisement

OTT Movie : ఆరు ఆస్కార్లు గెలిచిన సినిమా … బ్యాండ్ వాయించే వాడితో ప్రేమ… ఊహించని ట్విస్ట్ తో హార్ట్ టచింగ్ క్లైమాక్స్

OTT Movie : ఆరు ఆస్కార్లు గెలిచిన సినిమా … బ్యాండ్ వాయించే వాడితో ప్రేమ… ఊహించని ట్విస్ట్ తో హార్ట్ టచింగ్ క్లైమాక్స్
Advertisement

OTT Movie : పది సంవత్సరాలైనా క్రేజ్ తగ్గకుండా, ఇప్పటికీ టాప్ మ్యూజికల్స్ లిస్ట్‌లో ఉన్న సినిమా ‘లా లా ల్యాండ్’. మ్యూజిక్ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా, 14 నామినేషన్స్ తో 6 ఆస్కార్స్ ను గెలుచుకుంది. బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ తో పాటు మిగిలిన విభాగాల్లో ఈ ఘనత సాధించింది. మనసుకు హత్తుకునే ప్రేమ కథతో మ్యూజికల్ హిట్ కొట్టిన ఈ సినిమా, డిజిటల్ స్ట్రీమింగ్ లో ఇప్పటికీ  ట్రెండింగ్ లో ఉంది. దీని కథ ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2016 డిసెంబర్ 9న విడుదలైన ఈ అమెరికన్ మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ మూవీ పేరు ‘లా లా ల్యాండ్’. డేమియన్ చాజెల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఎమ్మా స్టోన్, ర్యాన్ గాస్లింగ్ లీడ్ రోల్స్ లో నటించారు. 128 నిమిషాల రన్‌ టైమ్ ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 8.0/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

లాస్ ఏంజెలెస్ నగరంలో మియా అనే అమ్మాయి హీరోయిన్ కావాలని కలలు కంటూ ఉంటుంది. ఒక కాఫీ షాప్‌లో పని చేస్తూ ఆడిషన్లకి వెళ్తుంటుంది. ఒక రోజు ట్రాఫిక్‌లో సెబాస్టియన్ అనే పియానిస్ట్‌తో గొడవ పడుతుంది. సెబాస్టియన్ తన సొంత జాజ్ క్లబ్ తెరవాలని కలలు కంటాడు. కానీ ఇప్పుడు రెస్టారెంట్‌లో పాత పాటలు వాయిస్తూ బతుకుతున్నాడు. ఒక రోజు మళ్లీ పార్టీలో ఇద్దరూ కలుస్తారు. ఇద్దరూ మాటలు కలిపి డాన్స్ చేస్తారు. ఇక వీళ్ళ మధ్య బాండింగ్ బాగా ఏర్పడుతుంది. లాస్ ఏంజెలెస్ కొండల మీద నడుస్తూ, ఒకరి కలలకి ఒకరు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుకుంటారు. మధ్యలో వచ్చే సాంగ్స్‌లో పూర్తిగా హార్ట్ ని తాకుతాయి. ఇక వీళ్ళ కలలు నిజం అవుతుంటే సమస్యలు కూడా మొదలవుతాయి.

Read Also : విజయ్ వర్మ కొత్త రొమాంటిక్ మూవీ ఆ ఓటీటీలోకి… థియేటర్లలో అడుగు పెట్టక ముందే

Advertisement

ఈ సమయంలో మియాకి ఒక పెద్ద హీరోయిన్ ఆఫర్ వస్తుంది. సెబాస్టియన్‌కి కూడా ఒక పాపులర్ బ్యాండ్ ఆఫర్ వస్తుంది. ఇద్దరి కలలు నెరవేర్చుకోవడానికి దూరం అవ్వాల్సి వస్తుంది. 5 ఏళ్ల తర్వాత మియా పెద్ద హీరోయిన్ అయిపోతుంది. ఒక రోజు లాస్ ఏంజెలెస్‌లో ఒక జాజ్ క్లబ్‌కి వెళ్తుంది. అది సెబాస్టియన్ కల నెరవేరిన క్లబ్! సెబాస్టియన్ ఆమెని చూసి షాకవుతాడు. మియా కోసం ఒక పాత పాట వాయిస్తాడు. ఆ పాటలో ఇద్దరి గతం ఫ్లాష్‌బ్యాక్‌లో కనిపిస్తుంది. ఈ సినిమా ఫిల్ గుడ్ ఎమోషన్స్ తో ఇలా ముగుస్తుంది.

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×