E-Paper
Advertisement

OTT Movie : ప్రేమలో పడే చెవిటి పూజారి… హెయిర్ స్టైల్ తోనే నవ్వు తెప్పిస్తున్న హీరో… ఓటీటీలోకి కన్నడ కామెడీ మూవీ

OTT Movie : ప్రేమలో పడే చెవిటి పూజారి… హెయిర్ స్టైల్ తోనే నవ్వు తెప్పిస్తున్న హీరో… ఓటీటీలోకి కన్నడ కామెడీ మూవీ
Advertisement

OTT Movie : కన్నడ సినిమాల్లో స్మాల్ బడ్జెట్ తో సక్సెస్ అయిన ఒక కామెడీ సినిమాని, తెలుగు ఆడియన్స్ కోసం డబ్ వెర్షన్ ప్రమోట్ చేశారు. ఫ్యామిలీతో చూడటానికి ఈ సినిమా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ట్రైలర్ చూస్తేనే సినిమా చూడాలని అనిపిస్తుంది. ఇందులో హీరో గెటప్ చూస్తే మాత్రం నవ్వు ఆపుకోలేరు. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ తరువాత రెండు నెలలకు ఓటీటీలో అడుగుపెట్టింది. ఓటీటీ ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ స్టోరీ ఒక మంచి పెళ్ళాం, ఫ్యామిలీ కావాలనుకునే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2025లో విడుదలైన ఈ కన్నడ కామెడీ డ్రామా సినిమా పేరు ‘అరసయ్యన ప్రేమ ప్రసాంగ్’. దీనిని జెవిఆర్ డీపు డైరెక్షన్లో మేఘశ్రీ రాజేష్ నిర్మించారు. ఇందులో మహాంతేష్ హిరేమఠ్ (అరసయ్య ), రష్మితా గౌడా (హీరోయిన్) ప్రధాన పాత్రల్లో నటించారు. దాదాపు రెండు గంటలు ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 7.5/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా 2025 సెప్టెంబర్ 19న థియేట్రికల్ రిలీజ్ అయింది. 2025 డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కన్నడ ఒరిజినల్ తో పాటు తెలుగు/తమిళ్/హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కూడా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఒక చిన్న ఊరిలో అరసయ్య అనే పూజారి ఉంటాడు. అతనికి వినికిడి సమస్య ఉంటుంది. చిన్నప్పటి నుంచి హియరింగ్ ఎయిడ్ పెట్టుకుంటాడు. ఊరంతా అతన్ని అరసయ్యన్నా అని ఇష్టంగా పిలుస్తారు. అతనికి ఒక్కటే కల… ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. ఒక మంచి ఫ్యామిలీని లీడ్ చేయాలి. ఒక రోజు పోస్టా ఫీస్‌లో రష్మి అనే అమ్మాయిని చూస్తాడు. ఆమె స్మైల్ చూసి ఒక్కసారిగా ప్రేమలో పడిపోతాడు. రష్మి కూడా ఊరి పోస్ట్ ఆఫీస్ ఉద్యోగి, చాలా స్వీట్ అమ్మాయి. అరసయ్య ఆమెని ఇంప్రెస్ చేయడానికి ఫ్లవర్స్ పంపడం, లవ్ లెటర్స్ రాయడం, ఫెస్టివల్‌లో డాన్స్ చేయడం మొదలెడతాడు. కానీ వాడి వినికిడి సమస్య వల్ల ఎప్పుడూ మాటలు తప్పుగా అర్థమవుతాయి.

Read Also : అందాల భామతో అందరి ముందు శోభనం… రియల్ హిస్టారికల్ స్టోరీ

Advertisement

దీంతో అతన్ని తప్పుగా అర్థం చేసుకుంటుంది రష్మి. ఇదంతా చూసి ఊరంతా నవ్వుతుంది. కానీ అరసయ్య మాత్రం సీరియస్‌గా ప్రేమలో పడిపోతాడు. రష్మి కూడా క్రమంగా వాడి మనసు, సిన్సియర్ ప్రేమ చూసి ఇష్టపడిపోతుంది. కానీ పెద్ద ప్రాబ్లమ్ వస్తుంది. రష్మి ఇంట్లో అరసయ్య వినికిడి సమస్య తెలిసి అతనికి రష్మిని ఇవ్వడానికి నిరాకరిస్తారు. అరసయ్య కుటుంబం కూడా టెన్షన్ పడుతుంది. క్లైమాక్స్ లో ఒక హార్ట్ టచింగ్ సీన్ తో స్టోరీకి ముగింపు వస్తుంది. ఆ సీన్ ఏమిటి ? అరసయ్య ప్రేమ ఫలిస్తుందా ? రష్మి ఫ్యామిలీ పెళ్ళికి ఒప్పుకుంటుందా ? అనే విషయాలను, ఈ కన్నడ కామెడీ డ్రామా సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

 

 

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×