E-Paper
Advertisement

హిందీ ఇండస్ట్రీకి దమ్ము లేదు.. అంతా సేఫ్ జోన్ డ్రామాలే…సమీరా రెడ్డి షాకింగ్ కామెంట్స్!

హిందీ ఇండస్ట్రీకి దమ్ము లేదు.. అంతా సేఫ్ జోన్ డ్రామాలే…సమీరా రెడ్డి షాకింగ్ కామెంట్స్!
Advertisement

Sameera Comments: సమీరా రెడ్డి…ఇప్పటి తరానికి పెద్దగా తెలీకపోవచ్చు కాని అప్పట్లో టాలీవుడ్‌లో తన గ్లామర్‌తో యూత్ ని ఒక ఊపు ఊపేసింది.ఇక చాలా ఏళ్ళకి సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇస్తూనే సెన్సేషన్ కామెంట్స్ తో నెట్టింట మంటలు పెట్టేస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఉండే అహంకారాన్ని, సౌత్ సినిమాల పట్ల వారికి ఉండే చిన్న చూపుని బయటపెడుతూ ఈ ముద్దుగుమ్మ చేసిన కామెంట్స్ ఇపుడు ఫిలిమ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యాయి.

హిందీలో ఛాన్సులు లేని వారే సౌత్ వెళ్తారు

Advertisement

సమీరా రెడ్డి తన కెరీర్ మొదట్లో ఫేస్ చేసిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ని ఒక ఇంటర్వ్యూలో ఇలా బయటపెట్టేసింది. అప్పట్లో ఆమె టీమ్ సభ్యులే ఆమెను సౌత్ వైపు వెళ్లొద్దని వారించారని,”హిందీలో ఛాన్స్ లు రానివారే సౌత్ సినిమాల్లో నటిస్తారు” అనే ఒక చీప్ ఒపీనియన్ ఉండేదని కుండబద్దలు కొట్టింది సమీరా.అయితే సమీరా మాత్రం ఒక సౌత్ ఇండియన్ అమ్మాయిగా తన మూలాలను మర్చిపోకపోవడం ఇక్కడ మెచ్చుకోతగ్గ విషయం.బాలీవుడ్ బాబులు ఇచ్చిన సలహాలని కేర్ చేయకుండా జూనియర్ ఎన్టీఆర్, చిరు వంటి వారి సరసన అశోక్, జై చిరంజీవ వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది కూడా. ముఖ్యంగా చిరంజీవి, సూర్య, అజిత్ వంటి టాప్ స్టార్స్ తో కలిసి పని చేయడం తన తండ్రికి గర్వకారణమని చెబుతూ, బాలీవుడ్ స్టార్లకు ఇన్ డైరెక్ట్ గా చురకలంటించింది.

also read :రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ మానియా.. 50 డేస్.. అన్‌స్టాపబుల్ రికార్డ్స్!

Advertisement

ఇప్పుడు సౌత్ కోసం బాలీవుడ్ భామల క్యూ..

నాడు సౌత్ సినిమాలను తక్కువ చేసి చూసిన అదే బాలీవుడ్, నేడు టాలీవుడ్ స్టార్ల డేట్ల కోసం క్యూ కడుతుండటంపై సమీరా సెటైర్లు వేసింది. “అప్పట్లో వెళ్లొద్దు అన్నవారే, ఇప్పుడు ఇక్కడి సినిమాల కోసం పోటీ పడుతున్నారు” అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సౌత్ దర్శకులు రిస్క్ తీసుకుంటారని, కొత్త ప్రయోగాలు చేస్తారని.. అదే హిందీ మేకర్స్ ఎప్పుడూ ‘సేఫ్ జోన్’లో ఉంటారని చెప్పుకొచ్చింది.

‘ఆఖరి సవాల్’తో రీ-ఎంట్రీ.. ఇది కమ్ బ్యాక్ కాదు

ఇక దాదాపు పదేళ్ళ పాటు సినిమాలకు దూరంగా ఉన్న సమీరా, ఇప్పుడు సంజయ్ దత్ సరసన ‘ఆఖరి సవాల్’ అనే చిత్రంతో మళ్లీ మెరిసేందుకు రెడీ అయ్యింది.అయితే దీన్ని ‘కమ్ బ్యాక్’ అని పిలవొద్దని కేవలం ఒక చిన్న గ్యాప్ మాత్రమే అంటూ తన ఎంట్రీ ని విశ్లేషిస్తుంది ఈ ముద్దుగుమ్మ. మరి ప్రస్తుత గ్లామర్ ఇండస్ట్రీలో ఆమెకు పూర్వ వైభవం దక్కుతుందా? లేక కేవలం గెస్ట్ రోల్స్ కే పరిమితం అవుతుందా చూడాలి.మొత్తానికి సమీరా రెడ్డి చేసిన ఈ కామెంట్స్ బీ టౌన్ లో మంటలు పుట్టిస్తుంటే, సోషల్ మీడియాలో మాత్రం “సౌత్ పవర్ అంటే అది” అంటూ ఆమెకి సపోర్ట్ చేస్తున్నారు సౌత్ ఫిల్మీ ఫ్యాన్స్ .

also read :30 ఏళ్ల ‘ఒకే నంబర్’ మ్యాజిక్.. 390 కోట్ల జాక్‌పాట్

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×