E-Paper
Advertisement

Vijay Politics: విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. సినిమా డ్రామాను మించిన రియల్ ట్విస్టులు.. దళపతికి చెక్ పడినట్టేనా?

Vijay Politics: విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. సినిమా డ్రామాను మించిన రియల్ ట్విస్టులు.. దళపతికి చెక్ పడినట్టేనా?
Advertisement

Vijay Politics: తమిళనాడు పాలిటిక్స్ అంటేనే సినీ గ్లామర్.. ఎమోషన్స్‌ చుట్టూ తిరుగుతుంటాయి. వెండితెర నుంచి వచ్చిన ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వంటి వారు తమిళనాడును ఏలారు. సేమ్ ఇదే స్ట్రాటజీతో తమిళగ వెట్రి కళగం పేరుతో ఓ పార్టీని పెట్టి.. తమిళనాడు పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు దళపతి విజయ్. బట్ ఆయన ఎంట్రీ ఎంత గ్రాండ్‌గా జరిగిందో.. ఇప్పుడు అంత కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు విజయ్.

విజయ్ పొలిటికల్ ఎంట్రీకి తొలి షాక్

విజయ్‌ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వగానే తగిలిన మొదటి షాక్ కరూర్ తొక్కిసలాట. టీవీకే నిర్వహించిన బహిరంగ సభ, రోడ్‌ షోలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందారు. 110 మందికిపైగా గాయపడ్డారు. నిజానికి విజయ్ రావాల్సిన టైమ్ కంటే.. చాలా ఆలస్యంగా వచ్చారు కాబట్టే ఈ ప్రమాదం జరిగింది అంటూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది. అయితే ఇది ఆయన పొలిటికల్ కెరీర్‌కు పెద్దగా డ్యామేజ్‌ చేయలేదు. సీబీఐ నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్న ప్రతిసారీ ఆయనపై అభిమానుల్లో అంతో ఇంతో అభిమానం పెరుగుతూనే ఉంది.

విజయ్ వ్యక్తిగత జీవితంలో ట్విస్ట్

Advertisement

కానీ విజయ్‌కు తగిలిన అసలైన షాక్ మాత్రం అతని వ్యక్తిగత జీవితంలో జరిగింది. ఆయన పొలిటికల్ కెరీర్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలోనే ఆయన భార్య సంగీత సొర్నలింగం ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. తన భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించారు. దీనికి కారణం మరో నటితో ఎఫైర్ ఉందనేది సంగీత ఆరోపణ. ఇది ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది.
గత కొన్ని రోజులుగా విజయ్ మరో నటితో ప్రేమలో ఉన్నాడని.. ఆ నటి మరేవరో కాదు త్రిష అని కోలివూడ్ కోడై కూస్తోంది. సరిగ్గా ఇలాంటి టైమ్‌లోనే విజయ్‌ భార్య ఇలాంటి ఆరోపణలు చేయడం ఇప్పుడు పెద్ద సెన్సేషన్ అయ్యింది.

మ్యాచింగ్ డ్రెస్‌లతో పెళ్లి వేడుకలో ఎంట్రీ!

ఇదే పెద్ద ట్విస్ట్ అనుకుంటే.. ఏ హిరోయిన్‌తో అయితే విజయ్‌ ప్రేమాయణం నడుస్తుందని ఆరోపణలు ఉన్నాయో.. అదే హీరోయిన్‌తో కలిసి విజయ్‌ ఓ పెళ్లికి అటెండ్‌ అయ్యారు. అది కూడా ఒకే కారులో ప్రయాణించారు. మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నారు. దీంతో వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని అఫిషియల్‌గా అనౌన్స్ చేసినట్టే అనే ప్రచారం జరుగుతోంది.

నాగేంద్రన్ కామెంట్స్‌

Advertisement

అసలు విజయ్ ఇలా ఎందుకు చేశాడు? అనేది ఇప్పుడు పెద్ద టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఈ ఘటనలన్ని జరగడానికి కొన్ని రోజుల ముందు ఓ సీన్ జరిగింది. తమిళనాడు బీజేపీ చీఫ్ నాగేంద్రన్… విజయ్ అండ్ త్రిష మీద సంచలన ఆరోపణలు చేశారు. త్రిష ఇంటి నుంచి విజయ్ బయటకు వచ్చి రాజకీయాలు చేస్తేనే మంచిది అంటూ ఆరోపించారు. అప్పట్లో ఇది పెద్ద దుమారమే అయ్ఇయంది. ఆయన వ్యాఖ్యల మీద త్రిష చాలా సీరియస్ అయ్యారు. తనను అనవసరంగా రాజకీయాల్లోకి లాగుతున్నారు అంటూ ఫైర్ అయ్యారు. అటు విజయ్ కూడా వ్యక్తిగత విషయాలను రాజకీయాల్లోకి లాగుతున్నారు అంటూ మండిపడ్డారు.

విజయ్ చుట్టూ పెరుగుతున్న వివాదాలు

ఈ స్టేట్‌మెంట్స్‌ ఇచ్చిన కొన్ని రోజులకే సంగీత డైవర్స్‌కు అప్లై చేయడం.. ఆ తర్వాత వీరిద్దరు కలిసి ఇలా కనిపించడం జరిగాయి. దీంతో చేసిన ఆరోపణలన్ని నిజమే అనే చర్చ మొదలైంది. విజయ్‌ ఎవరితో రిలేషన్‌లో ఉంటారు అనేది ఆయన వ్యక్తిగత విషయం. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ విజయ్‌కు ఇంకా విడాకులు రాలేదు. ఆయన తన భార్యతో ఉన్న బంధం గురించి ఎలాంటి అనౌన్స్‌మెంట్ చేయలేదు. కానీ ఇంతలోనే ఇలా పబ్లిక్‌గా అనుమానాలను పెంచేలా చేయడం మరింత కన్‌ఫ్యూజన్‌లో పడేసింది. పోనీ త్రిషతో బంధం గురించి ఏమైనా క్లారిటీ ఇచ్చాడా? అంటే అదీ లేదు. ఇలా సైలెంట్‌గా ఉంటూ రూమర్స్‌కు మరింత ఆజ్యం పోసేలా చేస్తున్నారు విజయ్.

రాజకీయాల్లో విజయ్‌కు కొత్త పరీక్ష

మాములుగా విజయ్‌ కేవలం హీరో అయితే పెద్ద సమస్యేమి ఉండేది కాదు. కానీ ఇప్పుడు విజయ్‌ తమిళనాడును పాలించాలని కోరుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం క్యాండిడేట్‌గా బరిలోకి దిగుతున్నారు. కాబట్టి కాస్త ఆచితూచి అడుగేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విజయ్‌కు చాలా మంది ఫ్యాన్స్‌ ఉండవచ్చు.. అతడిని అభిమానించవచ్చు.. ఆరాధించవచ్చు. కానీ ఒక సీఎం క్యాండిడేట్‌గా ఆయన చూసే విధానం మాత్రం ఖచ్చితంగా వేరేలా ఉంటుంది.

విజయ్‌పై కొత్త చర్చ

దీనికి తోడు సౌత్ ఇండియా పాలిటిక్స్‌లో కాస్త ఫ్యామిలీ మ్యాన్ ఇమేజ్‌ కొంచెం అవసరం అని చరిత్ర చెబుతోంది. ఇలాంటి సమయంలో సంగీతతో విడాకులు.. త్రిషతో ప్రేమాయణం అనే ప్రచారం.. అతని పొలిటికల్‌ కెరీర్‌కు మైలేజ్‌ను ఇచ్చే అంశాలైతే కాదు. సొంత ఫ్యామిలీ విషయంలోనే ఇలా బీహేవ్ చేస్తే.. ఇక రాష్ట్ర ప్రజల విషయంలో ఇంకెలా ఉంటాడో అనే అంశాన్ని ప్రత్యర్థులు ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.

విమర్శలపై విజయ్ ఆవేదన

అయితే తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న చర్చలు, విమర్శల పట్ల విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. అనవసరమైన వివాదాలు వస్తున్నాయి.. వ్యక్తిగత విషయాల వల్ల పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఇబ్బందులకు గురవుతున్నారంటూ.. తన సమస్యలను తానే పరిష్కరించుకుంటానని చెబుతున్నాడు విజయ్. అంతేకాదు తన లక్ష్యం ప్రజా సంక్షేమం.. ప్రజలకు చేయాల్సిన సేవపై ఫోకస్ చేయండి అని చెబుతున్నాడు. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ఇప్పటికైనా మౌనం వీడారు అంటుంటే.. మరికొందరు మాత్రం చెప్పాల్సింది పూర్తిగా చెప్పలేదు.. పూర్తి క్లారిటీ కావాలంటున్నారు.

విజయ్‌పై సోషల్ మీడియా ట్రోల్స్

ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రతీది క్యాలిక్యులేటేడ్‌గానే ఉంటుంది. ఇప్పుడు విజయ్‌ వేసే అడుగులు అతని ప్రత్యర్థులకు ఒక అవకాశాన్ని క్రియేట్ చేస్తున్నాయి. డీఎంకే, ఏఐఏడీఎంకే విజయ్ ఎదుగుదలను అడ్డుకోవడానికి సిద్ధంగా ఉంటాయి.. ఉన్నాయి కూడా. నిజానికి ఇప్పటికే సోషల్ మీడియాలో విజయ్ పర్సనల్ లైఫ్‌పై విపరీతంగా ట్రోల్స్ నడుస్తున్నాయి. మనం ముందే చెప్పుకున్నట్టు.. ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా.. ఎన్ని ఎఫైర్స్‌ నడిపినా.. దానిని ఫ్యాన్స్‌ ఎంజాయ్ చేస్తారు.. కానీ పాలిటిక్స్‌లోకి వచ్చేసరికి అది రివర్స్ అవుతుంది. పాలిటిక్స్‌లో అసలు విషయాల కంటే కొసరు విషయాలపైనే ప్రజలకు ఆసక్తి ఎక్కువు. వినడానికి కాస్త కష్టంగా ఉన్నా ఇదే నిజం. విజయ్‌ చెప్పే పొలిటికల్ ఐడియాలజీ కంటే.. ఇలాంటి రూమర్స్‌పైనే జనం ఎక్కువగా ఫోకస్ చేస్తారు. మరి తమిళనాడు పాలిటిక్స్‌లో ఇలాంటి కష్టం ఒక్క విజయ్‌కే వచ్చిందా? ఇలాంటి కష్టాలను ఎదుర్కొన్న రాజకీయ నాయకులు లేరా? వారు ఇలాంటి సమస్యలను ఎలా ఫేస్ చేశారు?

తమిళనాడు పాలిటిక్స్ ప్రత్యేకత

మనం ముందే చెప్పుకున్నట్టు తమిళనాడు పాలిటిక్స్‌కు, సిల్వర్ స్క్రీన్‌కు విడదీయలేని బంధం ఉంది. ఆ రాష్ట్ర పాలిటిక్స్‌లో ఓవర్‌నైట్‌లో ఎదగాలంటే సినీ గ్లామర్ చాలా ప్లస్ అవుతుంది. అయితే హీరో, హిరోయిన్ల పర్సనల్‌ లైఫ్‌పై వచ్చే ఆరోపణలు, గాసిప్స్‌ అంతే ప్రమాదకరణంగా కూడా మారతాయి. అందుకే ఎవరైనా హీరో, హీరోయిన్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారంటే చాలు.. ప్రత్యర్థులు వారి జీవితాల్లోని లూప్‌హోల్స్‌ను వెతకడంపై ఫోకస్ చేస్తారు. ఇలా చేసి సక్సెస్ కూడా అయ్యారు.

విమర్శల మధ్య పుట్టిన రాజకీయ లెజెండ్

తమిళనాడు పాలిటిక్స్‌లో బాగా పాపులర్ అయిన బంధం అంటే ఎంజీఆర్ – జయలలిత. సినీ గ్లామర్‌ను ఉపయోగించుకొని ఎంజీఆర్ తమిళనాడు పాలిటిక్స్‌లో ఓ వెలుగు వెలిగారు. ఆ తర్వాత ఆయన జయలలిత రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. కానీ డీఎంకే నేతలు ఆమెపై దారుణమైన వ్యక్తిగత విమర్శలు చేశారు. ఆమెను ఎంజీఆర్ అక్రమ సంబంధంగా చిత్రించే ప్రయత్నం చేశారు. అసెంబ్లీలో కూడా ఆమెపై దాడులు జరిగాయి. కానీ జయలలిత మాత్రం ఈ విమర్శలకు భయపడలేదు. ఆమె తనను తాను పురట్చి తలైవిగా మార్చుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఎంజీఆర్ భార్యకు ఇచ్చే గౌరవంతో అన్నీ అంటే తమిళంలో వదిన అని పిలవడం ప్రారంభించేలా తన ఇమేజ్‌ను బిల్డ్ చేసుకున్నారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తూ తనపై వచ్చిన బురదను కడిగేసుకున్నారు.

రూమర్స్‌కు చెక్ పెట్టిన కరుణానిధి

ఆ తర్వాత కరుణానిధికి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. కరుణానిధికి దయాళు అమ్మాళ్, రాజాతి అమ్మాళ్ అనే ఇద్దరు బార్యలు. ఇది తమిళనాడు పాలిటిక్స్‌లో ఓ పెద్ద వివాదానికి కారణమైంది. రాజాతి అమ్మాళ్‌తో ఆయనకున్న సంబంధం గురించి కాంగ్రెస్ నేతలు ఏకంగా అసెంబ్లీలో నిలదీశారు. కానీ కరుణానిధి ఎక్కడా తడబడలేదు. అసెంబ్లీలో నేరుగా ఓ సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చారు. అవును, ఆమె నా కుమార్తె కనిమొళికి తల్లి… అంటూ కుండబద్ధలు కొట్టారు. దీంతో రూమర్స్‌కు చెక్ పడింది.

రాజకీయాల్లోకి వచ్చాక ఖుష్బూపై కేసుల వర్షం

ఈ లిస్ట్‌లో నెక్ట్స్‌ ఉన్నది ఖుష్బూ. ఆమె కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వగానే అనేక వివాదాలు. ఓ ఇంటర్వ్యూలో ప్రీ మ్యారిటల్ సెక్స్‌ గురించి చేసిన వ్యాఖ్యలు ఓ దుమారాన్ని రేపాయి. వందలాది కేసులు నమోదయ్యాయి. నిరసనలు, ఆందోళనలు చేశారు. కానీ ఆమె కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేసి గెలిచారు. ఎక్కడా కూడా ఖుష్బూ వెనకడుగు వేయలేదు.

విజయ్‌కాంత్ ఎదుగుదలపై ప్రత్యర్థుల దాడి

నెక్ట్స్‌ విజయ్‌కాంత్.. డీఎంకే, ఏఐఏడీఎంకేలకు విజయ్‌కాంత్‌ ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న సమయంలో అతడిపై తాగుబోతు ముద్ర వేశారు. బహిరంగంగా కోప్పడటం, తన సొంత పార్టీ నేతలపై చేయి చేసుకోవడం వంటి అంశాలను ప్రత్యర్థులు హైలైట్ చేశారు. ముఖ్యంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఆయనకు తాగుడు అలవాటు ఉందని విపరీతంగా ప్రచారం చేశారు. ఈ ప్రచారం వల్ల ఆయన పార్టీ గ్రాఫ్ పడిపోయింది. సోషల్ మీడియాకు ఓ మీమ్ మెటిరియల్‌గా మారారు.

విమర్శల మధ్య కమల్ హాసన్

కమల్ హాసన్‌ కూడా ఈ ప్రచారానికి బాధితుడే అని చెప్పాలి. నిజానికి ఆయన పర్సనల్ లైఫ్ కంటే.. ఆయన వ్యాఖ్యల వల్లే ఎక్కువగా డ్యామేజ్ అయ్యారు కమల్. హిందూ టెర్రరిజం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల ఆయనకు బాగానే డ్యామేజ్ జరిగింది. ఇదే సమయంలో ఆయన పర్సనల్ లైఫ్‌, ఎఫైర్స్‌, లివ్ ఇన్ రిలేషన్‌షిఫ్స్‌ను టార్గెట్‌ చేసుకున్నారు. కానీ తన అభిప్రాయాలకు కట్టుబడి ఉంటానని చెప్పారు. దీంతో DMK అతడితో పొత్తు పెట్టుకొని ఏకంగా రాజ్యసభకు పంపింది.

విజయ్ మౌనం వ్యూహమా?.. లేక రాజకీయ రిస్కా?

సో.. హిస్టరీని చూస్తే తమిళనాడు పాలిటిక్స్‌లో ఇలాంటి రూమర్స్, క్యారెక్టర్ అసాసినేషన్‌ అనేది కొత్త కాదు. ఇప్పుడు విజయ్, త్రిష లాంటి రూమర్స్‌ కూడా కొత్త కావు. బట్.. వీటిని విజయ్ ఎలా డీల్ చేస్తాడనేది మాత్రమే ఇక్కడ అసలైన టాపిక్. విజయ్ ఇలాంటి విషయాన్ని కావాలనే పెద్దది చేసి.. ఎన్నికల ముందు ప్రత్యర్థి పార్టీలకు దిమ్మతిరిగేలా ఏదైనా షాక్ ఇస్తాడా? అనేది చూడాలి. నిజానికి ఆయన మౌనం కంటే క్లారిటీ ఇవ్వడం ముఖ్యం. కరుణానిధిలాగా క్లారిటీ ఇస్తారా? లేదా జయలలితలాగా ప్రజా సేవతో ఇమేజ్ మార్చుకుంటారా? అనేది చూడాలి. కానీ అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు మారాయి. ఇప్పుడు సోషల్ మీడియా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ ఎంత లేట్ చేస్తే.. మన క్యారెక్టర్‌ను అంత డ్యామేజ్ చేస్తారు ప్రత్యర్థులు. సో.. విజయ్ రియాక్షన్‌పైనే ఇప్పుడు అతని పొలిటికల్ కెరీర్ ఆధారపడి ఉంది. మరి విజయ్‌ మౌనం వ్యూహాత్మకమా? బస్మాసురహస్తమా? అనేది రానున్న రోజుల్లో తేలనుంది.

Also Read:అచ్చంపేటలో ‘కారు’ రిపేరుకు వస్తుందా? గువ్వల జంప్.. మర్రి మౌనం!

Story by: Anup, Big Tv

Related News

QR కోడ్‌లో మూడు బాక్స్‌లు ఎందుకుంటాయో తెలుసా ?

బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము బొద్దింకల చేత‌జిక్కి…!

నిరుద్యోగ పెయిడ్ ఆర్టిస్ట్స్! యువ సంగ్రామ సదస్సు పై సెటైర్లు! ఎఫెక్ట్ ఎవరికి!?

చైన్ స్నాచర్లుగా మారండి! స్కూటీలు ఎత్తుకెళ్లండి..! జ‌నాల‌ను దోపిడీ చేయాలంటున్న బీజేపీ ఎమ్మెల్యే ..

ఒక్కో పార్టీకి రెండేసి సార్లు అధికారం.. ఇది ధీమానా, జోస్యమా? చరిత్ర ఇదేననే మైండ్ గేమా!?

సీసీటీవీ ఫుటేజ్ భయమేనా? ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆత్మహత్యాయత్నం వెనుక అసలు నిజాలు!

మితిమీరిన కేటీఆర్ భాష‌! చిచోర‌, బేకార్‌.. స‌న్నాసీ..! సీఎంపై ప‌రుష‌ ప‌ద‌జాల ప్ర‌యోగం..!

రేవంత్ రెడ్డి సీక్రెట్ స్కెచ్.. దారికి రాకుంటే టికెట్ కట్! హస్తం పార్టీలో మొదలైన బిగ్ యాక్షన్ ప్లాన్

Big Stories

Advertisement
×