E-Paper
Advertisement

OTT Movie : పెళ్ళైన మహిళతో కుర్రాడు… ఐఎండీబీలో 8.8 రేటింగ్… మలయాళ డార్క్ కామెడీ డ్రామా

OTT Movie : పెళ్ళైన మహిళతో కుర్రాడు… ఐఎండీబీలో 8.8 రేటింగ్… మలయాళ డార్క్ కామెడీ డ్రామా
Advertisement

OTT Movie : మలయాళం సినిమాల కోసం ఆతృతగా ఎదురు చూస్తునారు ప్రేక్షకులు. డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న ఈ సినిమాలను వదలకుండా ఓ లుక్ వేసేస్తున్నారు. అంతలా మన వాళ్ళు వీటిని ఫాలో అవుతున్నారు. ఇకపోతే రీసెంట్ గా ఒక కామెడీ సినిమా మలయాళంలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాకి ఐఎండీబీలో 8.8 రేటింగ్ ఉందంటేనే ఈ స్టోరీ ఎలా ఉంటుందో చెప్పకనే చెబుతోంది. ఒక రూమర్ చుట్టూ సాగే ఈ సినిమా ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో రాబోతోంది. మలయాళం ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ కి వస్తుంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్

సెన్నా హెగ్డే దర్శకత్వం వహించిన ఈ మలయాళ కామెడీ మూవీ పేరు ‘అవిహితం’ (Avihitham). ఈ సినిమా అక్టోబర్ 9న థియేటర్లలో రిలీజైంది. ఈ డార్క్ కామెడీ డ్రామాకు ఐఎండీబీలో 8.8 రేటింగ్ నమోదైంది. ఇందుల్ ఉన్నిరాజ్, రెంజి కన్కోల్, వినీత్ చాక్యార్, ధనేష్ కొలియత్ వంటి నటీనటులు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా 2025 నవంబర్ 14 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. .

స్టోరీలోకి వెళ్తే

Advertisement

కాసరగోడ్ జిల్లాలో ఒక చిన్న గ్రామం ఉంటుంది. ఇక్కడ గాసిప్ లు ఎక్కువ, ఉద్యోగాలు తక్కువ. ప్రకాశన్ అనే ఒక ఆకతాయి యువకుడు రాత్రి ఒక ఇంటి దగ్గర ఇద్దరు వ్యక్తుల్ని చూస్తాడు. అందులో ఒక ఆడ, ఒక మగ రాత్రి 12 గంటలకు సీక్రెట్‌గా మాట్లాడుకుంటూ ఉంటారు. అతను ఆడ మనిషి ముఖం చూడలేదు, కానీ మగ వ్యక్తి వినోద్ అని గుర్తిస్తాడు. ఈ విషయం అదే రోజు రాత్రి ప్రకాశన్ ఇంటికి వచ్చి ఫ్రెండ్స్‌తో షేర్ చేస్తాడు. ఇది అక్రమ సంబంధంగా వాళ్ళు ఊహించుకుంటారు. ఇది గ్రామంలో బాంబు లాగా పేలుతుంది. అందరూ కలిసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు.

Read Also : 15 ఏళ్ళు ఒకే రూమ్ లో బందీగా… కట్ చేస్తే ఫ్యూజులు అవుటయ్యే షాక్

Advertisement

ఎవరు ఆ ఆడ మనిషి ? ఎందుకు రాత్రి మీటింగ్? ఇది నిజమైన అక్రమ సంబంధమా ? అనే కోణంలో అందరూ గుసగుసలాడుకుంటారు. రూమర్స్ వ్యాపించాక గ్రామంలో ఆడవాళ్లపై అనుమానాలు మొదలవుతాయి. ఎవరి భార్య? ఎవరి సోదరి? ఎవరి కూతురు? అని ప్రతి ఒక్కర్నీ అనుమానిస్తారు. పురుషులు ఒక మొరల్ పొలీస్‌లా మారిపోతారు. మన గ్రామంలో ఇలాంటివి జరగకూడదు అని అంటూనే, వాళ్లే రూమర్స్‌ని పెంచి పోషిస్తారు. ఫైనల్‌లో ఒక బిగ్ ట్విస్ట్ వస్తుంది. రూమర్స్ వెనుక నిజం బయటపడుతుంది. గ్రామస్తులు కూడా ఇది తెలుసుకుని షాక్ అవుతారు. ఆ నిజం ఏంటో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చూడండి.

 

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×