E-Paper
Advertisement

Nalgonda News: రూ.73 లక్షలతో సర్పంచ్ అవ్వాలనుకున్న ఓ అభ్యర్థికి ట్విస్ట్.. ఏమైందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Nalgonda News: రూ.73 లక్షలతో సర్పంచ్ అవ్వాలనుకున్న ఓ అభ్యర్థికి ట్విస్ట్.. ఏమైందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Advertisement

Nalgonda News: నల్గొండ జిల్లా చండూరు మండలం బంగారిగడ్డ గ్రామ పంచాయతీ ఎన్నిక అనూహ్య మలుపు తిరిగింది. ఊరికి సర్పంచ్ కావాలని ఆశించిన అభ్యర్థి సమీనా ఖాసిం తీసుకున్న నిర్ణయం మొదట చర్చనీయాంశమై, చివరికి ఆమె ఆశలకు బ్రేక్ వేసింది. గ్రామంలో ఎన్నిక జరగకుండా, ఏకగ్రీవం కోసం ఈ పదవిని ఏకంగా రూ.73 లక్షలకు వేలం పాట పాడి గెలుచుకుంది సమీనా ఖాసిం. ఈ మొత్తాన్ని గ్రామంలో ఆలయాల నిర్మాణానికి ఉపయోగిస్తానని హామీ ఇచ్చింది.

గ్రామంలో సర్పంచ్ పదవికి ముందుగా నామినేషన్లు వేసిన ఇతర అభ్యర్థులు, ఈ వేలం ఒప్పందానికి అంగీకరించినట్టు ప్రచారం జరిగింది. దీనితో వారు తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటే, సమీనా ఖాసిం ఏకగ్రీవంగా సర్పంచ్ అవుతుందని అంతా భావించారు. అయితే, గ్రామ ఎన్నిక ప్రక్రియను పక్కనపెట్టి, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా పదవిని వేలం వేయడాన్ని గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన ఈ విషయంపై నేరుగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వేలంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో డిమాండ్ చేశారు.

Advertisement

వేలం ఒప్పందం ప్రకారం ముందుగా నలుగురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అయితే, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు విషయం తెలుసుకున్న మిగిలిన అభ్యర్థులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. మొత్తం ఏడుగురు అభ్యర్థులు పోటీలో కొనసాగాలని నిశ్చయించుకున్నారు. డబ్బులు వెచ్చించి సర్పంచ్ పదవి దక్కించుకోవాలని భావించిన సమీనా ఖాసిం ఆశలు ఈ ఏడుగురు అభ్యర్థులు పోటీలో ఉండటంతో ఆవిరయ్యాయి.

ఫలితంగా, బంగారిగడ్డ గ్రామ పంచాయతీకి ఎన్నిక తప్పనిసరైంది. ఏకగ్రీవంగా గెలుపొందాలని సమీనా ఖాసిం అనుకున్నప్పటికీ, ఈ తాజా పరిణామం ఆమెను చివరిరోజు పోటీలోకి దిగాల్సిన పరిస్థితిని కల్పించింది. రూ.73 లక్షల భారీ మొత్తం ఆశ చూపి సర్పంచ్ కావాలనుకున్న సమీనా ఖాసిం ప్రయత్నానికి బ్రేక్ పడింది. ప్రస్తుతానికి, ఆ గ్రామంలో పోలింగ్ జరగడం ఖాయమైంది. ఈ ఘటన ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికల ప్రాముఖ్యతను మరోసారి గుర్తు చేసింది. ఈ వేలం పాట అంశంపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

Advertisement

ALSO READ: Vijayawada: విజయవాడ భవానీపురంలో తీవ్ర ఉద్రిక్తత.. రోడ్డుపై బైఠాయించిన బాధితులు

Related News

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

Big Stories

Advertisement
×